MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bimbisara: ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ భలే రికార్డు కొట్టారుగా.. రాజమౌళి నుంచి వశిష్ట్ వరకు, ఇవిగో క్రేజీ డిటైల్స్

Bimbisara: ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ భలే రికార్డు కొట్టారుగా.. రాజమౌళి నుంచి వశిష్ట్ వరకు, ఇవిగో క్రేజీ డిటైల్స్

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలైంది. కళ్యాణ్ రామ్ కింగ్ బింబిసార అదరగొట్టాడు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 06 2022, 09:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలైంది. కళ్యాణ్ రామ్ కింగ్ బింబిసార అదరగొట్టాడు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ టైం ట్రావెల్ కథని ఫాంటసీ ఎలిమెంట్స్ తో డెబ్యూ దర్శకుడు వశిష్ట్ డీల్ చేసిన విధానం అదుర్స్. ఈ చిత్రంతో వశిష్ట్ పేరు మారుమోగుతోంది. 

 

26

బింబిసార హిట్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సాధించిన రేర్ రికార్డ్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. కళ్యాణ్ రామ్ కెరీర్ గమనిస్తే.. ఈ నందమూరి హీరో కెరీర్ లో అతనొక్కడే, పటాస్, 118, బింబిసార లాంటి హిట్స్ ఉన్నాయి. ఈ నాలుగు చిత్రాలు డెబ్యూ దర్శకులు తెరకెక్కించినవే. అంతనొక్కడే చిత్రంతో సురేందర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇప్పుడు సురేందర్ రెడ్డి టాలీవడ్ లో స్టార్ డైరెక్టర్. 

36

అలాగే పటాస్ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన అనిల్ రావిపూడి క్రేజీ దర్శకుడిగా మారారు. లేటెస్ట్ మూవీ బింబిసారతో అంతా వశిష్ట్ ప్రతిభని గుర్తించారు. వశిష్ట్ టాప్ డైరెక్టర్ అవుతారనే అంచనాలు వినిపిస్తున్నాయి. 

46

ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే.. స్టూడెంట్ నంబర్ 1 చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి స్థానం ఇప్పుడు ఇండియాలో ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆది చిత్రంతో వివి వినాయక్ పరిచయం అయ్యారు. టాలీవుడ్ లో మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు వినాయక్. 

56

ఈ నందమూరి అన్నదమ్ములు కలసి ఏకంగా ఐదుగురు డెబ్యూ దర్శకులని క్రేజీ డైరెక్టర్స్ గా మార్చారు. ఇది రేర్ రికార్డ్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. 

66

బింబిసార విజయం సాధించిన సంతోష సమయంలో బింబిసార 2 చిత్రాన్ని కూడా కళ్యాణ్ రామ్ ప్రకటించడం విశేషం. బింబిసారని మించేలా అద్భుతమైన కథని బింబిసార 2 తో ప్రేక్షకులకు అందించే బాధ్యత తమది అని కళ్యాణ్ రామ్ మీడియా సమావేశంలో హామీ ఇచ్చారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
N T Rama Rao: 5 సార్లు రాముడు, 5 సార్లు రావణుడు.. ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమైన అరుదైన రికార్డ్
Recommended image2
Karthika Deepam 2 Today Episode: సూపర్ సస్పెన్స్ ఎపిసోడ్- దీపను చంపబోయిన జ్యో- అయోమయంలో కార్తీక్
Recommended image3
ప్రభాస్ సినిమా రికార్డును బ్రేక్ చేయలేకపోయిన ధురంధర్ 2, ఫస్ట్ ప్లేస్ సాధించిన తెలుగు మూవీ ఏది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved