Intinti Gruhalakshmi: బయటపడిన లాస్య నిజస్వరూపం.. లాస్యపై కోపంతో రగిలిపోతున్న నందు?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు జనవరి 6వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో అంకిత కిచెన్ లోకి నేను వెళ్లిన శృతి వెళ్లిన వట్టి చేతులతో వెనక్కి రావడమే తప్ప మీకు కాఫీ తీసుకొని రాలేను ఆంటీ అనడంతో ఎందుకు అని అడుగుతాడు నందు. అప్పుడు అంకిత ఎందుకంటే ఫ్రిడ్జ్ తో సహా మొత్తం రాక్స్ అన్నింటికీ కీస్ వేసి తన దగ్గర పెట్టుకుంది లాస్య ఆంటీ అనడంతో నందు షాక్ అవుతాడు. అప్పుడు లాస్య టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆమె అనుమతి లేకుండా వంటింట్లో స్టౌ వెలగకూడదు కాఫీ కూడా తాగకూడదు అనడంతో అది అత్తయ్య అయినా సరే మామయ్య అయినా సరే అనడంతో నందు షాక్ అవుతాడు.
లాస్య ఆంటీ పెట్టిన రూల్స్ వల్ల తాతయ్య నానమ్మ పాలు లేకుండా డికాషన్ తాగాల్సి వచ్చింది అనడంతో నందు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మొన్న రాత్రి తాతయ్యకి షుగర్ డౌన్ అయితే చక్కర కోసం వెళితే కీ ఇవ్వలేదు. అప్పుడు అంతకంటే ఇంకొకటి ఉంది దాన్ని చెప్పడానికి నాకు సంస్కారం అడ్డుస్తుంది. తప్పు మీ వైపు పెట్టుకొని లాస్య వైపు చూస్తారు ఏంటి నందగోపాల్ గారు అనడంతో తప్పు నాదా అని అంటాడు నందు. ఇంట్లో నుంచి కంప్లైంట్స్ ఏవి రాకపోతే అంతా బాగానే ఉంది అనుకున్నాను అనడంతో అప్పుడు ప్రేమ్ తాతయ్య ఏమి చెప్పకుండా మా నోర్లు నొక్కేశారు అని అంటాడు.
మీ మీద ఉన్న ప్రేమతో మీకు చెప్పకుండా ఎప్పటికైనా మీరు తెలుసుకుంటారని ఆశతో ఎదురుచూస్తున్నారు అనడంతో నందు బాధపడుతూ ఉంటాడు. ఈ సరుకులను కూడా నువ్వు మీ రాక్ లో పెట్టుకోవాలని పిచ్చిపిచ్చి ప్రయత్నాలు చేయొద్దు అని అంటుంది తులసి. అప్పుడు లాస్య నువ్వు నన్ను కావాలనె విలన్ లా మారుస్తున్నావు అసలు విషయం నీకు తెలియదు అని అంటుంది. మీరు ఈ ఇంటి పెద్దగా మీ బాధ్యతలు విఫలమవుతున్నంతవరకు నేను నా కుటుంబం కోసం ఇలా సరుకులు తీసుకోస్తూనే ఉంటాను అని చెబుతుంది తులసి. చుట్టం చూపుల వచ్చి వెళుతుంటాను కానీ నా వాళ్లకు ఏదైనా హాని జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోను అనడంతో నందుకు కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అప్పుడు తులసి ఇదిగో శృతి నీకోసమే పుల్లటి మామిడికాయలు అనడంతో థాంక్స్ ఆంటీ మా ఆయన కంటే మీరే బెటర్. నేను కడుపుతో ఉంటే మా ఆయనకు కోరికలు పుడుతున్నాయి అనడంతో అందరూ నవ్వుతూ ఉంటారు. మరోవైపు నందు కోపంతో రగిలిపోతూ ఉండగా అప్పుడు లాస్య నందు అని పిలవడంతో షటాప్ అని గట్టిగా అరుస్తాడు. అది కాదు నందు నేను చెప్పేది విను అనడంతో నువ్వేంటి చెబుతావు అని సీరియస్ అవుతాడు నందు. వాళ్లను ఇంట్లోకి రప్పించుకోవడం కోసం నానా తంటాలు పడ్డాను చివరికి తులసి ముందు చేతులు కట్టుకున్నాను నువ్వు వాళ్ళందరి ముందు నా పరువు తీసావు అని అంటాడు.
కానీ నువ్వు నా వెనకాల ఇలా గోతులు తీస్తావని అనుకోలేదు. అప్పుడు లాస్య టాపిక్ డైవర్ట్ చేయడానికి చూడడంతో తులసి గురించి పక్కన పెట్టు నువ్వు ఏం చేస్తున్నావు అది మాట్లాడు అని అంటాడు. మా నాన్నని అమ్మని తినడానికి లిమిట్స్ పెట్టడానికి నీకు ఎన్ని గుండెలు అని అంటాడు. నువ్వు మారావు అని నేను ఇన్ని రోజులు నేను గుడ్డిగా నమ్మాను నా ఇంట్లో వాళ్ల కోసం తులసి సరుకులు తెచ్చి ఇవ్వడమేంటి అది కూడా నాకు ఇన్ డైరెక్ట్ గా చేతగాని వాడిని అని చెప్పి వెళ్ళింది. ఇంతకంటే మరొక ఘోర అవమానం ఉంటుందా అని అంటాడు నందు. అప్పుడు లాస్య దొంగ ఏడుపులు ఏడుస్తూ నేను ఎందుకోసం చేశానో ముందు అది తెలుసుకోనందు అని అంటుంది.
నీకు నాకు సంపాదనలేదు పిల్లలకు వచ్చే డబ్బుతోనే ఇల్లంతా గడవాలి అంటే కాదు కదా అందుకే ఇలా నియంత్రణలో మారాను అని అంటుంది లాస్య. నేను అనుకున్నదే జరిగింది అందరూ దృష్టిలో నేను చెడ్డదాన్ని అయ్యాను అందరు కలిసి నా మీద దాడి చేశారు అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది లాస్య. అత్తయ్య మామయ్య అంటే తులసికి కాదు నాకు గౌరవం ప్రేమ ఉంది మన ఫ్యామిలీ అంటే నాకు కూడా బాధ్యత ఉంది అని అంటుంది. మరొకవైపు పరంధామయ్య దంపతులు బాధపడుతుండగా నేను మీ అబ్బాయికీ ఉండమని చెప్పాను కానీ వాళ్ళు ఏమి చేసినా కూడా ఇలా భరించమని చెప్పలేదు కదా.
కావాలి అనుకున్నప్పుడు కనీసం కాఫీ తాగే స్వేచ్ఛ కూడా లేదు అన్నప్పుడు నాకు చెప్పాలి కదా మామయ్య అని అంటుంది తులసి. మిమ్మల్ని బలవంతంగా ఇక్కడ ఉంచాను అని నన్ను పరాయి మంచిగా భావిస్తున్నారా అనగా అది కాదమ్మా తులసి అనడంతో మరి ఇంకేంటి మామయ్య అని అంటుంది తులసి. మేము మా విషయంలో కంప్లైంట్ రాకుండా ఉండే స్టేజ్ లో ఉన్నాము కంప్లైంట్ ఇచ్చే స్టేజిలో లేము అనగా నేను మీ అబ్బాయి కోసం ఇక్కడ ఉంచాను కానీ బలవంతంగా ఉంచలేదు మామయ్య అని అంటుంది. అందరూ కలిసి బాధపడుతూ ఇంకొకసారి ఇలా జరిగితే నేను చచ్చినంత ఒట్టు మామయ్య అని అంటుంది తులసి.
ఆ తర్వాత తులసీ తన ఇంటికి వెళుతుంది. తర్వాత తులసీ తన ఇంటికి వెళ్లి నీళ్లు తాగుతూ ఉండగా ఇంతలో సామ్రాట్ ఫోన్ చేస్తాడు. అప్పుడు తులసి నేను మీకు కాల్ చేద్దాం అనుకున్నాను నా మైండ్ కొంచెం గజిబిజిగా ఉంది అనడంతో మీకు ఒక విషయం చెప్పాలి మనం వద్దనుకున్న ఆ బెనర్జీ ప్రాజెక్ట్ లాస్య,నందు ఓకే చేశారు. ఆల్మోస్ట్ ఫైనల్ అయిందట అనడంతో తులసి ఆశ్చర్య పోతుంది. ఈ విషయంలో ఎలా అయినా లాస్య నందుకు నచ్చ చెబుతాను అనడంతో సామ్రాట్ మీ మాటలు వాళ్లు వింటారా అనడంతో వినని వినకపోని నా కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది అంటుంది తులసి.
ఇప్పుడే అక్కడికి వెళ్తాను అని తులసి బయలుదేరుతుంది. మరొకవైపు నందు జరిగిన విషయాలు తలుచుకొని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి లాస్య వస్తుంది. నందు అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ప్లీజ్ నీతో ఒక విషయం మాట్లాడాలి కూర్చో అని అంటుంది లాస్య. అప్పుడు నందు కి బెనర్జీ ప్రాజెక్టు గురించి వివరిస్తూ ఉంటుంది లాస్య. ఈ ప్రాజెక్టు గురించి తులసితో గాని ఇంట్లో వాళ్ళతో గాని ఎవరితో చెప్పొద్దు అనడంతో ఇంతలోనే అక్కడికి తులసి వస్తుంది.