బాలయ్యకు పొటేలు తలకాయల దండ... ఇదెక్కడి అభిమానంరా బాబు...
ఈమధ్య అభిమానులు చాలా కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. డిఫరెంట్ గా ప్లాన్ చేస్తూ.. తమ అభిమాన నటులను సర్ ప్రైజ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే బాలయ్య ఫ్యాన్స్ కూడా కాస్త కొత్తగా ఆలోచించి చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

అభిమానులు కూడా ఒక్కొక్కరు ఇక్కొక్క రకంగా ఉంటారు. అందులో మన బాలయ్య ఫ్యాన్స్అయితే మరో లెవల్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో అదరగొడుతుంటారు. తమ ఫేవరెట్ హీరో కి సంబంధించిన సినిమాలు రిలీజ్ అయినప్పుడు కామెంట్స్ పెడుతూ ఉంటే .. మరి కొందరు.. వింత వింత పనులు చేస్తూ.. అందరిదృష్టిలో పడేలా చూస్తారు.
సినిమా రిలీజ్లు.. సినిమా ఫంక్షన్స్ కు పాలాభీషేకాలు.. జంతుబలులలు, డాన్స్ లు.. ఊరేగింపులు కామన్ గా జరిగేవే. కాని ఈసారి మాత్రం కాస్త డిపరెంట్ గా చేశారు బాలయ్య ఫ్యాన్స్.. అందరు ముక్కున వేలు వేసుకునేలా..ఔరా అనిపించేలా.. బాలయ్య ఫ్యాన్స్ చేశారు.నందమూరి బాలకృష్ణ మూడో సారి గెలిచిన సందర్భంగా ఫాన్స్ ఫుల్ రెచ్చిపోయారు.. హిందూపురంలో కటౌట్లకు పొటేలు తలకాయల దండలు వేసి.. షాక్ ఇచ్చారు.
బాలయ్య వరుసగా మూడుసార్లు గెలిచిన సందర్భంగా మాస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు .అలా ఇలా కాదు ఏకంగా పొట్టేల తలకాయల్ని నరికేసి ఆ తలకాయలతో మాల కట్టి ..ఆ మాలను బాలయ్య కటౌట్ కి వేశారు.. హ్యాట్రిక్ విన్నింగ్ సెలబ్రేషన్స్ అంటూ బాగా ట్రెండ్ చేశారు . దీనికి సంబంధించిన వీడియోలు.. ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా పోస్టర్లు.. కటౌట్లకు.. గజమాలతో పాటు డిఫరెంట్ గా ఉండేందుకు నోట్లతో , టికెట్లతో.. ఇంకా డిఫరెంట్ గా ప్లాన్ చేసి మాలలు వేస్తుంటారు. కాని అందరిలా మనమెందుకు ఉండాలి అనుకున్నారేమో బాలయ్య ఫ్యాన్స్ ఏకంగా పొట్టేల తలకాయలతో తయారు చేసిన దండ ఆయన కటౌట్ కి వేసి అదిరిపోయేలా హంగామా చేశారు.
ఈ వీడియోలు..ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య బాబు మాత్రం అటు సినిమాలు.. ఇటు రాజకీయం రెండు రకాలుగా దూసుకుపోతున్నారు. వరుసగా హిట్ సినిమాలు చేయడంతో పాటు.. హిందుూపురం నుంచి మూడో సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాంతో బాలయ్య ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు.