అనుష్క నాగచైతన్య మధ్య రూమర్లపై నాగార్జున అసహనం.. సమాజం ఎక్కడికిపోతుంది
టాలీవుడ్ స్వీటి అనుష్క, నాగచైతన్య మధ్య ఎఫైర్లు, పెళ్లి వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. దీనిపై నాగార్జున స్పందించారు. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు.

టాలీవుడ్ మన్మథుడిగా పేరు తెచ్చుకున్నారు నాగార్జున. ఇప్పటికీ అదే గ్లామర్, బాడీ ఫిట్‌నెస్ మెయింటేన్ చేస్తూ కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు. అంతెందుకు ఇంట్లో నాగ్ కుమారులు నాగచైతన్య, అఖిల్‌లకే పోటీగా మారాడు. గ్లామర్ విషయంలో వాళ్లతో పోటీ పడుతున్నాడు. టాలీవుడ్‌లో ఎవరికీ సాధ్యం కాని విధంగా తన ఫిట్‌నెస్‌ని మెయింటేన్ చేస్తున్నాడు.
అయితే నాగార్జున హీరోగా, నిర్మాతగా ఎంతో మందికి లైఫ్ ఇచ్చాడు. అందులో దర్శకులు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు. కుర్ర హీరోలు కూడా ఉన్నారు. అలా లైఫ్ ఇచ్చిన వారిలో అనుష్క కూడా ఉంది. యోగా టీచర్‌ని పనిచేస్తున్న అనుష్కని గుర్తించి దర్శకుడు పూరీ జగన్నాథ్ కోరిక మేరకు సినిమాల్లోకి తీసుకొచ్చారు. వీరి కాంబోలో `సూపర్` సినిమా వచ్చింది. సినిమా పెద్దగా ఆడలేదు, కానీ అనుష్క లాంటి లేడీ సూపర్ స్టార్ టాలీవుడ్‌కే కాదు, సౌత్ ఇండస్ట్రీకి దొరికింది.
ఇదిలా ఉంటే అనుష్కతో నాగార్జున ఐదు సినిమాలు చేశారు. `సూపర్`తో ఫస్ట్ టైమ్ కలవగా, `డాన్`, `రగడ`, `ఢమరుకం`, `ఓం నమో వెంకటేశాయా` చిత్రాల్లో కలిసి నటించారు. `కింగ్`, `కేడీ`లో స్పెషల్ సాంగ్స్ చేసింది. `ఊపిరి`లో గెస్ట్ గా మెరిసింది. ఇలా ఎనిమిది సినిమాలతో భాగమయ్యారు. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. తనకు సినిమా లైఫ్ ఇచ్చిన హీరో కావడంతో నాగ్‌తో చేసేందుకు అనుష్క ఎప్పుడూ నో చెప్పలేదు.
ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కొన్ని రూమర్లు వచ్చాయి. సహజంగా ఎక్కువ సినిమాలు కలిసి చేస్తే ఇలాంటి రూమర్లు వస్తుంటాయి. నాగార్జున అనుష్క మధ్య ఏదో ఉందనే గాసిప్పులు వచ్చాయి. కొన్నాళ్లకి ఆగిపోయాయి. కానీ ఆ తర్వాత నాగ్ తనయుడు హీరో నాగచైతన్యతోనూ రూమర్లు వచ్చాయి. ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అప్పట్లో ఇవి సంచలనంగా మారాయి. నాగార్జుననే ఈ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరిగింది. దాన్ని నాగ్ వెంటనే ఖండించారు. తప్పుడు వార్తలుగా కొట్టిపారేశారు.
ఈ నేపథ్యంలో దీనిపై నాగార్జున స్పందించారు. ఈ గాసిప్‌లపై ఆయన రియాక్ట్ అవుతూ, ఇలాంటి రూమర్లు రావడం దారుణం అన్నారు. నాతో, ఇప్పుడు చైతూతో ఇలాంటివి అల్లేయడం చాలా విచారకరం అన్నారు. సోసైటీ ఎలా దిగజారిపోతుందో అనడానికి ఇదే నిదర్శనం అని నాగ్ కొట్టిపారేశాడు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో ఈ విషయాన్ని నాగార్జున చెప్పారు. అనుష్కతో పోల్చితే చైతూ ఏజ్‌లోనూ, హైట్ పరంగానూ చిన్నవాడని తెలిపారు. రూమర్స్ పై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ఇక నాగ చైతన్య.. హీరోయిన్ల విషయంలో పోటీగా మారుతున్నారనే వార్తలకు ఆయన రియాక్ట్ అవుతూ, అది నిజమే అని, యంగ్ హీరోయిన్లు చైతూతోనే చేయాలనుకుంటారని, తనతో చేస్తే మళ్లీ ఆఫర్లు రావనే భయంతో ఉంటారని, కొందరు హీరోయిన్లు మొహం మీదే చెబుతారని వెల్లడించారు. అది సహజంగానే జరుగుతుందని వెల్లడించారు నాగ్. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది.
ఈ సంక్రాంతికి `నా సామిరంగ` చిత్రంతో హిట్ అందుకున్నారు నాగ్. ఇప్పుడు ధనుష్‌తో కలిసి `కుబేర` సినిమాలో నటిస్తున్నారు. ఆయన సోలో హీరోగా ఓ మూవీకి ప్లాన్ జరుగుతుంది. ఇదిలా ఉంటే అనుష్క `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` అనంతరం ఓ మలయాళ చిత్రంలో నటిస్తుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. మరోవైపు చైతూ `తండేల్` మూవీలో నటిస్తున్నారు. సాయిపల్లవి హీరోయిన్‌గా చేస్తుంది. చందమూ మొండేటి దర్శకుడు.