వైరల్ గా నిహారిక ప్రేమ లేఖ... విడాకులైన తర్వాత వారిని పరిచయం చేసిన స్టార్ కిడ్!
నిహారిక కొణిదెల ప్రేమ లేఖ పేరుతో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. విడాకులు తీసుకున్న నిహారిక సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తి రేపుతోంది.
Niharika Konidela
నిహారిక కొణిదెల ప్రస్తుతం సింగిల్. ఈ స్టార్ కిడ్ భర్త వెంకట చైతన్యతో విడిపోయింది. 2020 డిసెంబర్ లో నిహారిక పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో ఘనంగా 5 రోజులు వివాహ వేడుకలు జరిగాయి. మెగా హీరోలందరూ ఈ వేడుకకు హాజరయ్యారు.
Niharika Konidela
ఓ మూడేళ్లు శుభ్రంగా కాపురం చేసిన నిహారిక-వెంకట చైతన్య మధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో విడాకులు తీసుకున్నారు. కూకట్ పల్లిలోని ఫ్యామిలీ కోర్ట్ నిహారిక-వెంకట చైతన్యలకు విడాకులు మంజూరు చేసింది. నిహారికకు నటన అంటే ఇష్టం. సినిమాల్లో నటించాలనేది ఆమె కోరిక.
Niharika Konidela
చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండాలని అత్తింటి వారు ఆంక్షలు పెట్టడం నచ్చని నిహారిక భర్తతో విడిపోయారనే ఓ వాదన ఉంది. ఏది ఏమైనా ఈ ఏడాది ప్రారంభంలో నిహారిక విడాకులపై స్పష్టత ఇచ్చేసింది. తనకు కొంత మోరల్ సపోర్ట్ కావాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
Also Read Tamannaah: ప్రియుడితో తమన్నా పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?
Niharika Konidela
విడాకులు అనంతరం నిహారిక కెరీర్ పై దృష్టి పెట్టింది. నటిగా, నిర్మాతగా రాణించాలి అనుకుంటుంది. ఆల్రెడీ డెడ్ ఫిక్సెల్స్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ లో నటించింది. ప్రొడక్షన్ హౌస్ పేరిట ఆఫీస్ ఓపెన్ చేసి బడ్జెట్ లో కొన్ని ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తుంది.
Niharika Konidela
సింగిల్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న నిహారిక లవ్ లెటర్ పేరుతో ఓ వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. సదరు వీడియోలో తల్లితో పాటు వదిన లావణ్య త్రిపాఠి, శ్రీజ, సుస్మితతో పాటు మరికొందరు ఉన్నారు. కష్టనష్టాలు, సుఖ సంతోషాల్లో మద్దతుగా నిలిచారంటూ వారి పట్ల తన ప్రేమను వ్యక్తం చేసింది. ఈ వీడియో వైరల్ అవుతుంది.
Niharika Konidela
కాగా నవంబర్ 1న నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్ వివాహం జరిగింది. ఇటలీ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. చాలా కాలంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమిస్తున్న వరుణ్ తేజ్ ఆమెతో ఏడడుగులు వేశారు. మెగా కుటుంబంలోకి నిహారిక కోడలిగా అడుగుపెట్టింది.