Nandita Swetha: అమేజింగ్.. రెడ్ మిర్చిలా 'ఢీ' బ్యూటీ ఘాటైన అందాలు, పిక్స్ వైరల్
నందిత శ్వేత సౌత్ లో మంచి నటిగా గుర్తింపు సొంతం చేసుకుంది. ఎక్కువగా తెలుగు, తమిళ భాషల్లో నటించింది. తెలుగులో నందిత శ్వేతా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మూవీతో ఎంట్రీ ఇచ్చింది.

Nandita Swetha
నందిత శ్వేత సౌత్ లో మంచి నటిగా గుర్తింపు సొంతం చేసుకుంది. ఎక్కువగా తెలుగు, తమిళ భాషల్లో నటించింది. తెలుగులో నందిత శ్వేతా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నందిత శ్రీనివాస కళ్యాణం, ప్రేమ కథా చిత్రం 2, కపటధారి, అక్షర లాంటి చిత్రాల్లో మెరిసింది.
Nandita Swetha
ప్రస్తుతం నందిత బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఢీ 14 షోలో నందిత.. జానీ మాస్టర్ తో కలసి జడ్జిగా వ్యవహరిస్తోంది. నందిత లుక్స్, ఆమె గ్లామర్ తెలుగు యువతకు బాగా నచ్చాయి. అందుకే నందిత గ్లామర్ ఫోటోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
Nandita Swetha
ఢీ 14 షోలోకి ఎంటర్ అయ్యాక నందిత తరచుగా తన గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తోంది. తాజాగా నందిత రెడ్ శారీలో.. రెడ్ మిర్చిలా ఘాటుగా వయ్యారాలు ఒలికిస్తోంది. చీర కట్టులో నందిత రెట్టింపు అందంతో వెలిగిపోతోంది.
Nandita Swetha
నందిత బొద్దుగా, హాట్ లుక్ లో కుర్రాళ్లని కవ్వించే విధంగా ఫోజులు ఇస్తోంది. నందిత ఫోజులకు నెటిజన్లు సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫైర్, లవ్ ఎమోజిలతో తమ రియాక్షన్ తెలియజేస్తున్నారు.
Nandita Swetha
ఇదిలా ఉండగా నందిత బొద్దుగా మారడంతో ఇటీవల సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ కూడా ఎదుర్కొంది. నా బాడీని, నేనిప్పుడు కనిపిస్తున్న విధానాన్ని ఇష్టపడతాను. నా లైఫ్ లో ఈ దశని ఎంజాయ్ చేస్తున్నాను అంటూ ట్రోలర్స్ కి నందిత ఘాటుగా రిప్లై ఇచ్చింది.
Nandita Swetha
నందిత షేర్ చేసిన మరికొన్ని ఫొటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. డిఫెరెంట్ కాస్ట్యూమ్స్ లో నందిత అందంగా, హాట్ గా ఫోటో షూట్స్ చేస్తోంది.