- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: నందు మెడకి ఉచ్చు బిగించిన లాస్య.. అత్తకు ఓటమి రుచి చూపించిన దివ్య!
Intinti Gruhalakshmi: నందు మెడకి ఉచ్చు బిగించిన లాస్య.. అత్తకు ఓటమి రుచి చూపించిన దివ్య!
Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. సమస్యల్లో ఉన్న తన కాపురాన్ని తెలివిగా చక్క పెట్టుకుంటున్న ఒక కొత్త పెళ్లికూతురు కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో బోన్ లో ఉన్న తులసి తో లాస్య చెప్పినవన్ని నిజాలేనా అని అడుగుతాడు మాధవి భర్త. అంతా అబద్ధం మా పరువు తీయటానికి చేస్తున్న ప్రయత్నం అంటుంది తులసి. నందగోపాల్ గారు లాస్య వలలో పడి మిమ్మల్ని నిర్లక్ష్యం చేశారు కాబట్టి విడాకులు తీసుకున్నారు అంతేనా అంటాడు మాధవి భర్త. అవునన్నట్లుగా తలాడిస్తుంది తులసి.
లాస్య క్యారెక్టర్ అదే జడ్జి గారు.. పరాయి వ్యక్తి భర్తని లాక్కొని ఆమెకి అన్యాయం చేసిందంటే ఆమె క్యారెక్టర్ ఎలాంటిదో మీరే ఊహించుకోండి అంటాడు మాధవి భర్త. నందగోపాల్ ఏమి చిన్న పిల్లవాడు కాదు ముగ్గురు బిడ్డల తండ్రి అంటాడు లాస్య తరపు లాయర్. ఆడదాని వలలో పడటానికి వయసుతో సంబంధం ఏముంది నిజానికి లాస్య వల్ల నా క్లైంట్ టార్చర్ అనుభవించాడు అంటాడు మాధవి భర్త.
మరోవైపు పూజ చేస్తూ నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను క్షమించు అంటాడు విక్రమ్. అదంతా మనసులో పెట్టుకోవద్దు మనస్ఫూర్తిగా పూజ చేయు అంటుంది దివ్య. పూజ పూర్తయిన తర్వాత అందరికీ హారతి ఇస్తుంది దివ్య. అత్తగారికి హారతి ఇస్తూ ఈరోజు నుంచి మన ఆట మొదలు.. మీ ఆట కట్టిస్తాను అని మనసులో అనుకుంటుంది దివ్య.
నువ్వు ఏం చేసినా నా కొడుకుని నా నుంచి దూరం చేయలేవు అని మనసులో అనుకుంటుంది రాజ్యలక్ష్మి. హారతి పళ్ళు కింద పెడుతూ పంతులు గారిని కోపంగా చూస్తుంది దివ్య. ఈవిడ చూపులకి కాలిపోయేలాగా ఉన్నాను అత్తగారి మీద కోపం నామీద చూపిస్తుందేంటి అనుకుంటాడు పూజారి. మరోవైపు నా క్లైంట్ లాస్య క్యారెక్టర్ గురించి మాట్లాడారు కాబట్టి నంద గోపాల్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాము.
ఆయన ఒక స్త్రీ లోలుడు అంటాడు లాస్య తరపు లాయర్. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. లాస్యని బోనులోకి రమ్మని అసలు విషయం చెప్పమని అడుగుతాడు ఆమె లాయర్. అతను స్త్రీ లోలుడని ఆ విషయం తెలిసేసరికే మా పెళ్లి అయిపోయింది అంటూ అమాయకంగా మొహం పెడుతుంది లాస్య. ఆవిడ మాటలు మాత్రమే కాదు ఎవిడెన్స్ కూడా ఉంది అంటూ పర్మిషన్ అడుగుతాడు లాస్య లాయర్.
జడ్జి గారు పర్మిషన్ ఇవ్వటంతో మంగమ్మ ని బోనులోకి రప్పిస్తాడు. బోనులోకి వచ్చిన మంగమ్మ ముందు అనుకున్నట్లుగానే నందు మీద నిందలు వేస్తూ మాట్లాడుతుంది. దీని గురించి మీరు ఏమంటారు అంటారు జడ్జిగారు. ప్రస్తుతానికి ఆవిడ చెప్పింది తప్పు అని చెప్పటానికి మా దగ్గర ఆధారాలు లేవు మాకు కాస్త గడువు కావాలి అని అడుగుతాడు మాధవి భర్త.
మూడు రోజులు టైం ఇస్తున్నాను ఇలా నిజం నిరూపించండి లేకపోతే శిక్ష పడుతుంది అంటూ కేసు ముగిస్తారు జడ్జిగారు. బయటికి వచ్చిన తర్వాత ఎందుకు అబద్ధం చెప్పావు అంటూ మంగమ్మ మీద కేకలు వేస్తుంది తులసి. తనని అనటం ఎందుకు మనం మాట్లాడుకుందాం అంటుంది లాస్య. మాట్లాడుకోవటానికి ఏముంది అంటాడు నందు. మీరేమీ సెలబ్రిటీ కాదు రెండో పెళ్ళాన్ని వదిలేస్తే మూడో పెళ్లి చేసుకోవడానికి కాస్త తగ్గండి.. మీరు రెండు అడుగులు వెనక్కి వేస్తే లాస్య చేత నాలుగు అడుగులు వెనక్కి వేయిస్తాను అంటుంది భాగ్యం.
ఈ విషయంలో తగ్గేదే లేదు అవసరమైతే జైల్లోనే కూర్చుంటాను అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నందు. మరోవైపు పూజ దగ్గర ఉన్న వెండి సామాన్లు తన బ్యాగ్ లో వేసేస్తూ ఉంటాడు పూజారి. అప్పుడే అక్కడికి వచ్చిన దివ్య ఇంట్లో బంగారం డబ్బు కూడా ఉంది వాటిని కూడా తీసుకు వెళ్ళండి దొంగ పంతులు అంటుంది దివ్య. ఏం మాట్లాడుతున్నావు అంటూ కోప్పడతాడు పూజారి. అతనిని పక్కకి తీసుకెళ్లి ఒక వీడియో చూపిస్తుంది. ఆ వీడియోలో అతను రెండో భార్యతో మాట్లాడుతూ ఉంటాడు. నా కొంప కొల్లేరు చేసే లాగా ఉన్నావు దయచేసి దాన్ని ఎవరికీ చూపించకు అంటాడు పూజారి.
అలాగే రాజ్యలక్ష్మి గురించి కూడా చెడుగా చెప్తాడు. ఆ వాయిస్ ని రికార్డ్ చేస్తుంది దివ్య. మళ్లీ ఇదేం ట్విస్టు అంటాడు పంతులు. ముందు జాగ్రత్త నేను చెప్పినట్లు చేయండి అంటూ బెదిరిస్తుంది దివ్య. తప్పనిసరి పరిస్థితుల్లో సరే అంటాడు పంతులు. మరోవైపు మూడు రోజుల్లో నిజం నిరూపించుకోమన్నారు ఎలా నిరూపించుకుంటాము అని బాధపడతారు పరంధామయ్య దంపతులు. ఆలోచిస్తే ఏదో ఒక మార్గం దొరుకుతుంది ఆ సంగతి నేను చూసుకుంటాను నాకు వదిలేయండి అంటుంది తులసి. దయచేసి లాస్య దగ్గరికి మాత్రం వెళ్లొద్దు నాకు ఇష్టం లేదు అంటాడు నందు.
సరే అంటుంది తులసి. ఇంతలో చేసే మేనేజర్ వస్తాడు. అతనికి కీస్ చేతిలో పెట్టి కొద్దిరోజులు నేను కెఫీకి రాను మళ్లీ ఎప్పుడు వస్తానో కూడా తెలియదు అంటాడు నందు. తరువాయి భాగంలో మీ అమ్మగారికి ఉన్న దోషం ఈరోజుతో పూర్తిగా పోయింది ఇంక మీరు కింద కూర్చొని భోజనం చేయక్కర్లేదు అంటాడు పూజారి. అతని మాటలకి రాజ్యలక్ష్మి వాళ్ళు షాక్ అవుతారు. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఒకరికి ఒకరు తినిపించుకుంటారు దివ్య దంపతులు.