వాడిని వదలొద్దు, పోలీసు కేసు నమోదు చేసిన నమ్రత.. సితారపై అప్పుడే మొదలు పెట్టారు, ఏం జరిగిందంటే
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు. మహేష్ బాబు రాజమౌళితో తదుపరి చిత్రం ఉంది కాబట్టి ఆ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఇక వీళ్లిద్దరి ముద్దుల కుమార్తె సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే.
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు. మహేష్ బాబు రాజమౌళితో తదుపరి చిత్రం ఉంది కాబట్టి ఆ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఇక వీళ్లిద్దరి ముద్దుల కుమార్తె సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. చిన్ననాటి నుంచే సితార సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది.
సీతారాలో డ్యాన్సింగ్ స్కిల్స్ అద్భుతం. తరచుగా సితార డ్యాన్స్ వీడియోల్ని పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆమె ఎనెర్జీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇంత పాపులర్ అయితే కొందరు ఆకతాయిలు ఊరుకుంటారా ?సెలెబ్రెటీలకు సోషల్ మీడియా వల్ల ఎంత ఉపయోగం ఉందో అదే స్థాయిలో చిక్కులు కూడా ఎదురవుతుంటాయి.
ఇప్పుడు సితారకి వచ్చిన సమస్య ఏంటంటే.. ఆమె ఇంస్టాగ్రామ్ ఖాతా పేరుతో కొందరు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు. అంతటితో ఆగడం లేదు. సితార పేరుతో కొన్ని తప్పుడు ప్రచారాలు.చేస్తూ మోసాలకు పాల్పడడం నమ్రత గమనించారు. ఫేక్ లింక్స్ పోస్ట్ చేసిన ఈ లింక్ క్లిక్ చేస్తే బెనిఫిట్ పొందుతారు అంటూ సైబర్ మోసాలకు తెరతీశారు.
ఇది సితార అకౌంట్ అని నమ్మే కొందరు అమాయకులు ఆ లింక్స్ క్లిక్ చేసి మోసపోతున్నారు. దీనితో నమ్రత రంగంలోకి దిగింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో తన టీంతో ఫిర్యాదు చేసింది. సితార పేరుతో ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వాడిని ఎలాగైనా పట్టుకోవాలి అంటూ పోలీసులని కోరింది. అంతే కాదు ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది.
ఈ స్టేట్మెంట్ లో సితార అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాని పోస్ట్ చేసి.. ఇదే అసలైనది. బ్లూ టిక్ ఉండడం గమనించండి. మిగిలినవి ఏవీ సితార అకౌంట్స్ కాదు. మిగిలిన ఫేక్ అకౌంట్స్ లోకి వెళ్లి మోసపోవద్దు అని సూచించింది. అయితే పోలీసులు, తన టీం ఇలా సితార పేరుతో చీటింగ్ కి పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
సితార సర్కారు వారి పాట చిత్రంలో ఓ సాంగ్ లో అఫీషియల్ గా మెరిసింది. ఆ మధ్యన జ్యువెలరీ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. చిన్న వయసులో సితార ఇలా సంచలనాలు చేస్తుంటే.. కాస్త వయసొచ్చాక ఇంకెంత హంగామా చేస్తుందో. టాలీవుడ్ లో నటిగా రాణించేందుకు తాను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు సితార ఆల్రెడీ ప్రకటించింది.