MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాగ్‌, సుమంత్‌, సుప్రియ, అఖిల్‌, చైతూ.. అక్కినేని ఫ్యామిలీని వెంటాడుతున్న విడాకులు, బ్రేకప్‌లు..

నాగ్‌, సుమంత్‌, సుప్రియ, అఖిల్‌, చైతూ.. అక్కినేని ఫ్యామిలీని వెంటాడుతున్న విడాకులు, బ్రేకప్‌లు..

అక్కినేని ఫ్యామిలీని(akkineni family) `విడాకులు`, `బ్రేకప్‌`(divorce) వివాదాలు వెంటాడుతున్నాయి. నాగార్జున(nagarjuna) మొదలు, సుమంత్‌(sumanth), సుప్రియ, అఖిల్‌(akhil), ఇప్పుడు నాగచైతన్య(naga chaitanya). వీరింతా లైఫ్‌ పార్టనర్‌ విషయంలో వివాదాలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు సమంతతో చైతూ డైవర్స్ అంటూ వార్తలతో ఇది హాట్‌ టాపిక్‌గా మారింది.  

3 Min read
Author : Aithagoni Raju
| Updated : Sep 23 2021, 09:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

అక్కినేని ఫ్యామిలీకి ఏఎన్నార్‌ పునాది వేశారు. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ చిత్ర పరిశ్రమలో పెద్ద వృక్షంలా అవతరించింది. ఈ ఫ్యామిలీ నుంచి నాగార్జున, సుమంత్‌, సుశాంత్‌, సుప్రియ, నాగచైతన్య, అఖిల్‌ సినిమా రంగంలో ఉన్నారు. ఇప్పుడు కూడా రాణిస్తున్నారు. మరో వైపు అన్నపూర్ణ స్టూడియోల ద్వారా సినిమా షూటింగ్‌లు, టీవీ షోస్‌, ఈవెంట్లు, సినిమా ఓపెనింగ్‌లకు కేరాఫ్‌గా మార్చారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

అయితే అక్కినేని ఫ్యామిలీని `విడాకులు`, `బ్రేకప్‌`లు ఇబ్బంది పెడుతున్నాయి. నాగార్జున మొదలు కొని ఇప్పుడు నాగచైతన్య వరకు విడాకుల అంశాలు అక్కినేని ఫ్యామిలీని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. చర్చనీయాంశంగా మారుస్తున్నాయి. 
 

310

దీనికి ఆరంభం.. నాగార్జునతోనే పడింది. నాగార్జున.. మొదట హీరో వెంకటేష్‌ సిస్టర్‌ లక్ష్మీ దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు. 1984లో వీరి మ్యారేజ్‌ జరిగింది. నాగార్జున సినిమా హీరోగా రాణించడం, లక్ష్మీ డాక్టర్‌గా రాణించడం, ఇద్దరికి మనస్పార్థాలు రావడం, అండరస్టాండింగ్‌ కుదరకపోవడం, ప్రొఫేషనల్‌ డిఫరెన్సెన్స్ తో వీరిద్దరి ఆరేళ్ల తర్వాత విడిపోయారు. వీరికి నాగచైతన్య జన్మించారు. 

410

ఆ తర్వాత నాగార్జున అమలతో ప్రేమలో పడ్డారు. ఆమెతో సినిమాల్లో కలిసి నటించిన క్రమంలో ప్రేమలో పడ్డారు. 1992లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి అఖిల్‌ జన్మించారు. పెళ్లి తర్వాత అమల సినిమాలు తగ్గించింది. అడపాదడపా కీ రోల్స్ లో మెరుస్తుంది. పలు సామాజిక కార్యక్రమాల్లో భాగమవుతుంది అమల. 
 

510

ఆ తర్వాత సుమంత్‌ సైతం విడాకులు తీసుకున్నారు. ఆయన తెలుగు హీరోయిన్‌ కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పవన్‌ కళ్యాణ్‌ `తొలిప్రేమ` చిత్రంతో కీర్తిరెడ్డి పాపులర్‌ అయ్యారు. 2004లో సుమంత్‌, కీర్తిరెడ్డి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లకి వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం సుమంత్‌ సింగిల్‌గానే ఉంటున్నారు.

610

 నటి, ప్రొడ్యూసర్‌ సుప్రియ యార్లగడ్డ(నాగ్‌ కోడలు) సైతం మ్యారేజ్‌ లైఫ్‌ వివాదంగా మారింది. సుప్రియ `అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి' చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆమె `ఇష్టం` సినిమా హీరో చరణ్‌ రెడ్డి ప్రేమలో పడింది. ఆయన్ని పెళ్లి చేసుకుంది. 2012లో ఆయన ఉన్నట్టుండి గుండెపోటుకి గురై చనిపోయారు. అయితే అంతకు ముందే సుప్రియ, చరణ్‌ మధ్య విభేదాలు తలెత్తాయని, డైవర్స్‌ తీసుకునేందుకు సిద్ధమయ్యారని, ఇంట్లో గొడవల వల్లే మెంటల్‌గా డిస్ట్రర్బ్ అయిన చరణ్‌ రెడ్డి హార్ట్ ఎటాక్ కి గురైనట్టు వార్తలొచ్చాయి. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అప్పటి నుంచి సుప్రియ సింగిల్‌గానే ఉంటుంది.

710

అఖిల్‌ విషయంలోనూ పెళ్లి  మ్యాటర్ వివాదంగా మారింది. ఆయన ప్రముఖ డిజైనర్‌, జీవీకే మనవరాలు, షాలిని భూపాల్‌ కూతురు శ్రియా భూపాల్‌తో నాలుగేళ్ల క్రితం ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది. త్వరలోనే పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ ఇంతలోనే వీరిద్దరి మధ్య ఏర్పడ్డ మనస్పర్థాలు.. రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన డిఫరెన్సెస్‌తో పెళ్లికి ముందే విడిపోయారు అఖిల్‌, శ్రియా భూపాల్. ఇలా అఖిల్‌ మ్యారేజ్‌ వివాదంలో ఇరుక్కుంది. 

810

ఇక ఇప్పుడు నాగచైతన్య- సమంతల పెళ్లి వ్యవహారం వార్తల్లో నిలుస్తుంది. వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని, దీంతో విడిపోయేందుకు రెడీ అయ్యారని టాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత నెల రోజులుగా ఈ వార్తలు సోషల్‌ మీడియా, ప్రధాన మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నా దీనిపై నాగార్జున గానీ, చైతూ గానీ, సమంతగానీ స్పందించకపోవడం గమనార్హం. ఇలా మీడియా ముందుకు రాకుండా, స్పందించకుండా ఉండటమే వీరిద్దరి మధ్య విభేదాలను స్పష్టం చేస్తుంది. అదే సమయంలో విడాకుల విషయంపై కూడా క్లారిటీ వస్తుంది. 
 

910

నేడు(గురువారం) నాగచైతన్య మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా ఆయన తన `లవ్‌ స్టోరి` ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో చిట్‌చాట్‌ చేస్తున్నారు. కానీకేవలం సినిమా గురించి మాత్రమే ప్రశ్నలు అడగాలని, వ్యక్తిగత విషయాలు చర్చించవద్దని తన పీఆర్ టీమ్‌తో  ముందుగానే మీడియాకి తెలియజేయడంలోనే వీరి `విడాకుల` విషయాన్ని కన్ఫమ్‌ చేస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అక్టోబర్‌ 6న, నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న డేట్‌నే తమ విడాకులపై చై,సామ్‌ క్లారిటీ ఇవ్వబోతున్నారనే వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. 

1010

అంతేకాదు సమంతకి విడాకులు ఇస్తున్నందుకు భరణంగా ఏకంగా రూ.250కోట్లు ఇస్తున్నట్టు టాలీవుడ్లో ఓ వార్త హల్‌చల్‌ చేస్తుంది. పెళ్లి టైమ్‌లో ఫ్రీగా వచ్చిన సమంత.. ఇప్పుడు నాలుగేళ్లలో ఏకంగా రూ.250కోట్లు తీసుకెళ్తుందా? అనే కామెంట్లు, ట్రోల్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. సమంత, నాగచైతన్య `ఏం మాయ చేసావె` సినిమాతో ప్రేమలో పడ్డారు. దాదాపు ఏడేళ్ల తర్వాత తమ ప్రేమకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చుకున్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించి 2017 అక్టోబర్‌ 6న వివాహం చేసుకున్న విసయం తెలిసిందే. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Klin Kaara Konidela: క్లింకార ఫేస్ రివిల్ చేసిన రామ్ చరణ్, ఉపాసన.. ఎవరిపోలికలు ఎక్కువగా ఉన్నాయంటే?
Recommended image2
Balan Movie review: బాలన్‌ మూవీ రివ్యూ.. తల్లీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్‌ డ్రామా ఎలా ఉందంటే?
Recommended image3
Prabhas: ఆయన చేయేస్తే 100 కోట్లు, ప్రభాస్ పై సమంత సంచలన వాఖ్యలు, ఎందుకలా అన్నదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved