MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చచ్చేంత భయం ఉన్నా భార్య కోసం ఆ పని చేసిన కళ్యాణ్ రామ్.. పచ్చబొట్టు వెనుక ఎమోషనల్ స్టోరీ

చచ్చేంత భయం ఉన్నా భార్య కోసం ఆ పని చేసిన కళ్యాణ్ రామ్.. పచ్చబొట్టు వెనుక ఎమోషనల్ స్టోరీ

బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అమిగోస్'. ఫిబ్రవరి 10న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.  ఈ చిత్ర రిలీజ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 08 2023, 03:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అమిగోస్'. ఫిబ్రవరి 10న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.  ఈ చిత్ర రిలీజ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెన్సార్ కూడా పూర్తయింది. అమిగోస్ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులని థ్రిల్ చేయడం మాత్రమే మిగిలి ఉంది. ఈ చిత్రానికి రాజేంద్ర రెడ్డి దర్శకుడు కాగా.. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఈ చిత్ర ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. కళ్యాణ్ రామ్ పర్సనల్ లైఫ్ విషయాలని మీడియా ముందు మాట్లాడేందుకు అంతగా ఇష్టపడరు. కానీ లేటెస్ట్ ఇంటర్వ్యూలో తన భార్య గురించి ఒక ఎమోషనల్ ఇన్సిడెంట్ రివీల్ చేశారు. కళ్యాణ్ రామ్ చేతిపై అతని భార్య స్వాతి పేరు పచ్చబొట్టుగా కనిపిస్తుంది. 

36

భార్యపై ప్రేమతో ఆ టాటూ వేసుకుని ఉండొచ్చు. కానీ ప్రేమకి మించి ఎమోషనల్ కథ ఉందట ఆ టాటూ వెనుక. కళ్యాణ్ రామ్ ఆ టాటూ సీక్రెట్ రివీల్ చేస్తూ.. 2007లో నాకు అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఆరోగ్యం ఏమాత్రం సహకరించలేదు. ఆ సమయంలో ఏ భార్య అయినా భర్తకి సేవలు చేస్తుంది.. నిజమే. కానీ నా భార్య స్వాతి తనకి హెల్ప్ గా నర్స్ ని కూడా పెట్టుకోవచ్చు. 

46

కానీ తను నర్స్ వద్దంది. ఎందుకంటే నా గురించి ఆమెకి పూర్తిగా తెలుసు. ఒక అమ్మ కొడుకుని చూసుకున్నట్లు నన్ను నా భార్య చూసుకుంది. నా భార్య వల్లే నేను కోలుకోగలిగాను. నాకు సూదులు అంటే చచ్చేంత భయం. ఇంజక్షన్ వేయించుకోవడానికి కూడా భయపడతాను. మా టెన్త్ యానవర్సరీ రోజున నీకు ఏం కావాలి చెప్పు.. ఏమైనా చేస్తా అని తనని అడిగా. నాకు ఏమీ వద్దు.. అన్నీ ఉన్నాయి. మీరు, పిల్లలు పక్కన ఉన్నారు అది చాలు అని తెలిపింది. 

56

ఆరోజే అనుకున్నాను.. నా భార్య పేరు పచ్చబొట్టు వేయించుకుని సూదులు అంటే ఉన్న భయాన్ని విడిచిపెట్టాలి అని. అలా నా భార్య పేరు టాటూగా వేయించుకున్నా అని కళ్యాణ్ రామ్ తెలిపారు. 

66

కళ్యాణ్ రామ్ అమిగోస్ చిత్రంలో తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ సరసన యంగ్ బ్యూటీ ఆషిక రంగనాథ్ నటిస్తోంది. ఎన్టీఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి హాజరు కావడం, ట్రైలర్ బావుండడంతో అమిగోస్ పై మంచి అంచనాలు ఉన్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Lenin Movie Review: లెనిన్‌ మూవీ రివ్యూ.. అఖిల్‌కి ఈ సారైనా హిట్‌ పడిందా?
Recommended image2
CM Vijay Thalapathy : జన నాయగన్ కంటే ముందే సీఎం విజయ్‌కి 'A' సర్టిఫికెట్.. ఆ సినిమా ఏదో తెలుసా?
Recommended image3
Suriya vs Dhanush: శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ లో హీరోగా పోటీలో సూర్య - ధనుష్? అసలు వేల్పారి కథేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved