MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Niharika: పెదనాన్నకి పోటీగా సంక్రాంతి బరిలోకి నిహారిక, వరుణ్‌ తేజ్‌.. `బరి` మూవీ స్టోరీ, తెలుగులో ఫస్ట్ టైమ్‌

Niharika: పెదనాన్నకి పోటీగా సంక్రాంతి బరిలోకి నిహారిక, వరుణ్‌ తేజ్‌.. `బరి` మూవీ స్టోరీ, తెలుగులో ఫస్ట్ టైమ్‌

అన్నా చెళ్లెలు వరుణ్‌ తేజ్‌, నిహారిక కలిసి ఇప్పుడు ఏకంగా పెదనాన్న చిరంజీవికే ఎసరు పెడుతున్నారు. ఆయనకు పోటీగా తమ సినిమాని దించుతున్నారు. సంక్రాంతి `బరి`లోకి దిగడం విశేషం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 28 2026, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవికి పోటీగా సంక్రాంతి `బరి`లోకి నిహారిక
Image Credit : Asianet News

చిరంజీవికి పోటీగా సంక్రాంతి `బరి`లోకి నిహారిక

సంక్రాంతికి సినిమాల పోటీ ఎక్కువవుతుంది. సంక్రాంతికి వచ్చిన సినిమాలు చాలా వరకు విజయాలు సాధించడంతో ఇప్పుడు అంతా సంక్రాంతినే టార్గెట్‌ చేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో చాలా సినిమాలున్నాయి. టాప్‌ హీరోలు చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున, బాలయ్య, శర్వానంద్‌ వంటి వారంతా ఈ పోటీలో ఉన్నారు. ఇప్పుడు మెగా డాటర్‌, మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ కూడా సంక్రాంతికే పోటీ పడుతున్నారు. ముఖ్యంగా పెదనాన్న చిరంజీవితో పోటీ పడటమే ఆశ్చర్యపరుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అన్న వరుణ్‌ తేజ్‌ హీరోగా నిహారిక `బరి` సినిమా
Image Credit : Asianet News

అన్న వరుణ్‌ తేజ్‌ హీరోగా నిహారిక `బరి` సినిమా

మెగా డాటర్‌ నిహారిక తన పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్ బ్యానర్‌లో మంచి కాన్సెప్ట్ ఉన్న చిత్రాలను నిర్మిస్తోంది. ఇప్పటికే `కమిటీ కుర్రోళ్లు` చిత్రంతో హిట్‌ అందుకుంది. ఇప్పుడు `రాకాసా`చిత్రంతో రాబోతుంది. వచ్చే వారం ఇది రిలీజ్‌ కానుంది. దీంతోపాటు తాజాగా అన్నయ్య వరుణ్‌ తేజ్‌ హీరోగా సినిమా తీస్తోంది. దీనికి `బరి` అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. నేడు శనివారం(మార్చి 29)న ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ గెస్ట్ గా హాజరయ్యారు. తొలి క్లాప్‌ కొట్టారు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

35
సంక్రాంతికే `బరి` సినిమా రిలీజ్‌
Image Credit : Asianet News

సంక్రాంతికే `బరి` సినిమా రిలీజ్‌

తాజాగా ఈ మూవీకి సంబంధించిన విశేషాలను నిర్మాత నిహారిక, వరుణ్‌ తేజ్‌ పంచుకున్నారు. వాలీబాల్‌ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా చిత్రమిదని తెలిపారు. విలేజ్‌ డ్రామా మెయిన్‌గా ఉంటుందని, హ్యూమన్‌ ఎమోషన్స్, ఎథిక్స్, ఫన్‌, డ్రామా ప్రధానంగా సినిమా సాగుతుందని తెలిపింది. మొదటిసారి ఫ్యామిలీ మెంబర్‌తో సినిమా చేయడం హ్యాపీగా ఉందని చెప్పింది నిహారిక. ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలోకి దించుతున్నట్టు వెల్లడించింది. ఈ మూవీ సంక్రాంతికి వస్తే బాగుంటుందని, అందరికి కనెక్ట్ అవుతుందని, అందుకే పొంగల్‌కి బరిలోకి దిగుతున్నట్టు  చెప్పింది నిహారిక.

45
పోటీ గురించి ఆలోచిస్తామని తెలిపిన వరుణ్‌ తేజ
Image Credit : Asianet News

పోటీ గురించి ఆలోచిస్తామని తెలిపిన వరుణ్‌ తేజ

అయితే పెదనాన్న సినిమా, పవన్‌ కళ్యాణ్‌ బాబాయ్‌ సినిమాలు కూడా వస్తే, తమ రిలీజ్‌ డేట్‌ విషయాన్ని ఆలోచిస్తామని, ఇప్పటికైతే సంక్రాంతికి ఫిక్స్ అయినట్టు చెప్పారు వరుణ్‌ తేజ్‌. `నిహారిక ఎంచుకుంటున్న కథలు, చేస్తున్న సినిమాలు బాగుంటున్నాయి. అది నాకు బాగా నచ్చింది. ఈ మూవీ కూడా అనుకోకుండా వచ్చింది. నిహారికతో చేయాలని నేను అనుకోలేదు, నాతో చేయాలని ఆమె అనుకోలేదు. కానీ మా ఇద్దరి వద్దకు ఈ స్క్రిప్ట్ వచ్చింది, ఎగ్జైటింగ్‌గా ఉంద`ని చెప్పారు వరుణ్‌తేజ్‌.

55
వాలీబాల్‌ నేపథ్యంలో సాగే విలేజ్‌ డ్రామా `బరి`
Image Credit : Asianet News

వాలీబాల్‌ నేపథ్యంలో సాగే విలేజ్‌ డ్రామా `బరి`

స్పోర్ట్స్ నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. మనకు రబ్బీ అంటే ఏంటో కూడా తెలియని టైమ్‌లో రాజమౌళి `సై` సినిమా చేశారని, మొదటిసారి వాలీబాల్‌ నేపథ్యంలో ఈ మూవీని తీస్తున్నామని, స్పోర్ట్స్ మాత్రమే కాదు, ఇందులో మంచి హ్యూమన్‌ ఎమోషన్స్, విలేజ్‌ డ్రామా మెయిన్‌గా ఉంటుందని, కొత్త అనుభూతిని ఇస్తుందని దర్శకుడు యదు వంశీ తెలిపారు. ఆయన `కమిటీ కుర్రోళ్లు` చిత్రాన్ని రూపొందించారు. నిహారిక బ్యానర్‌లో ఆయనకిది రెండో సినిమా.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nana Patekar Passed away: విలక్షణ నటుడు నానా పటేకర్ కన్నుమూత, గోవాలో మరణం.. కారణం ఇదే
Recommended image2
The Paradise 14 Days Collection: దారుణంగా పడిపోయిన ప్యారడైజ్‌, నానికి లాస్ట్ ఛాన్స్.. ఇంకా ఎంత రావాలంటే?
Recommended image3
ముకేశ్ తో లవ్ ట్రాక్ అందుకే, కారణం రివీల్ చేస్తూ ఏడ్చేసిన వర్షిణి.. అపూర్వ విరక్తి పుట్టించే కంటెస్టెంట్
Related Stories
Recommended image1
Ram Charan: అల్లు అరవింద్‌ తన స్వార్థం కోసం రామ్‌ చరణ్‌తో సినిమాలు తీశాడా? మగధీర, ధృవ నిర్మించడం వెనుక అసలు కథ ఇదే
Recommended image2
Allu Arjun కోసం అమ్మ నిర్మల చేసిన త్యాగం ఏంటో తెలుసా?.. ఆమెకి ఇష్టమైన బన్నీ మూవీ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved