MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • నారా లోకేష్ కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా, ఒక్క కారణం వల్లే అతనికి ఫ్యాన్, ఆ మూవీకి 4.5 రేటింగ్

నారా లోకేష్ కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా, ఒక్క కారణం వల్లే అతనికి ఫ్యాన్, ఆ మూవీకి 4.5 రేటింగ్

Nara Lokesh favourite hero: నారా లోకేష్ తనకి ఇష్టమైన హీరో ఎవరో చెప్పేశారు. ఆ హీరో నటించిన ఒక చిత్రానికి నారా లోకేష్ ఏకంగా 4.5 రేటింగ్ ఇవ్వడం విశేషం 

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 09 2025, 07:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Nara Lokesh

Nara Lokesh

ఏపీ మంత్రి నారా లోకేష్ చేసే ప్రతి కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నుంచి విజయం సాధించిన నారా లోకేష్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా నారా లోకేష్ తన పార్టీకి చెందిన కీలక నేత, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలసి ఇండియా టుడే కాన్ క్లేవ్ లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Nara Lokesh

Nara Lokesh

ఈ సందర్భంగా నారా లోకేష్, రామ్మోహన్ నాయుడు సరదాగా ఓ ర్యాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో రామ్మోహన్ నాయుడు, నారా లోకేష్ ఆంధ్ర వంటకాల్లో ఇష్టమైనవి, ఇష్టమైన ప్రదేశాల గురించి మాట్లాడారు. తనకి ఏపీలో ఉలవచారు, ఉలవచారు బిర్యానీ అంటే ఇష్టం అని లోకేష్ పేర్కొన్నారు. అన్ని ప్రశ్నలకు వెంటవెంటనే సమాధానాలు ఇచ్చిన లోకేష్ కి చివర్లో మాత్రం పరీక్ష ఎదురైంది. 

35
Nara Lokesh

Nara Lokesh

తెలుగులో మీకు ఇష్టమైన హీరో ఎవరో చెప్పండి అని యాంకర్ అడిగారు. లోకేష్ ని మరింత ఇరకాటంలో పెట్టే విధంగా చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లలో ఒక్కరి పేరే చెప్పాలని అడిగారు. దీనితో నారా లోకేష్ తప్పించుకునేందుకు 'ఆల్ ఆఫ్ ది ఎబౌ' అని సమాధానం ఇచ్చారు. ఒక్కరి పేరే చెప్పాలని యాంకర్ కోరడంతో నేను బాలయ్య బాబు అభిమానిని అని సమాధానం ఇచ్చారు. తెలుగులో మాస్ మహారాజ్ ని కూడా మరచిపోలేము అని నారా లోకేష్ అన్నారు. మీరు లేటెస్ట్ గా చూసిన చిత్రం ఏంటి అని అడగగా.. లోకేష్ వెంటనే డాకు మహారాజ్ అని సమాధానం ఇచ్చారు. 

45
Nara Lokesh

Nara Lokesh

డాకు మహారాజ్ చిత్రానికి తాను 5కి 4.5 రేటింగ్ ఇస్తానని తెలిపారు. రామ్మోహన్ నాయుడు కూడా తనకి ఇష్టమైన హీరో చిన్నప్పటి నుంచి బాలయ్య బాబే అని సమాధానం ఇచ్చారు. మరి పవన్ కళ్యాణ్ సంగతేంటి అని యాంకర్ ఇరుకునపెట్టే ప్రయత్నం చేయగా.. ఆయన నాకు పర్సనల్ గా తెలుసు, మంచి నటుడు అని రామ్మోహన్ నాయుడు తెలిపారు. 

55
Nara Lokesh

Nara Lokesh

గతంలో కూడా నారా లోకేష్ బాలయ్య, చిరంజీవి గురించి కామెంట్స్ చేశారు. ఓ పబ్లిక్ మీటింగ్ లో లోకేష్ మాట్లాడుతూ నేను మెగాస్టార్ చిరంజీవి అభిమానిని. కానీ ఎంతైనా ముద్దుల మావయ్య వైపే చూస్తాం కదా. బాలయ్య బాబు అన్ స్టాపబుల్. ఆయన సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తానని లోకేష్ తెలిపారు. రాజకీయాల్లోకి రాకముందు నారా లోకేష్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలనే ప్రయత్నాలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో నారా లోకేష్ హీరోగా నటించేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నందమూరి బాలకృష్ణ
నారా లోకేష్
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ankit Balyan: 471 మిలియన్ వ్యూస్ సాధించిన సింగర్ దారుణ హత్య.. ఎవరీ అంకిత్ బాలియాన్?
Recommended image2
Shakeela : వాళ్లు ప్రేమించింది నన్ను కాదు... జీవితంలోని చీకటి నిజాలు చెప్పిన షకీలా
Recommended image3
Ranabaali Release Date: రణబాలి మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. విజయ్‌ దేవరకొండ, రష్మికకి అసలైన పండగ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved