- Home
- Entertainment
- 'కె ర్యాంప్' ట్విట్టర్ రివ్యూ, కామెడీ టైమింగ్ తో అదరగొట్టిన కిరణ్ అబ్బవరం.. కానీ, సినిమా హిట్టా ఫట్టా ?
'కె ర్యాంప్' ట్విట్టర్ రివ్యూ, కామెడీ టైమింగ్ తో అదరగొట్టిన కిరణ్ అబ్బవరం.. కానీ, సినిమా హిట్టా ఫట్టా ?
కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ కె ర్యాంప్ నేడు అక్టోబర్ 18న రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ ప్రీమియర్ షోలు పడ్డాయి. రొమాంటిక్ కామెడీ జోనర్ లో ఈ మూవీ రూపొందింది. కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో హిట్ పడిందా ? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

కె ర్యాంప్ ట్విట్టర్ రివ్యూ
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. తన కెరీర్ లో కొన్ని సక్సెస్ ఫుల్ చిత్రాలు కూడా ఉన్నాయి. గతేడాది కిరణ్ అబ్బవరం అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చిన 'క' చిత్రంతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత నటించిన దిల్ రూబా చిత్రం నిరాశపరిచింది. ఈసారి కిరణ్ అబ్బవరం రొమాంటిక్ కామెడీ జోనర్ ఎంచుకున్నాడు. కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ 'కె ర్యాంప్'. జైన్స్ నాని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. చైతన్ భరద్వాజ్ సంగీత దర్శకుడు. కిరణ్ అబ్బవరం కి జోడిగా యుక్తి తరేజా నటించింది. దీపావళి కానుకగా ఈ చిత్రం నేడు అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆల్రెడీ యుఎస్ లో ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా కె ర్యాంప్ మూవీ ఎలా ఉంది ? కిరణ్ అబ్బవరం మరో హిట్ అందుకున్నాడా ? అనే వివరాలు ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం.
అక్కడక్కడా వర్కౌట్ అయ్యే కామెడీ
కిరణ్ అబ్బవరం తన తొలి చిత్రం నుంచి కామెడీ టైమింగ్, ఎనెర్జీతో ఆకట్టుకుంటున్నాడు. ఈ మూవీలో కూడా అదే ట్రై చేశాడు. సినిమా మొత్తం కిరణ్ అబ్బవరం క్యారెక్టర్ ఎనెర్జిటిక్ గా సాగుతుంది. కామెడీ అక్కడక్కడా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాల్లో కిరణ్ అబ్బవరం వన్ లైన్ డైలాగులు బాగా పేలాయి. కానీ కథ పరంగా సినిమా చెప్పుకునేంత గొప్పగా ఏమీ లేదు. గతంలో చాలా సినిమాల్లో చూసిన ఒక ఫార్ములాతో కథ రొటీన్ గా సాగుతుంది. చాలా సన్నివేశాలు బోరింగ్ గా ఉంటాయి.
కేరళ బ్యాక్ డ్రాప్ లో కథ
కథ కేరళ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం గాలికి తిరిగే కుర్రాడిగా కనిపిస్తాడు. కేరళలో ఉండే కాలేజీ సన్నివేశాలు, హీరోయిన్ తో లవ్ సీన్స్ ఏమాత్రం వర్కౌట్ కాలేదు. ఎంచుకున్నదే రొటీన్ కథ.. దానిని కూడా ఎంగేజింగ్ గా నడిపించలేదు . దీనితో ఫస్ట్ హాఫ్ నిరాశపరిచే విధంగా ఉంటుంది.
ప్రేక్షకులకు నిరాశ
ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు కూడా ట్విట్టర్ లో కె ర్యాంప్ మూవీ పట్ల నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కామెడీ ఆశించి వస్తే చిరాకు పుట్టించే సన్నివేశాలతో సినిమా ఉంది అని అంటున్నారు. ఇదే కథని కాస్త చక్కగా డీల్ చేసి, మంచి కామెడీ సీన్లు పెట్టి ఉంటే కనీసం వినోదం కోరుకునే ప్రేక్షకులకు అయినా నచ్చి ఉండేది అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ పూర్తిగా నిరాశపరచగా సెకండ్ హాఫ్ కాస్త పర్వాలేదనిపిస్తుంది.
సెకండ్ హాఫ్ ఎలా ఉందంటే
సెకండ్ హాఫ్ లో హీరోయిన్ కి ఉండే డిసార్డర్ నేపథ్యంలో 30 నిమిషాల పాటు కామెడీ సీన్లు ఉంటాయి. అవి బాగా నవ్విస్తాయి. అదే విధంగా తండ్రీకొడుకుల సెంటిమెంట్ కూడా బావుంది. ఇక మిగిలిన సన్నివేశాలేవీ ఆకట్టుకోలేదు. ముఖ్యంగా నటుడు నరేష్ ఫన్నీ డబుల్ మీనింగ్ డైలాగులు చిరాకు పుట్టిస్తాయి. ఓవరాల్ గా కిరణ్ అబ్బవరం 'కె ర్యాంప్' తో చేసిన ప్రయత్నం ఆకట్టుకోలేకపోయింది. దీపావళి సందర్భంగా ఈ చిత్రానికి వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి. ఈ చిత్రం డ్యూడ్, తెలుసు కదా నుంచి కూడా పోటీ ఎదుర్కోవాలి.