ఆ నెగిటివ్ పాత్రలో నటించే ఛాన్స్ నాకు జీవితంలో వస్తుందో రాదో.. బాలయ్య క్రేజీ కామెంట్స్ వైరల్
నందమూరి ఫ్యాన్స్ ప్రస్తుతం జోష్ లో ఉన్నారు. బాలయ్య నటించిన డాకు మాహారాజ్ చిత్రం గ్రాండ్ సక్సెస్ దిశగా దూసుకుపోతోంది. డైరెక్టర్ బాబీ, బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కిన డాకు మహారాజ్ చిత్రం మాస్ అంశాలతో ఆడియన్స్ ని అలరిస్తోంది.
నందమూరి ఫ్యాన్స్ ప్రస్తుతం జోష్ లో ఉన్నారు. బాలయ్య నటించిన డాకు మాహారాజ్ చిత్రం గ్రాండ్ సక్సెస్ దిశగా దూసుకుపోతోంది. డైరెక్టర్ బాబీ, బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కిన డాకు మహారాజ్ చిత్రం మాస్ అంశాలతో ఆడియన్స్ ని అలరిస్తోంది. రొటీన్ స్టోరీ అనినప్పటికీ బాలయ్యని బాబీ ప్రజెంట్ చేసిన విధానం, తమన్ బిజియం, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.
బాలయ్యకి ఇది వరుసగా నాలుగో విక్టరీ. అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి చిత్రాల తర్వాత డాకు మహారాజ్ కూడా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రంలో ప్రగ్యా జైశ్వాల్, శ్రద్దా శ్రీనాథ్ కీలక పాత్రల్లో నటించారు. ఊర్వశి రౌటేలా చిన్న పాత్ర చేయడంతో పాటు అదిరిపోయే ఐటెం సాంగ్ తో మెప్పించింది. హిట్ల మీద హిట్లు కొడుతున్న బాలయ్య.. త్వరలో పౌరాణిక చిత్రం కూడా చేయాలని ఫ్యాన్స్ నుంచి డిమాండ్ వినిపిస్తోంది.
బాలయ్య పౌరాణిక చిత్రం చేయడానికి ఇది మంచి టైం అని కూడా ఫ్యాన్స్ చెబుతున్నారు. దీనితో బాలయ్య గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బాలయ్య చివరగా శ్రీరామరాజ్యం అనే పౌరాణిక చిత్రంలో నటించారు. రాముడిగా అందులో నటించగా ఆశించిన ఫలితం రాలేదు. ఓ ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ.. నాన్నగారు నటించి దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణం చిత్రం అంటే తనకి చాలా ఇష్టం అని తెలిపారు.
ఆ చిత్రంలో నాన్నగారు రావణాసురుడిగా నెగిటివ్ పాత్రలో నటించారు. రావణాసురుడు నెగిటివ్ క్యారెక్టర్ అయినప్పటికీ ఆయన నటించిన విధానానికి ప్రేక్షకుల జేజేలు కొట్టారు. రావణాసురుడే హీరో అన్నట్లుగా ఆ పాత్ర ఉంటుంది. ఈ చిత్రం తర్వాతే ఎన్టీఆర్ దానవీర శూర కర్ణ చిత్రంలో దుర్యోధనుడిగా మరో నెగిటివ్ రోల్ చేశారు. అది కూడా చరిత్ర సృష్టించింది. నాన్నగారిలా నాకు రావణాసురుడి పాత్రలో నటించే అవకాశం జీవితంలో వస్తుందో రాదో అని బాలయ్య కామెంట్స్ చేశారు.
నర్తనశాల చిత్రంలో బాలయ్య మల్టిపుల్ రోల్స్ లో నటించేందుకు ప్రయత్నించారు. కానీ ఆ చిత్రం ఆగిపోయింది. దీని గురించి కూడా బాలయ్య మాట్లాడారు. ఏది ఏమైనా బాలయ్య పౌరాణిక చిత్రంలో నటించడానికి ఇంతకి మించిన సమయం దొరకదని చెబుతున్నారు.