Intinti gruhalakshmi: తులసి నా మాజీ పెళ్ళాం.. 'సామ్రాట్'కు నిజం చెప్పేసిన నందు!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఆగస్ట్ 19వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... లాస్య వాష్ రూమ్ కి వెళ్ళిందని నందు ఒక్కడే టేబుల్ మీద కూర్చుంటాడు. పక్కనే తులసి వాళ్ళు ఉంటారు. సామ్రాట్ తింటూ పోల మారిపోగా తులసి వచ్చి తల మీద కొట్టి మిమ్మల్ని ఎవరో గట్టిగా తలుచుకుంటున్నటున్నారు అని అంటుంది. ఈ సంఘటన చూసిన నందు కుల్లుకుంటాడు.అదే సమయంలో సామ్రాట్ కి తెలిసిన వాళ్ళు అక్కడ కనిపిస్తే వాళ్లతో పాటు మాట్లాడ్డానికి వెళ్తాడు. ఇంతట్లో నందు తులసితో ఈమధ్య కొన్ని మంది జాతకాలు బాగా మారిపోయినట్టున్నాయి. మొన్నే క్యాలెండర్ లో చూశాను కొన్ని రాశుల వారి జాతకాలు మరుపు తిరగని ఉన్నాయట. ముట్టుకున్నదంతా బంగారమే అవుతుందట అందులో మీది కూడా ఉన్నట్టున్నది అని అనగా నా జాతకాలు కూడా చూస్తున్నారా అని తులసి అంటుంది.
నేనేమీ నీ జాతకం చూడలేదు అని అంటాడు నందు.మరి నా అదృష్టం గురించి మీకు ఎలా తెలుసు అని అడగగా బెస్ట్ బిజినెస్ మాన్ కి పార్ట్నర్ గా ఉండడం, తీరని కోరికలు నెరవేర్చుకోవడం, ఫ్లైట్లో ఎక్కడం, క్యాండిల్ లైట్ డిన్నర్లు చేయడం, ఇవన్నీ చూసి అర్థమైంది అని అంటాడు నందు. అప్పుడు తులసి మీకు ఈర్షగా ఉందా? అని అడుగుతుంది. నాకెందుకు ఈర్షగా ఉంటుంది అయినా నేను నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను నేను నీ మాజీ భర్త అనే విషయం సామ్రాట్ గారికి చెప్పొద్దు అని నందు అనగా నేను చెప్పాను కదా నా అంతట నేను చెప్పను కానీ సామ్రాట్ గా అడిగితే మాత్రం అబద్ధం చెప్పను అని అంటుంది తులసి.
అప్పుడు నందు థాంక్స్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంతట్లో లాస్య అక్కడికి వస్తుంది.నందు సామ్రాట్ ఇక్కడ లేరెంటి అని అనుకుంటుంది.ఆంటట్లో సామ్రాట్ అధ్ధం వైపు చూస్తూ ఉండగా నందు అక్కడికి వెళ్లి,ముసలైపోతున్నారని బాధపడుతున్నారా? ఎందుకోసమో అని ఎటకారిస్తాడు. మీరేదో బాడ్ మూడులో ఉన్నట్టున్నారు. తర్వాత మాట్లాడుదాము అని సామ్రాట్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా నందు, మీరు తులసితో హద్దు మీరుతున్నారు జాగ్రత్త అని అంటాడు.
అయినా తులసి గురించి మాట్లాడడానికి నువ్వు ఎవరు అని సామ్రాట్ అనగా నేనే తన మాజీ భర్తని అని అంటాడు నందు. అయితే తులసిని అలా హింసించింది నువ్వేనా అని ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడు వారిద్దరిని తులసి లాస్యలు ఆపడానికి ప్రయత్నించగా వాళ్ళు లాస్య నీ తోసేస్తారు.అంతట్లో లాస్య ఇదంతా కలా? హమ్మయ్య నిజం కాలేదు. నా కలలు ఎప్పుడూ నిజం కావు మంచిదేలే అని అనుకుంటుంది.ఈ లోగ నందు ఏంటి ఇంకా రాలేదు అని ఫోన్ చేయగా నందు ఫోన్ ఎత్తడు. అలాగే తులసి సామ్రాట్ కి ఫోన్ చేయగా సామ్రాట్ కూడా ఫోన్ ఎత్తడు.తులసి నీ అడుగుదాము అని లాస్య సామ్రాట్ గారు ఎక్కడా అని అడుగుతుంది.
అరగంట అయింది ఇంకా రాలేదు ఫోన్ కూడా పనిచేయడం లేదు అని అనగా సరే ఇద్దరం వెళ్లి వెతుకుదాము అని లాస్య అంటుంది. ఇద్దరు వెళ్లి వెతికేసరికి నందు సామ్రాట్ లు మందు తూగుతూ ఉంటారు. వీళ్ళకి దొరికిపోయావమే అని అనుకుంటూ ఉంటారు నందు సామ్రాట్ లు. అప్పుడు సామ్రాట్ నాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. తులసి గారు,మీతో తాగడానికి మొహమాటపడి ఇక్కడికి వచ్చి తాగుతున్నాను అని అంటాడు దానికి నందు ఈరోజు నాకు చాలా బాధగా ఉంది అని తాగుతున్నాను అని అంటాడు. అప్పుడు సామ్రాట్ నందు తో మీకు తులసి ఎలా తెలుసు అని అనగా తులసి,లాస్యలు తాగిన మత్తులో నందు నిజం చెప్పేస్తాడు అని భయపడతారు.
అప్పుడు నందు తెలుసంటే తెలుసంటే అని అంటాడు. హమ్మయ్య అనుకున్న లోగా వాళ్ళిద్దరూ మాయమైపోతారు ఎక్కడికి వెళ్లారు అని మళ్ళీ తులసి లాస్యలు వెతకడం మొదలుపెడతారు. వాళ్ళిద్దరూ మందు తాగి అక్కడికి వెళ్లి డాన్స్ చేస్తారు. అక్కడ అందరూ వీళ్లేంటి ఇలా మర్చి పోతున్నారు మందులో అని అనుకుంటారు. ఆ తర్వాత నువ్వే నా ప్రాణ స్నేహితుడివి, నువ్వే నా ప్రాణ స్నేహితుడివి అని ఇద్దరికీ ఇద్దరూ పొగుడుకుంటూ ఉంటారు. తులసి లాస్యలు వాళ్ళిద్దరినీ బలవంతంగా వాళ్ళ గదిలోకి తీసుకువెళ్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలి ఉంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!