- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: అమ్మ గురించి కాదు నా ఫ్యూచర్ గురించి ఆలోచించాలి.. మరోసారి బుద్ది చూపించిన అభి!
Intinti Gruhalakshmi: అమ్మ గురించి కాదు నా ఫ్యూచర్ గురించి ఆలోచించాలి.. మరోసారి బుద్ది చూపించిన అభి!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కథ సాగుతుంది. పైగా ప్రేక్షకాదరణ భారీ స్థాయిలో పొందింది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

దివ్య (Divya) కాలేజ్ ప్రిన్సిపల్ నందుకు ఫోన్ చేసి మీరు ఇద్దరు దంపతులు దివ్యను తీసుకొని పేరెంట్స్ మీటింగ్ కి రావాలి అని చెబుతోంది. దాంతో నందు మగ తోడు అవసరం లేని తులసికి ఇప్పుడే నేను అవసరం పడ్డాను అని రాక్షస ఆనందం పొందుతాడు. ఇక పేరెంట్స్ మీటింగ్ గురించి తులసి (Tulasi) కి కూడా ఫోన్ చేసి చెబుతారు.
ఇక నందు (Nandu) తులసి ఇంటికి వచ్చి దివ్యను పిలుస్తాడు. ఏం చేస్తున్నావ్ అమ్మా అని అడుగుతాడు. దాంతో దివ్య చదువుకుంటున్నాను అని అంటుంది. నందు గుడ్.. లేకపోతే కుట్టు మిషన్ తొక్కవలసి వస్తుందని తులసి (Tulasi) ను దెప్పి పొడిచినట్టుగా మాట్లాడుతాడు. ఇక పేరెంట్స్ మీటింగ్ ఉంది మీ ఇద్దరిని ఆ టైంలో వచ్చి పిక్ అప్ చేసుకుంటాను అని అంటాడు.
దాంతో తులసి (Tulasi) అవసరం లేదు అని అంటుంది. అంతేకాకుండా మీరు రావాలా వద్దా అని నిర్ణయించాల్సింది నేను అని అంటుంది. ఇక నందు ఒకప్పుడు దివ్య కోసం నేను ఫీజులు కట్టాను దాన్ని మర్చిపోయారా అని అంటాడు. ఇక దివ్య (Divya) ఐ యాం సారీ డాడీ నేను ఇప్పుడు అమ్మ నీడలో బ్రతుకుతున్న బిడ్డను అని అంటుంది.
దాంతో నందు దివ్య (Divya) నువ్వే మాయ చేసావు.. మరి మీటింగ్ కి వెళ్ళినప్పుడు తండ్రి గురించి అడుగుతారు. అప్పుడు ఏం చెప్తావ్ అని అంటాడు. దివ్యకు నేను తప్ప ఎవరూ లేరు అని చెబుతాను అని తులసి (Tulasi) అంటుంది.
మరోవైపు ప్రేమ్ (Prem) రాసిన లిరిక్స్ చాలా బాగున్నాయి అని శృతి మెచ్చుకుంటుంది. అంతేకాకుండా ప్రేమ్ లక్ష్యం విషయంలో ఏ మాత్రం తగ్గకుండా కొంత శృతి ప్రోత్సహిస్తుంది. మరోవైపు దివ్య (Divya) జరిగిన దాని గురించి ఆలోచిస్తుంది.
మరోవైపు అంకిత (Ankitha) వాళ్ళ భర్త ఆంటీ చేసిన ప్రపోజల్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను ఆలోచించాల్సింది అమ్మ గురించి కాదు. నా ఫ్యూచర్ గురించి అని అంటాడు. దాంతో వెనకాల ఉండి వింటున్న తులసి (Tulasi) ఎంతో భాద పడుతుంది. ఇక తరువాయి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.