4k లో శివ సినిమా రీ రిలీజ్, నాగార్జున-ఆర్జీవీ మూవీకి AI టచ్ , రిలీజ్ ఎప్పుడంటే?
ఈ మధ్య కాలంలో రీరిలీజ్ ల ట్రెండ్ ఎంతలా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోల లాండ్ మార్క్ సినిమాలన్నీ థియేటర్ లో మరోసారి సందడి చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో కింగ్ నాగార్జున శివ సినిమా కూడా రీ రిలీజ్ కు రెడీ అవుతోంది.

శివ సినిమాకు AI టచ్
తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన నాగార్జున – రామ్ గోపాల్ వర్మ కల్ట్ క్లాసిక్ మూవీ ‘శివ’. ఈ మూవీ మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అనపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా AI సొగబులద్దుకుని 4K లో రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం కంప్లీట్ గా సౌండ్,విజువల్స్ ను మార్చేసి, అధునాతన టెక్నాలజీతో రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నారు. ఈ సినిమాకు సబంధించి రీ రిలీజ్ ప్రమోషన్స్ ను కూడా ఘనంగా నిర్వంహించాలని చూస్తున్నారు.
KNOW
కూలీ థియేటర్లలో శివ టీజర్
అంతే కాదు ఆగస్ట్ 14న నాగార్జున విలన్ గా నటించిన కూలీ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా థియేటర్స్ లో శివ రీ-రిలీజ్ టీజర్‌ను ప్లే చేయబోతున్నారు. ఈ టీజర్‌లోని శివ డాల్బీ ఆటమాస్ సౌండ్ అనుభవాన్ని మొదటిసారిగా ప్రేక్షకులు ఎంజాయ్ చేయబోతున్నారు. శివ సినిమా అప్పట్లోనే ఎటువంటి టెక్నాలజీ లేని రోజుల్లోనే ఆడియన్స్ ను ఉర్రూతలూగించింది. మరీ ముఖ్యంగా నాగార్జున చైన్ లాగే సీన్ ఎంత ట్రెండ్ అయ్యిందో అందరికి తెలుసు. అటువంటిది అన్ని హంగులతో ఈసినిమా రిలీజ్ అయితే, థియేటర్లలో బాక్సులు పగిలిపోవాల్సిందే అంటున్నారు అక్కినేని అభిమానులు
50 వసంతాల అన్నపూర్ణ స్టూడియో
త్వరలో అనపూర్ణ స్టూడియోస్ 50 వసంతాల వేడుకలను జరుపుకోబోతోంది. ఈసందర్భంగా నాగార్జున కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచిన శివ సినిమాను రీరిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఇందుకు సబంధించనిఅఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు టీమ్. అందులో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. శివ సినిమా మొదటిసారిగా మోనో మిక్స్ సౌండ్‌తో విడుదల కాగా, ఇప్పుడు అధునాతన AI టెక్నాలజీ సహాయంతో డాల్బీ ఆటమాస్ సౌండ్ ఫార్మాట్‌గా మార్చబడింది. గత మూడున్నర దశాబ్దాలుగా అభిమానులను అలరిస్తున్న ఈ సినిమా, 4k లో ఆడియన్స్ కు కొత్త అనుభూతిని ఇవ్వబోతోంది.
నాగార్జున మాట్లాడుతూ
"శివ సినిమా నా కెరీర్‌లో ఓ మైల్టోన్ మూవీ. ఆ సినిమాతోనే నాకు హీరోగా ఓ ప్రత్యేకమైన ఇమేజ్ వచ్చింది. శివ సినిమా రిలీజ్ అయ్యి 25 ఏళ్లు అవుతున్నా ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈసినిమాను ఆదరిస్తారన్న నమ్మకంతోనే తిరిగి రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాము. నా సోదరుడు వెంకట్ అక్కినేని, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కలిసి, ఆధునిక టెక్నాలజీతో 4K విజువల్స్, డాల్బీ ఆటమాస్ సౌండ్‌తో తిరిగి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంపై ఆనందంగా ఉంది," అని అన్నారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ
"ఈ సినిమాకు నాగార్జున, నిర్మాతలు చూపిన నమ్మకం వలననే ఈ స్థాయికి వచ్చింది. ఇప్పటికీ ప్రతి సీన్, పాత్రను ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవడం అనేది వింతగా ఉంటుంది. అనపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను తిరిగి విడుదల చేయడంపై చాలా ఆనందంగా ఉంది. అసలు సౌండ్‌ను పూర్తిగా పునఃసృష్టించడం వల్ల, ఈ సినిమాను ఇప్పటివరకు చూసినవారూ, కొత్తగా చూస్తున్నవారూ ఒక వినూత్న అనుభూతి పొందతారు," అని ఆర్జీవి అన్నారు.
పాన్ ఇండియా భాషల్లో శివ
‘శివ’ సినిమాను త్వరలో తెలుగు భాషలో మాత్రమే విడుదల చేయబోతున్నారు. తెలుగులో వచ్చే రెస్పాన్స్ ను బట్టి ఆ తరువాత హిందీ, తమిళ భాషల్లో కూడా రీరిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అటునాగార్జున అభిమానులు మాత్రం శివ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్ లో చూడాలా అని ఎదురుచూస్తున్నారు. చేయనున్నారు. ఈసినిమా రీరిలీజ్ కలెక్షన్స్ విషయంలో రికార్డ్ క్రియేట్ చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. అయితే 14న ఈ సినిమా టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయబోతున్నట్టు సమాచారం.