- Home
- Entertainment
- Ante Sundaraniki Review:'అంటే సుందరానికీ' ప్రీమియర్ షో టాక్.. 3 గంటల పాటు నాని మ్యాజిక్, ఆ ఒక్కటీ కొంచెం..
Ante Sundaraniki Review:'అంటే సుందరానికీ' ప్రీమియర్ షో టాక్.. 3 గంటల పాటు నాని మ్యాజిక్, ఆ ఒక్కటీ కొంచెం..
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ 'అంటే సుందరానికీ'. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నానికి జోడిగా మలయాళీ బ్యూటీ నజ్రియా నటించారు.

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ 'అంటే సుందరానికీ'. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నానికి జోడిగా మలయాళీ బ్యూటీ నజ్రియా నటించారు. నేడు జూన్ 10న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్, ప్రచార కార్యక్రమాలు సినిమాపై అంచనాలు పెంచాయి.
ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తోందో తెలుసుకుందాం. మరోసారి నాని తన మార్క్ కామెడీ టైమింగ్ తో అలా మొదలయింది, భలే భలే మగాడివోయ్ లాంటి చిత్రాల మ్యానరిజమ్స్ గుర్తు చేస్తున్నాడు. అంటే సుందరానికీ చిత్ర ట్రైలర్ ఫుల్ ఫన్ ఎలిమెంట్స్ తో ఉంది. మరి సినిమాలో ఫన్ ఏ రేంజ్ లో పేలిందో చూద్దాం.
ట్రైలర్ లో చూపిన విధంగానే నాని సినిమాలో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపిస్తున్నాడు. నజ్రియా క్రిస్టియన్ యువతిగా నటిస్తోంది. ఒక చిన్న ట్విస్ట్ తో వీళ్లిద్దరు తొలిసారి కలుస్తారు. నాని, నజ్రియా మీట్ కావడానికి.. అసలైన కథని ప్రారంభించడానికి దర్శకుడు టైం తీసుకున్నాడు. ప్రారంభంలో కథ కాస్త నెమ్మదిగా సాగుతుంది.
నాని, నజ్రియా మీట్ అయ్యాక కథ షురూ అవుతుంది. కథలో కొత్త మలుపులు చోటు చేసుకుంటాయి. ఫస్ట్ హాఫ్ లో దర్శకుడి రచన, నాని, నజ్రియా నటన చాలా ఫ్రెష్ గా ఉంటాయి. సింపుల్ ఎమోషన్స్, ఫన్ తో ఆకట్టుకుంటున్నారు. స్లోగా ఉండడమే ఫస్ట్ హాఫ్ లో మైనస్ అని చెప్పాలి. నాని, నరేష్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా చాలా బావుంటాయి.
ఇక సెకండ్ హాఫ్ లో వివాహం కోసం నాని, నజ్రియా తమ ఫ్యామిలీస్ ని ఇన్వాల్వ్ చేస్తారు. సెకండ్ హాఫ్ లో నాని కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవల్ కి చేరుతుంది. తమ ఫ్యామిలీస్ ని మ్యారేజ్ కోసం ఒప్పించే సన్నివేశాలు చాలా బావున్నాయి. నాని సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు కావడం, నజ్రియా క్రిస్టియన్ యువతి అనే పాయింట్ చాలా బాగా వర్కౌట్ అవుతోంది.
సెకండ్ హాఫ్ లో కథ అంచెలంచెలుగా మరింత ఆసక్తిగా మారుతూ ఉంటుంది. రెండు కుటుంబాల మధ్య వచ్చే కాంఫ్లిక్ట్ ని దర్శకుడు చాలా బాగా డీల్ చేశారు. ఎమోషన్స్,ఫన్ అన్నీ రాబట్టారు. ఆకట్టుకునే ఎమోషనల్ క్లైమాక్స్ తో సినిమా ముగుస్తుంది. మూవీ రన్ టైం దాదాపు 3 గంటలు ఉంది. దీనితో ఫస్ట్ హాఫ్ లో సాగదీసిన ఫీలింగ్ ఉంటుంది.
కానీ నాని, నజ్రియా మీట్ అయినప్పటి నుంచి కథ క్రమంగా ఆసక్తిగా మారుతూ ఉంటుంది. దర్శకుడు వివేక్ సాగర్ తన రచన, టేకింగ్ తో సర్ ప్రైజ్ చేశారు. సెకండ్ హాఫ్ ని డీల్ చేసిన విధానం అద్భుతం అనే చెప్పాలి. సింపుల్ ఎమోషన్స్, ఫన్ పండించడంలో తాను కింగ్ అని నాని మరోసారి నిరూపించుకున్నాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.