నజ్రియా 'సూక్ష్మదర్శిని' OTT రివ్యూ
ప్రియా అనే అమ్మాయికి పొరుగింట్లో జరుగుతున్న విషయాలు అనుమానాస్పదంగా అనిపిస్తాయి. మాన్యువల్ అనే వ్యక్తి తన తల్లి అల్జీమర్స్ తో బాధపడుతుందని చెబుతాడు, కానీ ప్రియాకు అతని ప్రవర్తనపై అనుమానం కలుగుతుంది. ఈ మిస్టరీని ప్రియా ఎలా ఛేదించిందనేది సినిమాలో చూడాలి.

Nazriya Nazim, Sookshmadarshini, Ott movie Review
ఓటిటిలో చూసే థ్రిల్లర్ సినిమాలకు కొన్ని ప్రత్యేక లక్షణాలు కోరుకుంటారు ఆడియన్స్. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగాలి. అలాగే ఆఖరున వచ్చే అద్భుతమైన ట్విస్టులతో అలరించాలి. టైట్ స్క్రీన్ ప్లే ఉండాలి. ఇలాంటి సినిమాలకు ఎక్కువ మళయాళం నుంచే వస్తూంటాయి.
అలాంటి ఓ చిత్రం 'సూక్ష్మదర్శిని' . రీసెంట్ గా డిస్నీ హాట్ స్టార్ లోకి వచ్చి అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఫెరఫెక్ట్ స్క్రిప్టు, బలమైన కథాకథనాలు .. పాత్రలను మలిచితీరు సినిమా పరుగెత్తింది. చూడటానికి కూర్చుంటే చివరిదాకా చూడాల్సిందే అన్నట్లుగా సీన్స్ నడిచాయి. ఎక్కడా ల్యాగ్ , బోర్ లేకుండా తీసిన ఈ సినిమా కథేంటి, అసలు ఏమిటి ఈ చిత్రం గొప్పదనం చూద్దాం.
Basil Nazriya Sookshmadarshini final collection report out
స్టోరీ లైన్
ప్రియా (నజ్రియా) కొంచెం ఎక్కువ స్మార్ట్. ప్రతీది సూక్ష్మంగా పరిశీలించగల నేర్పు గల ఈ కాలం అమ్మాయి ఆమె. ప్రియ తన భర్త ఆంటోని, కూతరు కాణితో ఓ కాలనీలో నివసిస్తుంటుంది. ప్రియ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. వాళ్ల ప్రక్కింట్లోకి చాలా కాలం క్రితం ఆ ఊరు నుంచి వెళ్లిపోయిన మాన్యుయల్ (బాసిల్ జోసెఫ్) వస్తాడు. అతని తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడం వలన తిరిగి ఆ ఊరుకి తీసుకుని రావాల్సిన సిట్యువేషన్ ఏర్పడుతుంది.
Nazriya Basil Sookshmadarshini film ott update out
ప్రియా వాళ్ల కిటికీలో నుంచి చూస్తూంటే మాన్యుయెల్ వాళ్ల ఇల్లు క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. అతని తల్లి అల్జీమర్స్ తో బాధపడుతున్నట్టు మాన్యుయెల్ అందరికి చెబుతాడు. అందుకు తగినట్లుగానే మధ్యలో ఒకటి రెండు సార్లు ఆమె ఇల్లు వదలి వెళ్లిపోవడం జరుగుతుంది. అప్పుడు .. మాన్యుయెల్ ఆమె ఎక్కడుందో తెలుసుకుని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అందరు సానుభూతి చూపించి మాన్యుయెల్ కు సాయిం చేస్తూంటారు.
basil joseph and nazriya movie sookshmadarshini
కానీ మాన్యుయెల్ తల్లి ప్రవర్తనను గమనిస్తూ వస్తున్న ప్రియా, ఆమె అల్జీమర్స్ తో బాధపడుతుందనేది అబద్ధమని భావిస్తుంది. అలాగే మాన్యుయెల్ ప్రవర్తన కూడా ఆమెకి కాస్త అనుమానంగా అనిపిస్తుంది. ఒకసారి తన తల్లి కనిపించకుండా పోయిందని మాన్యుయెల్ చెప్పిన నాలుగు రోజులకు, ఓ రాత్రివేళ ఆ ఇంట్లోనే అతని తల్లిని ప్రియ చూస్తుంది. ఆ మరుసటి రోజు మాన్యుయెల్ ను అతని తల్లిని గురించి అడిగితే, ఇంకా ఆమె జాడ దొరకలేదనే చెబుతాడు. అప్పుడు ఏమైంది ...ఎందుకు మాన్యుయెల్ అబద్దం ఆడాడు. అసలు మాన్యుయెల్ ఇంట్లో ఏం జరుగుతోంది, ప్రియ ఆ మిస్టరీని ఎలా ఛేథించింది అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
the monitor lizard in Sookshmadarshini is neither original nor cg says art director vinod raveendran
ఎలా ఉందంటే..
మన చుట్టూ మనకు తెలియకుండా ఎన్నో సీక్రెట్ లో ఉంటాయి. అలాంటి ఓ రహస్యాన్ని హాస్యంతో కలిపి ఓ పొరిగింటి అమ్మాయి బయటపెడితే మనకెలా ఉంటుంది.. ఆ పంథాన రూపొందించిన సినిమానే సూక్ష్మదర్శిని. ఓ రకంగా చెప్పాలంటే ఇదో వినూత్న కథ, కథతో పాటు స్క్రీప్లే కూడా అంతే వైవిధ్యంగా నడుస్తుంది. చిన్న కథ, చిన్న సస్పెన్స్ కానీ స్క్రీన్ ప్లే పరంగా ఎన్ని టూల్స్ వాడాలో అన్ని వాడి టైట్ గా రూపొందించారు.
Nazriyas Sookshmadarshini India net collection report out
టైట్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని ఎంత బాగా థ్రిల్ చేయవచ్చో ఈ సినిమా ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది. సినిమా ప్రారంభమైన పది నిముషాల్లోపై పూర్తిగా కథలోకి వెళ్లిపోయారు. అలాగే మనం సినిమా మొదటి నుంచి చివరి దాకా అసలు తెరపై ఏం క్రైమ్ జరుగుతోంది. క్రిమినల్ ఎవరు, పట్టుబడతాడా అనే యాంగిల్ లోనే ఆలోచిస్తూంటాం. అలా మనం లీనమై చూడటమే డైరక్టర్ ఎక్సపెక్ట్ చేసింది కూడా కావచ్చు.
అలాగే ఈ సినిమాలో జరిగే ఇన్విస్టిగేషన్ ఎప్పుడూ ఏదో జరుగుతోంది అన్నట్లుగానే నడుస్తుంది తప్పించి, ఎవరు చేస్తున్నారు అనేది మనకు ఆలోచించే అవకాసం ఇవ్వదు. మొదటి నుంచి చివరిదాకా మాన్యువల్ పాత్ర చాలా బ్యాడ్ ఇంటెన్ష్ తో ఉన్నట్లు , ఏదో దాస్తున్నట్లు హింట్ ఇస్తూండటంతో మన దృష్టి వేరే వైపుకు వెళ్లదు. అతను ఏం దాస్తున్నాడు...అన్నదే ముఖ్యాంశం. ఆ సీన్స్ బాగా పండాయి.
nazriya nazim performance in Sookshmadarshini got huge appreciation from audience
ఈ సినిమా ఆల్రెడ్ హిచ్ కాక్ Rear Window (1954), సైకో (1960) ని గుర్తు చేయచ్చు. అయితే సైక్లాజికల్ థ్రిల్లర్ గా , ఇన్విస్టిగేషన్ వర్క్ తో మాత్రం సినిమా బాగా వర్కవుట్ చేసారు. అసలు సూక్ష్మ దర్శిని అనే టైటిల్ లోనే కథను కొంత చెప్పే ప్రయత్నం చేసారు దర్శకుడు. క్లైమాక్స్ కొద్దిగా తేలిపోయింది అనిపించవచ్చు కానీ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఖచ్చితంగా అధ్యయనం చేయాల్సిన సినిమా. తక్కువ ఖర్చు హై స్టాండర్డ్స్ తో స్టోరీ టెల్లింగ్ ఎలా చేయవచ్చు అనేది ఈ సినిమా ద్వారా నేర్చుకోవచ్చు.
Sookshmadarshini movie Nazriya Nazim basil joseph Christo Xavier
చూడచ్చా
సూక్ష్మదర్శిని ఓ విభిన్న తరహా క్రైమ్ కామెడీ థ్రిల్లర్ . ఫన్ తో కలిసిన థ్రిల్లింగ్ సినిమాకు వెన్నుముకలా నిలుస్తుంది. క్రైమ్ మూవీ లవర్స్ మిస్ కాకుండా చూడాల్సిన మూవీ ఇది.
ఎక్కడుంది
డిస్నీ 'హాట్ స్టార్'లో తెలుగులో ఉందీ చిత్రం