తన బరువుపై, ముద్దు సీన్లపై నందిత శ్వేత షాకింగ్ కామెంట్స్.. ఆ వ్యాధితో బాధపడుతూ..
నందిత శ్వేత సౌత్ లో మంచి నటిగా గుర్తింపు సొంతం చేసుకుంది. ఎక్కువగా తెలుగు, తమిళ భాషల్లో నటించింది. తెలుగులో నందిత శ్వేతా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మూవీతో ఎంట్రీ ఇచ్చింది.

నందిత శ్వేత సౌత్ లో మంచి నటిగా గుర్తింపు సొంతం చేసుకుంది. ఎక్కువగా తెలుగు, తమిళ భాషల్లో నటించింది. తెలుగులో నందిత శ్వేతా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నందిత శ్రీనివాస కళ్యాణం, ప్రేమ కథా చిత్రం 2, కపటధారి, అక్షర లాంటి చిత్రాల్లో మెరిసింది.
ఆ మధ్యన నందిత శ్వేతా బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఢీ 14 డ్యాన్స్ షోలో నందిత జడ్జిగా వ్యవహరించింది. నందిత శ్వేతా త్వరలో ప్రేక్షకుల ముందుకు 'హిడింబ' అనే చిత్రంతో రాబోతోంది. ఈ మూవీలో నందిత శ్వేతా, అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇద్దరూ పోలీస్ అధికారులుగా కనిపించడం విశేషం.
జూలై 20న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండడంతో నందిత ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తన పాత్రకూడానా హీరోకి సమానంగా ఉంటుందని నందిత చెబుతోంది.
ఈ చిత్రంలో పోలీస్ పాత్ర కాబట్టి బరువు తగ్గేందుకు చాలా కష్టపడ్డట్లు నందిత తెలిపింది. బరువు తగ్గడం కూడా కష్టమేనా అనే అనుమానం రావచ్చు. కానీ నందిత ఎదుర్కొంటున్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలిస్తే.. ఆమె బరువు తగ్గడం ఎంత కష్టమో అర్థం అవుతుంది.
నాకు ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధి ఉంది. కొంతకాలంగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి ఉన్నప్పుడు కండరాల నొప్పులు అధికంగా ఉంటాయి.
కండరాల నొప్పులు అధికంగా ఉన్నప్పుడు డైట్ పాటించడం.. బరువు తగ్గడం కోసం వ్యాయామాలు చేయడం చాలా కష్టం. ఒత్తిడి ఎక్కువైనా, నిద్ర సరిగా లేకున్నా ఈ వ్యాధి మరింత ఎక్కువవుతుంది. కానీ ఈ కథకి న్యాయం చేయాలంటే నేను తప్పనిసరిగా బరువు తగ్గాలి.
ఇలాంటి కఠినమైన సవాళ్లు ఎదుర్కొని, వ్యాధిని భరిస్తూ కొంతవరకు బరువు తగ్గినట్లు నందిత పేర్కొంది. సాధారణంగా నేను రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్ కిస్సులకు దూరం. కానీ ఈ చిత్రంలో కథ పరంగా ముద్దు సీన్ లో నటించాల్సి వచ్చింది అని నందిత పేర్కొంది.
ట్రైలర్ లోనే నందిత, అశ్విన్ మధ్య ఘాటైన లిప్ లాక్ చూపించారు. అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ నటిస్తున్న మంగళరవారం చిత్రంలో తాను కూడా నటిస్తున్నట్లు నందిత తెలిపింది. తమిళంలో విజయ్ ఆంటోని సరసన కూడా నటిస్తున్నట్లు తెలిపింది.