- Home
- Entertainment
- Niharika: ఆయనతో వీడియో డిలీట్ చేసిన నిహారిక... అంటే ఆ పుకార్లు నిజమేనా? అందుకే సోషల్ మీడియాకు దూరంగా?
Niharika: ఆయనతో వీడియో డిలీట్ చేసిన నిహారిక... అంటే ఆ పుకార్లు నిజమేనా? అందుకే సోషల్ మీడియాకు దూరంగా?
ఈ మధ్య నాగబాబు (Nagababu) కూతురు నిహారిక వరుస వివాదాల్లో చిక్కుకున్నారు. ఆమె నివసిస్తున్న ఫ్లాట్ లో నైట్ పార్టీలు నిర్వహిస్తున్నారంటూ నైబర్స్ కంప్లైంట్ చేశారు. సడన్ గా ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ డీయాక్టివేట్ చేశారు. ఇక పబ్ పై జరిగిన దాడిలో పట్టుబడ్డ నిహారిక డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు.

Nagababu - Niharika
హీరోయిన్ గా వెలిగిపోదామన్న నిహారిక (Niharika Konidela)కలలు పెళ్లితో చెదిరిపోయాయి. ఆమె నటించిన చిత్రాలేవీ విజయం సాధించలేదు. ఈ క్రమంలో నటిగా నిహారిక ఓ ఇమేజ్ సొంతం చేసుకోలేకపోయింది. దీంతో పేరెంట్స్ మాట విని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత ఆమెను వివాదాలు చుట్టుముట్టడం విశేషం.
Niharika Konidela
వాటిలో ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయడం ఒకటి. నిహారిక సడన్ గా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేశారు. ఇంస్టాగ్రామ్ లో ఆమె పేజీ కనిపించకపోవడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. నిహారిక అకౌంట్ ఎవరైనా హ్యాక్ చేశారా? లేదా అధికారికంగా సస్పెండ్ అయ్యిందా? అనే అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే నిహారిక స్వయంగా తన అకౌంట్ డిలీట్ చేసినట్లు తెలిసి కన్ఫ్యూజ్ అయ్యారు.
Niharika Konidela
నిహారిక చర్యకు కారణం ఏమిటని విశ్లేషిస్తే... ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయడానికి ముందు ఆమె తన జిమ్ ట్రైనర్ తో కలిసి ఓ వీడియో చేశారు. ట్రైనర్ వీపుపై నిహారిక కూర్చోగా, అతను పుష్ అప్స్ చేస్తుంటే ఆ వీడియోలో ఆమె నవ్వులు పూయించారు. ఈ వీడియో కారణంగానే నిహారిక తన అకౌంట్ డిలీట్ చేయాల్సి వచ్చిందని పుకార్లు వినిపించాయి.
సదరు వీడియో విషయంలో నిహారిక అత్తమామలు ఆమెను మందలించారట. పెళ్ళైన యువతి పరాయి పురుషులతో అలాంటి వీడియోలు చేయడం ఏమిటంటూ కోప్పడ్డారని, ఈ గొడవ కారణంగానే నిహారిక ఇంస్టాగ్రామ్ కి దూరమయ్యారన్న వాదనలు గట్టిగా వినిపించాయి. అయితే ఈ వాదనల్లో నిజం ఉందనిపిస్తుంది.
నిహారిక తాజాగా తన అకౌంట్ ని తిరిగి పునరుద్ధరించారు. ఇంస్టాగ్రామ్ లోకి ఆమె రీఎంట్రీ ఇవ్వడంతో పాటు అకౌంట్ యాక్టీవ్ లోకి తెచ్చారు. కాగా నిహారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ పరిశీలిస్తే గతంలో జిమ్ ట్రైనర్ తో కలిసి చేసిన వీడియో డిలీట్ చేశారు. ఆ వీడియో ఇంస్టాగ్రామ్ లో లేదు. కాబట్టి ఆ వీడియో విషయంలో నిహారికతో అత్తింటివారు గొడవపడ్డ విషయం నిజమేనా అనిపిస్తుంది.
Niharika Konidela
అయితే నిహారిక ఈ మధ్య మరోమారు సదరు జిమ్ ట్రైనర్ తో కనిపించారు. తన జిమ్ సెషన్స్ లో అతనితో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏది ఏమైనా నిహారిక మరలా ఇంస్టాగ్రామ్ లో అందుబాటులోకి రావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవలే ఆమె నిర్మాతగా ఓ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసింది.