- Home
- Entertainment
- Karthika Deepam: నువ్వు వాళ్ళతో వెళ్తే నేను చచ్చినంత ఒట్టు.. నిరుపమ్ కు షాకిచ్చిన స్వప్న!
Karthika Deepam: నువ్వు వాళ్ళతో వెళ్తే నేను చచ్చినంత ఒట్టు.. నిరుపమ్ కు షాకిచ్చిన స్వప్న!
Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం(karthika Deepam)సీరియల్ అక్క చెల్లెలు కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. కాగా ఈ రోజు ఏప్రిల్ 28వ తేదీ ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... నిరూపమ్, స్వప్న గొడవ పడుతున్నారు. ప్రేమ్, సత్య గురించి మాట్లాడుతూ చాలా దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి అంటూ నిరూపమ్ గొడవపడుతారు. మీరు ఇద్దరు కలవచ్చు కదా అని నిరూపమ్ అంటే స్వప్న సీరియస్ అవుతుంది. మేము కలవడం కలలో కూడా జరగదు అంటుంది.
దీంతో భోజనం తినడం మధ్యలోనే ఆపేసి వెళ్తాడు.. వాళ్ళ గురించి అలోచించి నువ్వు ఇలా తినకుండా వెళ్తే ఎలా అంటూ తిడుతుంది. అతర్వాత వాళ్ళ ఫ్రెండ్ వస్తుందని.. నువ్వు రేపు ఎక్కడికి వేళ్ళకు అని చెప్తుంది.. అప్పుడే మేము నాగార్జున సాగర్ వెళ్తున్నాం అని నిరూపమ్ అంటాడు..
మేము అంటే ఎవరు వెళ్తున్నారు అని స్వప్న అడుగుతుంది. అందుకు నిరూపమ్ మాట్లాడుతూ... నేను, జ్వాలా, హిమ వెళ్తున్నాం అని చెప్తాడు. అంతే స్వప్న అగ్గిమీద గుగ్గిళంలా రెచ్చిపోతుంది. ఏం మాట్లాడుతున్నావ్.. వాళ్ళతో వెళ్లడం ఏంటి అని సీరియస్ అవుతుంది. ఒకరు నష్ట జాతకురాలు, ఇంకొకరు ఆటో నడుపుకునేది అని ఫైర్ అవుతుంది.
నువ్వు వెళ్లడం లేదు అని చెప్తే నిరూపమ్ సీరియస్ అయి వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో జ్వాలాతో మాట్లాడుతూ ఒంటరిని అని చెప్తాడు.. అప్పుడే జ్వాలా మాట్లాడుతూ.. అప్పుడే జ్వాలా మాట్లాడుతూ రేపు నేను రాలేను సార్ అంటే పెళ్లి చూపుల అని సత్య అడుగుతాడు. నాకు అమ్మలా భోజనం పెడుతావు ఒక్క రోజు సెలవు తీసుకో అని చెప్తాడు.
శౌర్య వంతు డబ్బులు హిమకు ఇస్తారు. అతర్వాత నిరూపమ్ వచ్చి సర్జరీ వల్ల నేను రాలేను హిమ అని చెప్తాడు. అప్పుడే సౌందర్య వచ్చి నిజం చెప్పు అంటే వెళ్ళకూడదు అని స్వప్న ఒట్టు వేయించుకున్న విషయం చెప్తాడు. నేను నాగార్జున సాగర్ కు వెళ్తే అమ్మ చచ్చిపోతాను అని బెదిరించింది అని చెప్తాడు.
నెక్స్ట్ సీన్ లో మోనిత కొడుకు, శౌర్య ఇద్దరు కలుస్తారు. ఏం జ్వాలా స్పెషల్ కొత్తగా కనిపిస్తున్నావు అంటాడు. నేను డాక్టర్ సాబ్, తింగరి వెళ్తున్నాం అని చెప్తుంది. అప్పుడే హిమ ఎంట్రీ ఇస్తుంది... ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యిందని చెప్తుంది. ఇద్దరు తెగ ఫీల్ అయిపోతారు. ప్రోగ్రాం క్యాన్సిల్ అయిన విషయం మాట్లాడుకుంటారు.
అనంతరం ఇద్దరు వేరే చోటకు వెళ్తారు. బొమ్మాలు గిసే ఆమె చోటకు వెళదాం అని అంటుంది. దీంతో హిమ షాక్ అవుతుంది. నన్ని తీసుకెళ్లి నా బొమ్మ గిపిస్తుందా అని షాక్ అవుతుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. మరీ రేపటి ఎపిసోడ్ లో ఎం జరుగుతుందో చూడాలి.