- Home
- Entertainment
- మహేష్ కోసం ఆఫ్రికా చేరుకున్న ప్రియాంక, షూటింగ్ లొకేషన్స్ మొత్తం బయటపెట్టేసింది.. నమ్రత రియాక్షన్ వైరల్
మహేష్ కోసం ఆఫ్రికా చేరుకున్న ప్రియాంక, షూటింగ్ లొకేషన్స్ మొత్తం బయటపెట్టేసింది.. నమ్రత రియాక్షన్ వైరల్
ప్రియాంక చోప్రా షేర్ చేసిన ఆఫ్రికా ఫోటోలపై నమ్రత శిరోద్కర్ స్పందించారు. మహేశ్ బాబు, రాజమౌళి ఎస్ఎస్ఎంబీ29 షూట్ ఆఫ్రికాలో సాగుతున్నట్లు సమాచారం.

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇటీవల ఆఫ్రికా టూర్‌కు సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అందమైన ఆఫ్రికన్ ల్యాండ్‌స్కేప్‌లు, అక్కడి ప్రకృతి అందాలు, వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్‌లా ఆమె తీసుకున్న సెల్ఫీలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
అయితే ప్రియాంక చోప్రా ఆఫ్రికాలో ఎందుకు ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం అక్కడ ఎస్ఎస్ఎంబీ 29 చిత్ర షూటింగ్ జరుగుతోంది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న గ్లోబ్ ట్రాట్టర్ చిత్రం 1000 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతోంది.
ఈ ఫోటోలు ఎస్ఎస్ఎంబీ29 చిత్ర షూట్ సమయంలో ప్రియాంక చోప్రా తీసుకున్నవేనని భావిస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం కెన్యా, టాంజానియా, సౌతాఫ్రికా ప్రాంతాల్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.ప్రియాంక తన క్యాప్షన్లలో ప్రత్యేకంగా సినిమా గురించి ఏమీ ప్రస్తావించకపోయినా, అభిమానులు ఈ ఫోటోలను ఎస్ఎస్ఎంబీ29తో లింక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ ప్రియాంక పోస్ట్‌పై ‘లవ్’ ఎమోజీతో స్పందించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో, అంతర్జాతీయ స్థాయి షూటింగ్ షెడ్యూల్స్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టాంజానియా, సౌతాఫ్రికాలో భాగస్వామ్య సన్నివేశాలను చిత్రీకరించిన టీమ్, ఇప్పుడు కెన్యాలో భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తోంది. ఈ సినిమా 2027లో విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి. అభిమానులను మరింత ఉత్కంఠకు గురి చేస్తూ, సినిమా టైటిల్‌ను 2025 నవంబర్‌లో అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం.
ఎస్ఎస్ఎంబీ29 చిత్రంపై రోజురోజుకూ పెరుగుతున్న అంచనాలకు ప్రియాంక చోప్రా ఆఫ్రికా ఫోటోలు, నమ్రత శిరోద్కర్ స్పందన మరింత బలాన్నిచ్చినట్లయ్యింది. ఇప్పుడు ప్రేక్షకులు ఈ సినిమా టైటిల్ కోసం, మరిన్ని అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రియాంక పోస్ట్ చేసిన ఫొటోలతో ఎస్ఎస్ ఎంబీ షూటింగ్ లొకేషన్స్ మొత్తం బయటపెట్టినట్లు అయింది.