MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Toxic : నయనతార నుంచి కియారా అద్వానీ వరకు యష్ తో నటిస్తున్న ఐదుగురు హీరోయిన్ల వయసు ఎంత?

Toxic : నయనతార నుంచి కియారా అద్వానీ వరకు యష్ తో నటిస్తున్న ఐదుగురు హీరోయిన్ల వయసు ఎంత?

సౌత్ సూపర్ స్టార్ యష్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమా రిలీజ్‌కు ముందే పెద్ద సంచలనం సృష్టిస్తోంది. సినిమా కథతో పాటు, ఇందులో నటిస్తున్న ఐదుగురు హీరోయిన్లు స్పెషల్ గా నిలవబోతున్నారు. ఈ ఐదుగురు తారలన వయసు ఎంతో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 04 2026, 11:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వైరల్ అవుతున్న టాక్సిక్ ప్రోమో వీడియో..
Image Credit : youtube

వైరల్ అవుతున్న టాక్సిక్ ప్రోమో వీడియో..

రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న 'టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫార్ గ్రోన్-అప్స్' సినిమా నుంచి కొత్త ప్రోమో వీడియో వచ్చేసింది. ఇందులో సినిమాలో నటిస్తున్న ఐదుగురు హీరోయిన్ల లుక్స్‌ను రివీల్ చేశారు. ఈ సినిమా కథతో పాటు, భారీ తారాగణం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.ఇప్పుడు చిత్రబృందం సినిమా నుంచి 'లేడీస్ అండ్ లేడీస్' పేరుతో ఓ కొత్త ప్రోమో వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో ఐదుగురు హీరోయిన్ల లుక్స్‌ను పరిచయం చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఈ ఐదుగురు హీరోయిన్ల వయసుపై పెద్ద చర్చే నడుస్తోంది. యశ్ కంటే ఎవరు పెద్ద, ఎవరు చిన్న అని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
హాట్ టాపిక్ గా ఐదుగురు హీరోయిన్ల వయసు..
Image Credit : Asianet News

హాట్ టాపిక్ గా ఐదుగురు హీరోయిన్ల వయసు..

డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ తీస్తున్న ఈ సినిమాలో నయనతార, కియా రా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరిలో అందరికంతే పెద్ద నయనతార. ఆమె వయసు ప్రస్తుతం 41 సంవత్సరాలు. ఈ ఏజ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగడమే కాదు.. భారీగా రెమ్యునరేషన్ కూడా తీసుకుంటుంది. విషేషం ఏంటంటే.. టాక్సిక్ లో నటిస్తున్న ఐదుగురు హీరోయిన్లలో నయనతార పెద్దది.. హీరో యష్ కంటే కూడా ఆమే ఏడాది పెద్దది.

Related Articles

Related image1
Sr NTR: ఎన్టీఆర్ ను ఎదిరించి మాట్లాడే దమ్మున్న మొనగాడు ఎవరో తెలుసా? బాలకృష్ణ చెప్పిన రహస్యం..
Related image2
560 కోట్ల ఆస్తి.. లగ్జరీ కార్లు, సొంత వ్యాపారాలతో మహా రాణిలా ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ ఎవరో తెలుసా?
36
హుమా ఖురేషి
Image Credit : Facebook

హుమా ఖురేషి

నయనతార తరువాత టాక్సిక్ లో ఏజ్ ఎక్కువ ఉన్న హీరోయిన్ హుమా ఖురేషి. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న ఈమె వయసు ప్రస్తుతం 39 ఏళ్లు. టక్సిక్ టీమ్ రిలీజ్ చేసిన వీడియోలో పవర్, సస్పెన్స్, స్టైల్, థ్రిల్ అన్నీ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ల పాత్రలు చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఖురేషి అయితే తనదైన స్టైల్‌లో డిఫరెంట్‌గా కనిపిస్తుంది.

46
ఘాటు రొమాన్స్ తో విమర్శలు..
Image Credit : instagram

ఘాటు రొమాన్స్ తో విమర్శలు..

డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ 'టాక్సిక్' సినిమా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మరీ ముఖ్యంగా హీరోయిన్ల వయసుకు సబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో 34 ఏళ్ల వయసు ఉన్న కియారా అద్వాని టాక్సిక్ లో యష్ కు జంటగా నటించింది. వీరిద్దరికి సబంధించిన రొమాంటిక్ పోస్టర్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఘాటు రొమాన్స్ కు సబంధించి విమర్శలు కూడా ఫేస్ చేస్తున్నారు.

56
చాలా కాలం గ్యాప్ తీసుకున్న హీరో..
Image Credit : Asianet News

చాలా కాలం గ్యాప్ తీసుకున్న హీరో..

ఇక టాక్సిక్ లో మిగిని ఇద్దరు హీరయిన్లలో కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ కు 29 ఏళ్లు కాగా.. మరో తార.. తారా సుతారియాకు 30 ఏళ్లు. ఈ సినిమాలో హీరోగా నటించి కన్నడ స్టార్ హీరో, కేజీఎఫ్ స్టార్ యష్ కు 41 ఏళ్లు. ఈమూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న యష్.. టాక్సీక్ తో రాబోతున్నాడు.

66
'టాక్సిక్' సినిమా రిలీజ్ ఎప్పుడు?
Image Credit : Instagram

'టాక్సిక్' సినిమా రిలీజ్ ఎప్పుడు?

సూపర్‌స్టార్ యశ్, డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ కాంబోలో వస్తున్న 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫార్ గ్రోన్-అప్స్' ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటి. ఇది ఒక పీరియడ్ గ్యాంగ్‌స్టర్ సినిమా. వెంకట్ కె నారాయణ, యశ్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో యశ్ డబుల్ రోల్‌లో నటిస్తున్నట్లు సమాచారం. ఆయనతో పాటు అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, బాలాజీ మనోహర్, అమిల్ తివారీ, డారెల్ డిసిల్వా, సుర్జిత్ గోపీనాథ్, కెల్లీ పాల్ కూడా నటిస్తున్నారు. సినిమా బడ్జెట్ దాదాపు రూ.1000 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌
Recommended image2
Actor Soori: నాతో నటించడానికి హీరోయిన్లు భయపడ్డారు.. సూరి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Raj Tarun: రాజ్‌ తరుణ్‌ `టార్జాయిస్‌` నుంచి అదిరిపోయే మెలోడీ.. కట్టిపడేస్తున్న `నీ పరిచయం` సాంగ్‌
Related Stories
Recommended image1
Sr NTR: ఎన్టీఆర్ ను ఎదిరించి మాట్లాడే దమ్మున్న మొనగాడు ఎవరో తెలుసా? బాలకృష్ణ చెప్పిన రహస్యం..
Recommended image2
560 కోట్ల ఆస్తి.. లగ్జరీ కార్లు, సొంత వ్యాపారాలతో మహా రాణిలా ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved