MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 100 కోట్లు ఇచ్చినా ఆ హీరోతో చేయను, తెగేసి చెప్పిన నయనతార..? ఎవరా హీరో..?

100 కోట్లు ఇచ్చినా ఆ హీరోతో చేయను, తెగేసి చెప్పిన నయనతార..? ఎవరా హీరో..?

భారీ ఆఫర్ ను  చేతులారా వదిలేసుకుందట సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార. 100 కోట్లు ఇస్తామన్నా.. ఆ హీరో పక్కన నటించను అని తెగేసి చెప్పిందట. ఇంతకీ ఎవరా హీరో..? ఏంటా కథ.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 27 2024, 07:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తమిళనాట భారీ క్రేజ్ ఉన్న హీరోయిన్ నయనతార. తమిళంలోనే కాదు తెలుగు, కన్నడ,మలయాళంలో కూడా నయన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగా హీరోయిన్ల కెరీర్ 30 దాటితే అయిపోతూ ఉంటుంది.. 35 కి కెరీర్ ఆగిపోయి తెరమరుగైన స్టార్స్ చాలా మంది ఉన్నారు. కాని నయనతార మాత్రం 40 కి అడుగు దూరంలో ఉన్నా..స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతోంది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

ఇప్పటికే తెలుగు తమిళ, మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన ఆడిపాడింది నయన్. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో  కూడా సత్తా చాటింది. ఇక అధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా కూడా రికార్డ్  సాధించింది నయనతార. అయితే తాజాగా ఆమె ఓ భారీ ఆఫర్ ను వదిలేసుకున్నట్టు తెలుస్తోంది. 100 కోట్లు ఇచ్చినా ఆసినిమా చేయను అని ఆమె చెప్పిందట. ఇంతకీ ఎంటా సినిమా అంటే..?
 

37
Legend Saravanan

Legend Saravanan

తమిళ  హీరో.. అరుళ్ శరవణన్ తో నటించని నయనతార చెప్పినట్టు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. 50 ఏళ్లు దాటిన తరువాత  హీరోగా ఎంటర్ అయ్యాడు శరవణన్. బిజినెస్ మెన్ గా కోట్లు సంపాధించిన ఆయన 2002 లో వచ్చిన ది లెజెండ్ సినిమాతో హీరోగా ఎంటర్ అయ్యాడు. ఈ ఏజ్ లో.. హీరోగా ఎంట్రీ ఇచ్చి అందరకి షాక్ ఇచ్చాడు. అంతే కాదు ఆయన మీద పలు మీమ్స్. కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి  అప్పట్లో. 
 

47
Legend saravanan

Legend saravanan

అంతే కాదు ఆయన చేసింది కూడా ఒన్లీ తమిళ సినిమా కాదు  అది పాన్ ఇండియా మూవీ కావడం మరో షాకిచ్చే అంశం. ఊర్వశి రౌటేలా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో.. వివేక్, యోగి బాబు, విజయకుమార్, ప్రభు, నాజర్, సుమన్ వంటి స్టార్లు కూడా నటించారు.  

57
Legend Saravanan

Legend Saravanan

ఈసినిమాతో ట్రోల్స్ కూడా ఫేస్ చేశాడు ఈ హీరో. అయితే ఈ సినిమా ఎవరు చూసినా చూడకపోయినా.. శరవణన్ మాత్రం బాగా ఫేమస్ అయ్యారుడు దేశ వ్యాప్తంగా మనోడిపేరు మార మోగిపోయింది. ఈసినిమా కోసం ఊర్వశికి 20 కోట్లు పారితోషికం ఇచ్చినట్టు అప్పట్లో గట్టిగా టాక్ నడిచింది.

 

67

ఎవరూ ఆయన పక్కన నటించడానికి ఒప్పుకోలేదని నెట్టింట టాక్ అందుకే అంత ఇచ్చి ఊర్వశిని తీసుకున్నారట. ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియదు కాని రూమర్ మాత్రం గట్టిగా నడిచింది. ఇక అసలు విషయం ఏంటీ అంటే.. ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా నయనతారను తీసుకోవాలి అని గట్టిగా ప్రయత్నం చేశాడట శరవణణ్. 

77

ఈ విషయంలో కూడా  ఎంతవరకు నిజముందో తెలీదు కానీ, ఈ సినిమాలో ముందుగా నయనతారని హీరోయిన్ గా ఎంపిక చేసుకోవాలని శరవణన్ ఎక్కువ ప్రయత్నాలు చేశాడట. అందుకోసం రోజూ ఆమె ఇంటికి తన మేనేజర్ ను పంపి ఎక్కువ పారితోషికం ఇస్తామని ఆఫర్ చేశాడట. కానీ నయన్ మాత్రం 100 కోట్లు ఇచ్చినా నేను అతని పక్కన నటించను అని తెగేసి చెప్పిందట. ఈ న్యూస్ అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Recommended image2
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Recommended image3
Ilaiyaraaja Karuppu Controversy: ఇళయరాజా దెబ్బకి క్షమాపణ చెప్పిన 'కరుప్పు' టీమ్.. ఆ సీన్‌కు కత్తెర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved