నమ్రత పార్టీలో నారా బ్రాహ్మిణి, మహేష్ వైఫ్ తో లోకేష్ భార్య పిక్స్ వైరల్
సోషల్ మీడియాలో ఎవరూ ఊహించని ఫోటో వైరల్ అవుతున్నాయి. అసలు ఇండస్ట్రీలో ఎప్పుడూ కలిసి ఉండరు అనుకున్న స్టార్స్ కూడా ప్రత్యేకంగా పార్టీలు చేసుకుంటూ కనిపించేసరికి.. అంతా షాక్ అవుతున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత.. బాలయ్య బాబు కూతురు.. నారా లోకేష్ భార్య బ్రాహ్మిణి.. ఈ ఇద్దరు ఇండస్ట్రీకి సంబంధించిన వారే.. అయితే వీరిద్దరు కాని వీరిద్దరు కలిసిన సందర్భాలు మాత్రం చాలా తక్కువ. అయితే విరు బెస్ట్ ఫ్రెండ్స్అయ్యే అవకాశం ఉందా.. అసలు అలా ఎవరైనా వీరిని ఫ్రెండ్స్ అనుకుంటారా..?

కాని తాజాగా వీరిద్దరు పార్టీలో సందడి చేశారు. కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. నమ్రత శిరోద్కర్ పుట్టిన రోజు వేడుకల్లో నందమూరి బాలకృష్ణ కుమార్తె, నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి సందడి చేశారు. జనవరి 22న జరిగిన ఈ వేడుకల ఫోటోలు ఆతరువాత రోజు నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అయితే ఈ పార్టీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు బ్రాహ్మణి. అయితే ఈ పార్టీలో బ్రాహ్మీణీతో పాటు మహేశ్ బాబు సిస్టర్స్, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కూడా కనిపించారు. అంతే కాదు ఈ పార్టీకి పలువురు ఫ్యాషన్ డిజైనర్లు, నమ్రతకు సబంధించిన అతి కొద్దిమంది స్నేహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారావారి కోడలు ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
నమ్రత ఈ ఫోటోలు తన సోషల్ మీడియాలో శేర్ చేయగా.. ఇవి వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పుట్టిన రోజు వేడుకల్లో మహేష్ బాబు లేరు. ఆయన ప్రస్తుతం జర్మనీ ట్రిప్పుల్ ఉన్నాడు మహేష్ బాబు. ఎప్పుడూ ఫ్యామిలీతో వెళ్ళేవాడు.. ఈసారి మాత్రం సోలో ట్రిప్ వేశాడు. అక్కడే ఉండి. తన భార్య నమ్రతకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇక ఆయన రాజమౌళి సినిమా కోసం తనఫిట్ నెస్ డాక్టర్ ను కలవడానికి జర్మనీ వెళ్ళినట్టు తెలుస్తోంది. జక్కన్న సినిమా ఈ ఉగాది నుంచి సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉంది. పాన్ వరల్డ్ స్థాయిలో... అమెజాన్ అడవుల్లో జరిగే అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతోందట. దానికి తగ్గట్టు తనను తాను మార్చుకోబోతున్నాడు మహేష్.