MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Intinti Gruhalakshmi: ప్రేమ్ ని కొట్టబోయిన నందు.. నందు ఇంటి నుంచి వెళ్లిపోయిన తులసి?

Intinti Gruhalakshmi: ప్రేమ్ ని కొట్టబోయిన నందు.. నందు ఇంటి నుంచి వెళ్లిపోయిన తులసి?

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు డిసెంబర్ 28వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Dec 28 2022, 10:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ లో తులసి నేను నా కోడలితో మాట్లాడటానికి సంతోషంగా గుండెకు హద్దుకోవడానికి వచ్చాను మమ్మల్ని కాసేపు ఒంటరిగా వదిలేయండి అని అనగా వెంటనే నందు చూడు తులసి ఇప్పుడిప్పుడే మనసులు మనుషులు కుదుటపడుతున్నారు. ఒక విధంగా ఇది నీ పుణ్యమే నువ్వే దీపాన్ని వెలిగించి అదే దీపాన్ని ఆర్పాలని చూడకు అని అంటాడు. ప్రస్తుతం ఎవరి మనసులు సంతోషంగా లేవు తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం ఫస్ట్ బయలుదేరు అని అంటాడు. అప్పుడు ప్రేమ్ అమ్మను ఇంకొకసారి అవమానిస్తున్నారు నేను సహించేది లేదు అనడంతో నువ్వు మౌనంగా ఉండు లోపలికి వెళ్ళు అని అంటాడు నందు.
 

27

 ఇంట్లో శృతి పెగ్నెంట్ అన్న వార్త నాకు ఎవరు చెప్పలేదు నన్ను కూరలో కరివేపాకు మాదిరి తీసేస్తున్నారు ఎప్పటికీ నా పరిస్థితి ఇంతేనా అనడంతో ఇంతే అని అంటాడు ప్రేమ. అప్పుడు ప్రేమ్ నేనే కనుక నీ స్థానంలో ఉంటే ఆ సారీ విసిరి పాడేసిన వాళ్ళ చెంప పగలగొట్టే వాడిని అని అంటాడు. అప్పుడు నందు ప్రేమ్ ని కొట్టబోతుండగా తులసి అడ్డుపడి పెద్దవాళ్ళతో మాట్లాడే పద్ధతి అదికాదు సారీ చెప్పు అనడంతో మిమ్మల్ని అవమానించినందుకు తను మీకు సారీ చెప్పమను అప్పుడు నేను కూడా సారీ చెబుతాను అని అంటాడు. అది చేతకాదు అని మళ్లీ ప్రేమ్ ని కొట్టబోతుండగా సామ్రాట్ అడ్డుపడతాడు.
 

37

అడ్డు జరుగు అనడంతో నేను అటు జరిగితే పోయేది నీ పరువే ప్రేమ ఆవేశంలో ఉన్నాడు వెనక్కి తగ్గు వెంటనే నందు హింట్ ఇస్తున్నావా లేకపోతే వాడిని ఎంకరేజ్ చేస్తున్నావా అని అంటాడు. లాస్యని పిలుచుకొని పక్కకు వెళ్ళు అనడంతో నేను తగ్గేది లేదు ఇక్కడే ఉంటాను చూద్దాం ఎంతటి దాకా వెళ్తుందో అని అంటుంది. అప్పుడు ప్రేమ్ అమ్మ నువ్వు వాళ్ళని వీళ్ళని అడగడం ఏంటి లోపలికి రా ఎవరు ఏం మాట్లాడతారో చూద్దాం అనడంతో అభి మాట్లాడుతూ ప్రేమ్ తప్పు చేస్తున్నావ్ గీత దాటుతున్నావు అని అంటాడు. సామ్రాట్ గారు నేను ఇక్కడికి గొడవ చూడడానికి రాలేదు ఫస్ట్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తులసి.
 

47

 అప్పుడు పరంధామయ్య ఒక్కసారి తులసిని బయటకు పంపించి చేయరాని తప్పు చేశావు. ఆ పాపం కడుక్కోడానికి మనకు జీవిత కాలం సరిపోదు. శుభవార్త చెప్పిన కోడల్ని దగ్గర తీసుకోవడానికి వచ్చిన తులసీని ఏడిపించి పంపించావు అది నీకే మంచిది కాదు త్వరలోనే నీకే అర్థమవుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు నందు ఇదంతా నీ వల్లే అని శ్రుతిని అందిస్తుండగా ప్రేమ్ తగిన విధంగా బుద్ధి చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ప్రేమ్ బాధపడుతూ వారి శృతి ఒక తల్లి మొదటిసారి గర్భవతి అయినందుకు ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంటుంది. ఆ వార్త తన వాళ్ళతో షేర్ చేసుకుని పండగ చేసుకోవాలనుకుంటూ ఉంటుంది అని ప్రేమ్ బాధపడుతూ ఉండగా శృతి ఓదారుస్తుంది.
 

57

 మరొకవైపు సామ్రాట్, తులసి జరిగిన విషయాలు తలుచుకొని బాధపడుతూ ఉంటారు. అప్పుడు సామ్రాట్ ఎందుకు వెనక్కి తగ్గారు అని అడుగుతాడు. మీ పిల్లలు మీకు దగ్గర అవడం ఇష్టం లేదా అనడంతో అలా అని వాళ్ళు నాన్నకు దూరమవ్వడం నాకు ఇష్టం లేదు అని అంటుంది తులసి. మోసం చేసి ఇంటిని తన పేరు మీదకు రాయించుకున్న లాస్యనే నందగోపాల్ గారు నమ్ముతున్నారు అంటే మీరు అతన్ని ఏ నమ్మకంతో నమ్ముతున్నారు అని అడుగుతాడు సామ్రాట్. తెలియదు సామ్రాట్ గారు అంతా అగమ్య గోచరంగా ఉంది అని తులసి ఆలోచనలో పడుతుంది. అప్పుడు సామ్రాట్ తులసికి నచ్చ చెబుతూ ఇప్పటికీ చాలా త్యాగాలు చేశారు మీ పద్ధతిని మార్చుకోండి అని అంటాడు.
 

67

 అప్పుడు తులసి తల పట్టుకుని కూర్చోగా సామ్రాట్ కాఫీ చేసుకొని వస్తాను అని కిచెన్ లోకి పెళ్లి కాపీ చేస్తుండగా అప్పుడు చెయ్యి కాలడంతో గట్టిగా అరవగా తులసి అక్కడికి వెళుతుంది. అప్పుడు తులసి టెన్షన్ పడుతూ సామ్రాట్ కి మందు రాస్తుంది. అప్పుడు సామ్రాట్ మీద తులసి అరుస్తూ ఉండగా వెంటనే సామ్రాట్ నేను కావాలనే చేయి కాల్చుకున్నాను అని అంటాడు. అప్పుడు తులసి మరింత బాధపడుతూ ఉంటుంది. అప్పుడు జరిగిన విషయాలు తలచుకుని నందు కోపంతో రగిలిపోతూ ఉండగా ఇంతలో లాస్య అక్కడికి వస్తుంది. అప్పుడు లాస్య కావాలనే నందుని వెటకారంగా మాట్లాడిస్తూ ఉంటుంది. అప్పుడు లాస్య తులసి మీద నందుకు లేని పోనిమని చెప్పి నందుని రెచ్చగొడుతూ ఉంటుంది.
 

77

నువ్వు చెప్పినట్టుగా ఇంట్లో వాళ్లతో కలిసి పోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా వాళ్ళు నాకు మినిమం మర్యాద కూడా ఇవ్వడం లేదు అని లాస్య నందుని రెచ్చగొడుతూ మాట్లాడుతుంది. ఏం మాట్లాడవు నందు అనడంతో నేను ఎవరికీ నచ్చజెప్పలేకపోతున్నాను ఎటు మాట్లాడలేకపోతున్నాను అని అంటాడు. అప్పుడు లాస్య దొంగ నాటకాలు ఆడుతూ చూడు నందు నీ కంటే ఎక్కువగా ఇంటి గురించి ఆలోచిస్తున్నాను అని అంటుంది. అప్పుడు లాస్య ఒక ఫైవ్ స్టార్ హోటల్లో శృతికి పార్టీ ఇద్దాము అని అంటుంది. మరొకవైపు తులసి సామ్రాట్ ఇద్దరూ కాఫీ తాగుతూ ఉండగా సామ్రాట్ తులసి కాఫీని పొగుడుతూ ఉంటాడు. అప్పుడు వారిద్దరు సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
4000 కోట్ల సినిమా, సాయిపల్లవి, రణ్‌బీర్, యష్ ల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Recommended image2
Leader Review: `లీడర్‌` మూవీ రివ్యూ.. లెజెండ్‌ శరవణన్‌ థియేటర్లో ర్యాంపేజ్‌
Recommended image3
ఏఎన్నార్, శోభన్ బాబు ను ర్యాగింగ్ చేసి.. ఏడిపించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved