MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • విజయశాంతి మూవీ ప్రభంజనంలో కొట్టుకుపోయిన బాలయ్య చిత్రం.. అసలేం జరిగిందంటే

విజయశాంతి మూవీ ప్రభంజనంలో కొట్టుకుపోయిన బాలయ్య చిత్రం.. అసలేం జరిగిందంటే

నందమూరి బాలకృష్ణ, విజయశాంతి ఇద్దరూ తమ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. ఆ చిత్రాలు వివరాలు ఇప్పుడు చూద్దాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 20 2025, 04:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
లేడీ సూపర్ స్టార్ గా విజయశాంతి 
Image Credit : Facebook/Vijayasanthi, balakrishna

లేడీ సూపర్ స్టార్ గా విజయశాంతి 

విజయశాంతి గతంలో స్టార్ హీరోలకు ధీటుగా లేడీ సూపర్ స్టార్ గా రాణించారు. అప్పట్లో విజయశాంతి ప్రతిఘటన, కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ చిత్రాలతో బాక్సాఫీస్ ని షేక్ చేశారు. విజయశాంతి కమర్షియల్ చిత్రాల్లో గ్లామరస్ హీరోయిన్ గా రాణిస్తూనే ఇలా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా సత్తా చాటారు. కొన్నిసార్లు విజయశాంతి తన చిత్రాలతో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి అగ్ర హీరోలకు గట్టి పోటీ ఇచ్చేవారు. 

DID YOU
KNOW
?
బాలకృష్ణతోనే ఈజీ
తాను నటించిన స్టార్ హీరోల్లో బాలయ్యతో నటించడం సులభం అని విజయశాంతి అన్నారు. ఎందుకంటే బాలయ్యతో ఆ చనువు, వైబ్ ఉంటుందని పేర్కొన్నారు. 
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విజయశాంతి, బాలకృష్ణ కాంబినేషన్ 
Image Credit : Facebook

విజయశాంతి, బాలకృష్ణ కాంబినేషన్ 

ఒక సందర్భంలో విజయశాంతి ప్రభంజనం వల్ల నందమూరి బాలకృష్ణ నటించిన ఒక చిత్రం దారుణంగా దెబ్బ తినింది. వాస్తవానికి బాలకృష్ణ, విజయశాంతి వెండితెరపై సూపర్ హిట్ జోడిగా గుర్తింపు పొందారు. రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్, ముద్దుల మావయ్య లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో బాలకృష్ణ, విజయశాంతి జంటగా నటించారు. విజయశాంతి బాలయ్యతో రొమాన్స్ చేయడమే కాదు బాక్సాఫీస్ బరిలో పోటీ పడి విజయం సాధించింది కూడా. 

35
బాలయ్యతో బాక్సాఫీస్ వార్ 
Image Credit : Facebook

బాలయ్యతో బాక్సాఫీస్ వార్ 

విజయశాంతి నటించిన ప్రతిఘటన చిత్రం 1985 అక్టోబర్ 11న రిలీజ్ అయింది. అదే రోజున బాలకృష్ణ నటించిన కత్తుల కొండయ్య చిత్రం రిలీజ్ అయింది. ప్రతిఘటన చిత్రం విప్లవాత్మక కథతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ప్రస్తుతం హీరోగా రాణిస్తున్న గోపీచంద్ తండ్రి టి కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రాజశేఖర్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, చరణ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. 

45
విజయశాంతిదే విజయం 
Image Credit : youtube print shot/aha unstoppable show

విజయశాంతిదే విజయం 

బాలకృష్ణ కత్తుల కొండయ్య చిత్రం ఎస్ బి చంద్రవర్తి దర్శకత్వంలో రూపొందింది. మాస్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని మెప్పించలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ చిత్రంలో సుమలత హీరోయిన్ గా నటించగా రాజేంద్ర ప్రసాద్, కైకాల సత్యనారాయణ, గుమ్మడి వెంకటేశ్వర రావు కీలక పాత్రల్లో నటించారు. విజయశాంతి ప్రతిఘటన ధాటికి కత్తుల కొండయ్య చిత్రం కనిపించకుండా పోయింది. 

55
డైరెక్టర్ టి కృష్ణ, విజయశాంతి మూవీస్ 
Image Credit : Facebook/Nandamuri Balakrishna

డైరెక్టర్ టి కృష్ణ, విజయశాంతి మూవీస్ 

విజయశాంతి లేడీ సూపర్ స్టార్ గా ఎదగడంలో కీలక పాత్ర వహించిన దర్శకుల్లో ప్రతిఘటన డైరెక్టర్ టి కృష్ణ ఒకరు. విజయశాంతితో ప్రతిఘటనతో పాటు నేటి భారతం, వందేమాతరం, రేపటి పౌరులు లాంటి చిత్రాలని టి కృష్ణ తెరకెక్కించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
నందమూరి బాలకృష్ణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
నా ఫ్యాన్స్ లారీల్లో వచ్చి కొడతారు అని వార్నింగ్ ఇచ్చిన కృష్ణంరాజు, మహిళా అభిమానుల కోసం బాధపడిన రెబల్ స్టార్
Recommended image2
ఒక్కడి మాట వినడం వల్ల మహేష్ బాబు భారీ చిత్రం డిజాస్టర్ అయింది.. పదేళ్ల తర్వాత అసలు మ్యాటర్ లీక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved