నాని, సాయి పల్లవి కాంబోలో ముచ్చటగా మూడో సినిమా, డైరెక్టర్ ఎవరంటే?
నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి కాంబినేషన్ అంటే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. వారి సినిమా కోసం యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తుంటారు. ఇక వారిని సంతోషపెట్టడానికి ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ కలవబోతోంది.

డిఫరెంట్ గా ట్రై చేస్తోన్న నాని
నేచురల్ స్టార్ నాని తన సినిమాలతో ఎప్పటికప్పుడు కొత్తదనం చూపిస్తూ, వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఈమధ్య కాలంలో దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం వంటి సినిమాలతో కమర్షియల్‌గా, కంటెంట్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం నాని "ప్యారడైజ్" అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈసినిమాలో డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు నాని. ఇప్పటికే వచ్చిన అప్ డేట్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
KNOW
నాని నెక్ట్స్ సినిమా ?
ఇక ప్రతీ సినిమాను డిపరెంట్ గా ప్లాన్ చేస్తూ వెళ్తున్న నాని.. తన నెక్ట్ సినిమా విషయంలో కూడా ఒక విజన్ తో ఉన్నాడు. ఇప్పటికే నాని తన తరువాత సినిమాను ఫైనల్ చేసేశారన్న వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. టాలీవుడు నుంచి అందిన సమాచారం ప్రకారం, నాని ఎప్పటి నుంచో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో పనిచేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. ఇప్పుడు ఈ క్రేజీ కాంబో ఫైనల్ అయినట్లు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
నాని, సాయి పల్లవి కాంబోలో మూడో సినిమా
ఈ ప్రాజెక్ట్‌లో నానికి జోడీగా నటించబోయే నటి ఎవరు అన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఈవిషయంలో కూడా ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాని జోడీగా ఈ సినిమాలో సాయిపల్లవి పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే నాని, సాయిపల్లవి కలిసి MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి), శ్యామ్ సింగ రాయ్ వంటి హిట్ సినిమాలు చేశారు. ఇప్పుడు ఈ జంట ముచ్చటగా మూడోసారి స్క్రీన్‌పై కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా హిట్ అయితే వీరి కాంబోలో హ్యాట్రిక్ హిట్ పడినట్టు అవుతుతంది.
సాయి పల్లవిని పరిచయం చేసిన దర్శకుడు
సాయిపల్లవిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది శేఖర్ కమ్ములానే. ఫిదా సినిమాలో ఆమెను డెబ్యూ చేయించి, ఆ తర్వాత లవ్ స్టోరీ సినిమాతో టాలీవుడ్ కు మరింత దగ్గరయ్యింది. అయితే ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్ లో నటిస్తోంది. రణ్ బీర్ కపూర్ హీరోగా రామాయణం సినిమాలో సీతగా నటిస్తోంది సాయి పల్లవి. ఈసినిమాతో సాయి ఇమేజ్ భారీగా పెరగబోతోంది. బాలీవుడ్ సినిమాలో అంత బిజీగా ఉన్నా కూడా సాయిపల్లవి, శేఖర్ కమ్ములల మధ్య ఉన్న మంచి రిలేషన్ వల్లే ఆమె ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
అధికారిక ప్రకటన కోసం వెయిటింగ్
ఈ సినిమాలో సాయిపల్లవిని మరోసారి విభిన్నంగా చూపించేందుకు శేఖర్ కమ్ముల సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కి నిర్మాతగా ఎవరు వ్యవహరిస్తారు అన్నది ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ఇటీవల శేఖర్ కమ్ముల, ఏసియన్ ఫిల్మ్స్ బ్యానర్‌లో మరో ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే నాని–సాయిపల్లవి సినిమా కూడా అదే బ్యానర్‌లో ఉంటుందా లేదా అన్నది త్వరలో స్పష్టతకు రానుంది. అయితే ఈసినిమా విషయంలో నిజానిజాలపై అధికారిక ప్రకటన తరువాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.