- Home
- Entertainment
- మహేష్ బాబుతో సినిమా.. నమ్రత క్రేజీ రియాక్షన్.. రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన మాజీ హీరోయిన్
మహేష్ బాబుతో సినిమా.. నమ్రత క్రేజీ రియాక్షన్.. రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన మాజీ హీరోయిన్
నమ్రత నటించడం మానేసి 20ఏళ్లు అవుతుంది. ఇప్పుడు మళ్లీ నటించే అవకాశం ఉందా? మహేష్‌తో కలిసి నటిస్తారా అనే ప్రశ్నకి స్పందించింది. క్రేజీ ఆన్సర్ ఇచ్చింది.

హీరోయిన్ గా బాలీవుడ్ ని ఊపేసింది నమ్రత శిరోద్కర్. మాజీ అందాల తార నుంచి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ క్రమంలో `వంశీ` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది నమ్రత. మహేష్ బాబుతో కలిసి నటించింది.
ఈ సినిమా సమయంలోనే మహేష్ బాబుతో ప్రేమలో పడింది నమ్రత. తన కంటే ఏజ్‌లో చిన్న అయినా ఇద్దరి ప్రేమకి ఏజ్ మ్యాటర్ కాదని నిరూపించారు. తొలి సినిమాతోనే ఈ ఇద్దరి మధ్య ప్రేమ మరింతబల పడింది. అంతే కొన్నాళ్ల తర్వాత ఆ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లారు.
సూపర్ స్టార్ కృష్ణ అహిష్టంగానే ఈ ప్రేమని ఒప్పుకున్నాడు. ముందు నో చెప్పిన ఆయన ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతే చాలా సింపుల్‌గా మ్యారేజ్ చేసుకున్నారు. అయితే అప్పటికే అటు హిందీలో, ఇటు తెలుగులో సినిమాలు చేసింది నమ్రత. తెలుగులో చిరంజీవితో మాత్రమే నటించింది. `అంజి`లో నటించిన విషయం తెలిసిందే.
మహేష్‌బాబు తో పెళ్లి తర్వాత క్రమంగా సినిమాలు తగ్గించింది. ఒకటి రెండేళ్లలోనే అన్ని కంప్లీట్ చేసి పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పింది నమ్రత. ఆమె సినిమాలు మానేసి 20ఏళ్లు అవుతుంది. ఆ తర్వాత మొత్తం ఫ్యామిలీ లైఫ్‌కి పరిమితమయ్యింది. పిల్లలను చూసుకోవడం, క్రమంగా మహేష్ డేట్స్ చూసుకోవడం, కమర్షియల్స్ చూసుకోవడం, బిజినెస్‌లు చూసుకోవడం చేస్తుంది.
మహేష్ కి బ్యాక్ బోన్‌గా ఉంది. ఆయనకు సంబంధించిన ఎవ్రీథింగ్ నమ్రతనే చూసుకుంటుంది. నిర్మాతగా బిజీ అవుతుంది. ఈ క్రమంలో మళ్లీ సినిమాలకు రీఎంట్రీ ఆలోచన ఉందా అనే ప్రశ్నకి నమ్రత స్పందించింది. ఛాన్సే లేదని చెప్పింది. మహేష్ తో కలిసి నటిస్తారా అన్న ప్రశ్నకి కూడా నో అని చెప్పింది. అసలు మళ్లీ నటించాలనే ఆలోచన లేదని వెల్లడించింది. తాను బ్యాకెండ్ వర్క్ చేస్తానని, మళ్లీ నటించే ఆసక్తి లేదని స్పష్టం చేసింది నమ్రత.
Mahesh Babu
ఇక ప్రస్తుతం మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో `ఎస్‌ఎస్‌ఎంబీ29` చిత్రంలో నటించబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. దీన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో తెరకెక్కించబోతున్నారు.