MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఈవారం ఓటీటీ చిత్రాలు, వెబ్ సిరీస్ లు..మజా ఇచ్చే యాక్షన్ థ్రిల్లర్స్ రెడీ, నితిన్ కష్టానికి మరో ఛాన్స్

ఈవారం ఓటీటీ చిత్రాలు, వెబ్ సిరీస్ లు..మజా ఇచ్చే యాక్షన్ థ్రిల్లర్స్ రెడీ, నితిన్ కష్టానికి మరో ఛాన్స్

నితిన్ తమ్ముడు చిత్రంతో పాటు మరికొన్ని హాలీవుడ్ థ్రిల్లర్ చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఈవారం ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 28 2025, 09:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఈ వారం ఓటీటీ చిత్రాలు, వెబ్ సిరీస్ లు
Image Credit : Instagram/jacqueline, SVC

ఈ వారం ఓటీటీ చిత్రాలు, వెబ్ సిరీస్ లు

ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై ప్రేక్షకులను అలరించేందుకు పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో, జీ 5, సోనీ లివ్ లాంటి ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌ కొత్త చిత్రాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. థ్రిల్లర్, డ్రామా, యాక్షన్, మిస్టరీ, కామెడీ, ఫ్యామిలీ డ్రామాలు ఇలా వివిధ జోనర్లకు చెందిన కంటెంట్ ఓటీటీ ప్రియులకు వినోదం అందించనుంది. ఈ వారం ఓటీటీ లో విడుదలయ్యే సినిమాలు, సిరీస్ ల వివరాలు ఇప్పుడు చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నెట్‌ఫ్లిక్స్‌ లో రిలీజ్ కానున్నవి
Image Credit : X/SVC

నెట్‌ఫ్లిక్స్‌ లో రిలీజ్ కానున్నవి

తమ్ముడు(Thammudu)

నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ థియేటర్లలో విడుదలై నిరాశపరిచింది. ఒక తమ్ముడు తన అక్కకి ఇచ్చిన మాటని ఎలా నిలబెట్టుకున్నాడు అనేది ఈ చిత్ర కథ. నితిన్ కష్టపడి ఈ చిత్రం కోసం వర్క్ చేసినా ఫలితం దక్కలేదు. అయితే ప్రేక్షకులని ఆకట్టుకునేందుకు తమ్ముడు చిత్రానికి ఓటీటీ రూపంలో మరో అవకాశం దక్కింది. 

రిలీజ్ తేదీ: ఆగస్టు 1

బియాండ్ ది బార్ (Beyond The Bar)

ఒక న్యాయవాది తన న్యాయ వ్యవస్థలోని విలువల కోసం పోరాడుతూ, తన మెంటార్‌కి ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడో చూపే కొరియన్ డ్రామా సిరీస్ ఇది.

రిలీజ్ తేదీ: ఆగస్టు 2

36
జియో హాట్‌స్టార్ లో రిలీజ్ కానున్నవి
Image Credit : JioHotStar

జియో హాట్‌స్టార్ లో రిలీజ్ కానున్నవి

అడ్డా ఎక్స్‌ట్రీమ్ బ్యాటిల్ (Adda Extreme Battle)

ఎల్విష్ యాదవ్ హోస్ట్‌గా చేస్తున్న ఈ రియాలిటీ షోలో సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు పాల్గొని సందడి చేయనున్నారు. వివిధ గేమ్స్, టాస్క్ లతో ఈ షో ఉత్కంఠభరితంగా ఉంటుంది. 

రిలీజ్ తేదీ: జూలై 28

బ్లాక్ బ్యాగ్ (Black Bag)

స్టీవెన్ సోడర్‌బర్గ్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ చిత్రం ఇది. దేశ ద్రోహం కేసులో అనుమానితురాలైన భార్యపై నమ్మకమా? లేక దేశ భద్రతపై విధేయతా? అనే రెండు అంశాల మధ్య నలిగే జార్జ్ వుడ్‌హౌస్ కథగా ఈ చిత్రం రూపొందింది. మైఖేల్ ఫాస్‌బెండర్, కేట్ బ్లాంచెట్, నావోమీ హ్యారిస్ ప్రధాన పాత్రల్లో నటించారు. రిలీజ్ తేదీ: జూలై 28

క్యూకీ సాస్ భీ కభీ బహు థీ సీజన్ 2 (Kyunki Saas Bhi Kabhi Bahu Thi Season 2)

రాజకీయ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మళ్లీ తులసి విరాణీగా ఈ సీజన్‌లో కనపించనున్నారు. ఆధునిక తరం పిల్లలతో బంధాలు ఎలా ఎదుర్కొనాలో తులసి ఎలా నేర్పుతుందనేది ఈ సిరీస్ కథ.

రిలీజ్ తేదీ: జూలై 29

పతి పత్నీ ఔర్ పంగా (Pati Patni Aur Panga)

జంటలు ఒకరికొకరు వినోదభరితమైన సవాళ్లు విసురుతూ తమ బంధాన్ని పరీక్షించుకునే ఎంటర్టైనింగ్ రియాలిటీ షో ఇది.

రిలీజ్ తేదీ: ఆగస్టు 2

46
ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానున్నవి
Image Credit : Instagram/jacqueline fernandez

ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానున్నవి

హౌస్‌ఫుల్ 5 (Housefull 5)

హౌస్ ఫుల్ ప్రాంఛైజీలో వచ్చిన మరో చితం హౌస్ ఫుల్ 5. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, ఫర్దీన్ ఖాన్, నానా పాటేకర్, రితేష్ దేశ్‌ముఖ్, చిత్రాంగదా సింగ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 

రిలీజ్ తేదీ: ఆగస్టు 1

56
ZEE5 లో రిలీజ్ కానున్నవి
Image Credit : Youtube/Zee5

ZEE5 లో రిలీజ్ కానున్నవి

బకాయితీ (Bakaiti)

ఓ పాత కాలం గాజియాబాద్ నేపథ్యములో నడిచే ఈ హృద్యమైన ఫ్యామిలీ డ్రామా. ఆర్థిక ఇబ్బందులతో బాధపడే కటారియా కుటుంబంలో జరిగే సంఘర్షణల చుట్టూ ఈ సిరీస్ కథ తిరుగుతుంది.

రిలీజ్ తేదీ: ఆగస్టు 1

66
సోనీ లివ్ లో రిలీజ్ కానున్నవి
Image Credit : Youtube/ Peacock

సోనీ లివ్ లో రిలీజ్ కానున్నవి

ట్విస్టెడ్ మెటల్ సీజన్ 2 (Twisted Metal Season 2)

వీడియో గేమ్ ఆధారంగా రూపొందిన ఈ యాక్షన్ సిరీస్‌లో ఓ డెజర్ట్ మిల్క్‌మ్యాన్ తన జీవితం కోసం పోరాడతాడు. డేంజరస్ వెహికల్స్, పోటీలు, జీవన పోరాటం అన్నీ ఇందులో ఉంటాయి.

రిలీజ్ తేదీ: ఆగస్టు 1

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Jyoti Poorvaj: 15 రోజులు ఇంటికి వెళ్ళలేదు, అతడిని పెళ్లి చేసుకోవాలని అప్పుడే డిసైడ్ అయ్యా.. డబ్బు కోసం కాదు
Recommended image2
Rohith Naidu Remuneration: సంచలన కంటెస్టెంట్‌ రోహిత్‌ బిగ్‌ బాస్‌ పారితోషికం ఎంతో తెలుసా? ఇందులోనూ అన్యాయమేనా
Recommended image3
Rohith: సీజన్ 10లో బిగ్గెస్ట్ షాక్, రోహిత్ అవుట్.. ఎలిమినేషన్ కంటే రామ్ ప్రసాద్ అన్న ఇలా చేయడమే ఎక్కువ బాధ
Related Stories
Recommended image1
కోలుకోలేని దెబ్బ కొట్టిన సౌందర్య మూవీ.. డబ్బులు లేక బతిమాలుకున్న ఆ నిర్మాత ఆస్తి ఇప్పుడు 2000 కోట్లు ?
Recommended image2
కారులో ఒంటరిగా తీసుకెళ్లి ఏఎన్నార్ కి రొమాన్స్ నేర్పించిన హీరోయిన్ ఎవరో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved