- Home
- Entertainment
- యాసిడ్ పోస్తా.. చేతబడి చేయిస్తా.. రోడ్డుమీదకు రాకు అంటూ.. యాంకర్ రష్మీకి నెటిజన్ బెదిరింపులు
యాసిడ్ పోస్తా.. చేతబడి చేయిస్తా.. రోడ్డుమీదకు రాకు అంటూ.. యాంకర్ రష్మీకి నెటిజన్ బెదిరింపులు
యాంకర్ రష్మీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆగడంలేదు. ఇక డైరెక్ట్ గా బెదిరింపులకే దిగుతున్నారు. ఆమె చుట్టు వివాదం రాజుకుంటోంది. కొంత మంది దారుణంగా తిట్టిపోస్తున్నారునెటిజన్లు

యాంకర్ రష్మీతో నెటిజన్ల సోషల్ మీడియా వార్ తారాస్థాయికి చేరింది. మూగజీవాల తరపున మాట్లాడుతున్న రష్మీకిమానవత్వం ఎటు పోయిందంటూ..మండిపడుతున్నార సోషల్ మీడియా జనాలు ఇక కొంత మంది అయితే ఆమెపై కోపంతో ఊగిపోతున్నారు. నువ్వు బయట తిరగొద్దంటూ బెదిరింపులకుదిగుతున్నారు.
రీసెంట్ గా ఓ నెటిజన్ ఆమెకు పెట్టిన మెసేజ్ వైరల్ అవుతోంది. నువ్వు ఇంట్లోనే ఉండు.. పాపిస్టిదానా.. బయటకు వస్తే యాసిడ్ పోస్తాం.. చేతబడి చేయిస్తాం అంటూ... రష్మీపై విరుచుకుపడ్డాడు. ఇలా చాలా మంది నెటిజన్లు రష్మీతీరుపై రకరకాలుగా స్పందిస్తున్నారు. అసలు ఇదంతా రష్మీ కుక్కల తరపున మాట్లాడటం వల్లే వచ్చింది అసలు విషయానికి వస్తే..
అంబర్ పేట్ లో కుక్కల దాడిలో పసికందు మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో చాలా మంది సినీ..రాజకీయ ప్రముఖులు రకరకాలుగా స్పందించారు. ముఖ్యంగా మూగజీవాల అంటే ప్రాణం పెట్టే రష్మీ స్పదన చాలా మందికి కోపం తెప్పించింది. కుక్కల దాడిలో బాలుడు మరణించడం బాధకలిగించే విషయమే.. అయితే కుక్కలకు సెపరేట్ స్పేస్ ఇవ్వాలి... వాటి పట్ల దయతో ఉండాలి అంటూ ఆమె మాట్లాడిన మాటలకు ఫైర్ అవుతున్నారు జనాలు.
Rashmi gautam
బాబు మరణంపై కాస్త కూడా జాలి కలగలేదా అంటూ మండిపడుతున్నారు. ఈక్రమంలో నెటిజన్లకు ఆమెకు గత కొన్ని రోజులుగా వాదనలుజరుగుతున్నాయి. ఈక్రమంలోనే ఆమెకు బెదిరింపులు కూడా తప్పడంలేదు. అయితే రష్మీ తరపున కూడా కొంత మంది మాట్లాడుతున్నారు. వీధి కుక్కలకు ఫుడ్, షెల్టర్ ఉంటే ఇలాంటి సంఘటలను జరగవంటున్నారు. ఆకలితో ఉండి బయట తిరగడం వల్లే ఇలా జరుగుతుందంటున్నారు.
ఈక్రమంలో ఈ సంఘటనపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నాలుగైదు రోజులుగా ఎలా స్పందిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఈ విషయంలో బాగా ఎమోషనల్ కూడా అయ్యారు వర్మ. బాబు తరపున మాట్లాడుతూ.. సోకాల్డ్ మూగజీవాల ప్రేమికులకు గట్టిగ కౌంటర్ కూడా ఇస్తున్నారు. అంతే కాదు... హైదరాబాద్ మేయర్ ను టార్గేట్ చేస్తూ.. వరుస ట్వీట్లు పెడుతున్నారు వర్మ. ఇక ఇటు రష్మితో కూడా నెటిజన్ల సోషల్ మీడియా వార్ గొనసాగుతోంది.