- Home
- Entertainment
- శ్రీలీలతో మోక్షజ్ఞ ముచ్చట్లు, ఇంటర్నెట్ లో ఫొటోస్ తెగ వైరల్.. వారసుడు దారిలోకి వచ్చాడు, ఫ్యాన్స్ కామెంట్స్
శ్రీలీలతో మోక్షజ్ఞ ముచ్చట్లు, ఇంటర్నెట్ లో ఫొటోస్ తెగ వైరల్.. వారసుడు దారిలోకి వచ్చాడు, ఫ్యాన్స్ కామెంట్స్
తాజాగా మోక్షజ్ఞ తన తండ్రి బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి చిత్ర సెట్స్ లో సందడి చేశాడు. ఏకంగా సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీలతో లోకేషన్ లో ముచ్చట్లు పెట్టాడు.

నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. కానీ అది వాయిదా పడుతూనే ఉంది. ఈ ఏడాది అయినా మోక్షజ్ఞ తొలి చిత్రం ఉంటుందేమోనని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు. గత నాలుగేళ్లుగా మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఇదిగో అదిగో అంటూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఎటూ తేలడం లేదు.
ఆ మధ్యన అయితే మోక్షజ్ఞ బాగా బొద్దుగా కనిపించడంతో నందమూరి ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు. అసలు మోక్షజ్ఞ నటుడిగా మారేందుకు ఎలాంటి ప్రిపరేషన్స్ చేయడం లేదా అంటూ చర్చ జరిగింది. ఈ బాడీతో సినిమాల్లో నటించడం సాధ్యమేనా అని కూడా మాట్లాడుకున్నారు. అలాగే మోక్షజ్ఞకి టాలీవుడ్ లోకి రావడం నటించడం ఆసక్తి లేదనే రూమర్స్ కూడా వచ్చాయి.
ఈ రూమర్స్ కి చెక్ పెడుతూ మోక్షజ్ఞ క్రమంగా యాక్టివ్ అవుతున్నాడు. నందమూరి అభిమాన సంఘ నాయకులని తరచుగా కలుస్తున్నాడు. బాలయ్య నటిస్తున్న చిత్రాల సెట్స్ కి కూడా వెళుతున్నాడు. ఈ మధ్యన మోక్షజ్ఞ.. నందమూరి సుహాసిని కుమారుడి పెళ్లి వేడుకలో సందడి చేశాడు. జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో కలసి ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చాడు.
తాజాగా మోక్షజ్ఞ తన తండ్రి బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి చిత్ర సెట్స్ లో సందడి చేశాడు. ఏకంగా సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీలతో లోకేషన్ లో ముచ్చట్లు పెట్టాడు. దీనితో నందమూరి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. మోక్షజ్ఞ నెమ్మదిగా షై ఫీలింగ్ వదిలేస్తున్నాడు అని అంటున్నారు. నందమూరి వారసుడు దారిలోకి వస్తున్నాడు అంటూ ఇంకొందరు కామెంట్స్ చేయడం విశేషం.
ఈ ఫొటోస్ లో మోక్షజ్ఞతో భగవంత్ కేసరి డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఉండడం విశేషం. మోక్షజ్ఞ తొలి చిత్రానికి శ్రీలీలనే హీరోయిన్ గా సెట్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల హవా ఆ రేంజ్ లో ఉంది మరి.
మోక్షజ్ఞ, శ్రీలీలతో మాట్లాడుతున్న విధానం ఇంటర్నెట్ ని బ్రేక్ చేసేలా ఉంది. స్టైలిష్ గ్లాసెస్ పెట్టుకున్న మోక్షజ్ఞ ఈ క్యూట్ బ్యూటీతో సెట్ లో ఇంటరాక్ట్ అయ్యాడు. ఇదిలా ఉండగా భగవంత్ కేసరి చిత్రం అక్టోబర్ 19న రిలీజ్ కి రెడీ అవుతోంది.