- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: వృద్ధాశ్రమంలో తులసి అత్తమామలు.. లాస్యకు గట్టి వార్నింగ్ ఇచ్చిన మాధవి!
Intinti Gruhalakshmi: వృద్ధాశ్రమంలో తులసి అత్తమామలు.. లాస్యకు గట్టి వార్నింగ్ ఇచ్చిన మాధవి!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులు బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఎక్కడికి వెళ్లాలో తెలియక అనసూయ (Anasuya) పరందామయ్య లు ఒక వృద్ధాశ్రమానికి వెళ్తారు. ఇక అంతకు ముందే వాళ్ళ మనవడు ప్రేమ్ అక్కడికి వచ్చి వారి ఇద్దరి ఫోటోలు చూపించి వీళ్ళిద్దరూ ఇక్కడికి వస్తే నాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పి వెళతాడు. ఇక పరందామయ్య (Parandamaiah) ఆ ఆశ్రమం మేనేజర్ కి మేమిద్దరం వృద్ధులు అని చెబుతాడు.
అంతేకాకుండా మాకు ఎవరూ లేరు. ఆశ్రయం కోసం ఇక్కడికి వచ్చామని మేనేజర్ తో పరందామయ్యా (Parandamaiah) అంటాడు. దాంతో ఆ మేనేజర్ మీ గురించి మీ మనవడు వచ్చాడు. మీకు అందరూ ఉన్నారు అని తెలుసు అని అంటాడు. ఇక పరందామయ్య మీకు దండం పెడతాం మేము ఇక్కడ ఉన్నట్లు ఎవరికీ చెప్పకండి అని అంటాడు. అనసూయ (Anasuya) కూడా బ్రతిమాలుతుంది.
ఇక పరందామయ్య (Parandamaiah).. నీకు దండం పెడతాను ముసలి ప్రాణాలకి అన్యాయం చేయకండి అని అంటాడు. ఆ మాటలకు కరిగిపోయిన ఆశ్రమం మేనేజర్ వాళ్లకి షెల్టర్ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేస్తాడు. ఇక పరందామయ్య దంపతులను వెతకడానికి వచ్చిన తులసి, మాధవి (Madhavi) లు వాళ్లు కనిపించకపోవడంతో అలిసిపోయి ఇంటికి వెళతారు.
ఇక ఇంటికి వచ్చిన తులసి (Tulasi) ను వాళ్ళిద్దరు ఎక్కడ అని నిలదీసి అడుగుతారు. ఎంత వెతికినా వాళ్ళు కనిపించలేదు అని తేల్చి చెప్పడంతో నందు శపథం చేసావు కదా అని దెప్పి పొడుస్తాడు. ఇక లాస్య (Lasya) కూడా వాళ్ళిద్దర్నీ కావాలనే దాచి పెట్టి నాటకం ఆడుతుంది అని అంటుంది.
ఇక ఆ మాటతో మాధవి (Madhavi) వాళ్ల వదినకు సపోర్టుగా లాస్య తో వాదిస్తుంది. ఇక లాస్య.. ఇంట్లో నందు కు విలువ లేకుండా చేసింది తులసి. అత్తమామల్ని కిడ్నాప్ చేసింది తులసి. అలా ప్రతి ఒక చేదు కారణానికి తులసి ను బ్లేమ్ చేస్తుంది లాస్య. దాంతో ఆసహనం వ్యక్తం చేసిన మాధవి లాస్య (Lasya) చెంప గట్టిగా పగలగొడుతుంది.
ఇక లాస్య (Lasya) నా పై చేయి వేసి నువ్వు చాలా తప్పు చేసావ్ అని మాధవి తో అంటుంది. నా వదిన చేయవలసిన చేయాల్సిన పని నేను చేశాను. నువ్వు నోరు మూసుకో అని మాధవి (Madhavi) లాస్యను అనేక మాటలతో మందలిస్తుంది.