- Home
- Entertainment
- తనూజ కావాలని డీమాన్ పవన్‌ని బ్లేమ్ చేసిందా? వీడియోతో చూపించి ఆమె అసలు రూపం బయటపెట్టిన నాగార్జున
తనూజ కావాలని డీమాన్ పవన్‌ని బ్లేమ్ చేసిందా? వీడియోతో చూపించి ఆమె అసలు రూపం బయటపెట్టిన నాగార్జున
నాగార్జున శనివారం ఎపిసోడ్‌లో తనూజని టార్గెట్ చేశాడు. డీమాన్ పవన్ పై ఆమె చేసిన ఆరోపణలు క్లారిటీ ఇస్తూ, ఆమె నిజ స్వరూపం బయటపెట్టాడు. దీంతో తెల్లమొహం వేసింది తనూజ.

శనివారం ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లని ఆడుకున్న నాగార్జున
బిగ్ బాస్ తెలుగు 9 షోలో శనివారం వచ్చిందంటే హౌజ్‌లో కంటెస్టెంట్లని నాగార్జున ఒక రేంజ్‌లో ఆడుకుంటారు. ఈ వారం రోజులు ఎవరెవరు ఏఏ తప్పులు చేశారో చెబుతుంటారు. అదే సమయంలో బాగా ఆడిన వారిని అభినందిస్తుంటారు. ఈ శనివారం నాగార్జున కంటెస్టెంట్లపై చాలా సీరియస్‌గా ఉన్నారు. రావడం రావడంతోనే ఆయన ఫైరింగ్‌తో వచ్చారు. వారి ఫోటోలతో ఉన్న కత్తులను విరిచేశారు. అందులో సంజనా, తనూజ, కళ్యాణ్, రీతూ చౌదరీ ఆట చాలా దారుణంగా ఉందని, రీతూ సంచాలక్‌గా డిజాస్టర్ అని తేల్చి చెప్పాడు నాగ్.
డీమాన్ పవన్‌ని నిలదీసిన నాగార్జున
అనంతరం తనూజ, డీమాన్ పవన్‌లను నిలదీశాడు నాగార్జున. కామాండర్‌కి సంబంధించిన టాస్క్ సమయంలో తనూజని డీమాన్ పవన్ వెనకాల నుంచి తోశాడు. ఆ సంఘటనని ప్రస్తావిస్తూ, తనూజ నీపై ఎందుకు కంప్లెయింట్ చేయాల్సి వచ్చిందని పవన్‌ని ప్రశ్నించాడు నాగార్జున. కమాండ్‌లనే ఫాలో అయ్యాను, అంతకు మించి ఏం చేయలేదని తెలిపాడు. ఫోర్స్ పెట్టి తోయలేదా? అని అడగ్గా, పదండి అని నార్మల్‌గా ఎలా అయితే అంటామో అలానే అన్నాను అని తెలిపాడు పవన్.
డీమాన్ ఫోర్డ్స్ గా తోయడంపై తనూజ అభ్యంతరం
ఈ విషయంలో తనూజ స్పందిస్తూ, పవన్ హ్యాండ్ ఫోర్స్డ్ గా అనిపించిందని తెలిపింది. కూర్చుంటాను కదా, మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి అని వెంటనే అన్నాను. కానీ తనే దాన్ని పట్టుకొని, నువ్వు అలా అన్నావంటూ కొనసాగించాడు అని తెలిపింది తనూజ. నింద పడింది తనమీద, అలాంటప్పుడు ఆయన సైలెంట్‌గా ఉండలేడు, దాన్ని క్లీయర్ చేసుకోవాలనుకుంటాడు అని నాగార్జున తెలిపారు. అంతేకాదు అసలు ఏం జరిగిందనేది వీడియో క్లిప్ కూడా చూపించి క్లారిటీ ఇచ్చాడు. అందులో డీమాన్ మొదట టచ్ చేశాడు. ఆ తర్వాత కాస్త ఫోర్స్డ్ గా నెట్టే ప్రయత్నం చేశాడు. అప్పుడే తనూజ రియాక్ట్ అవుతూ, నో మ్యాన్ హ్యాండ్లింగ్ అంటూ ఫైర్ అయ్యింది. మరోవైపు నిఖిల్ కూడా వచ్చి రండి అంటూ చేయిపట్టుకున్నాడు. దీంతో తనూజ ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారంటూ హడావుడి చేసింది. రాణి ఆర్డర్ అంటూ చెప్పగా, అబ్బాయిల్లాగా హ్యాండిల్ చేస్తున్నారేంటి? అని ప్రశ్నించింది తనూజ.
మేం జస్ట్ పట్టుకున్నాం, దానికే తనూజ అలా అన్నది
ఈ విషయంపై నిఖిల్ ని నాగార్జున ప్రశ్నించగా, నేను వచ్చి జస్ట్ ఆమె చేయి పట్టుకున్నాను, దానికే మ్యాన్ హ్యాండ్లింగ్ అంటూ మండిపడిందని చెప్పాడు. ఆ సమయంలో హర్ట్ అయ్యాను, కానీ తర్వాత వదిలేశాను. పవన్ కాస్త పర్సనల్‌గా తీసుకున్నాడనిపించిందని నిఖిల్ చెప్పాడు. దీనికి పవన్ చెబుతూ, ఒక్కసారే కదా అని అంటే, ఏమో చేస్తావేమో, ఎత్తుకొని తీసుకెళ్తావేమో అన్నదని తెలిపాడు. ఈ విషయంపై తనూజ రియాక్ట్ అవుతూ, ఆ సమయంలో నేను అలా చెప్పకపోతే నిజంగానే పుష్ చేసినా చేసేవాడేమో అని చెప్పింది.
ఇక్కడ జెండర్ తేడా లేదంటూ నాగ్ క్లారిటీ
దీనికి నాగార్జున రియాక్ట్ అవుతూ ఇక్కడ(బిగ్ బాస్ హౌజ్‌లో) జెండర్ డిఫరెంట్స్ లేదు. మగ పిల్లలు, ఆడపిల్లలు, సుకుమారంగా ఉండేవాళ్లు, లేని వాళ్లు అనేది ఉండదు అని చెప్పాడు. ఈ సందర్భంగా మరో వీడియో చూపించారు. బాల్స్ బాస్కెట్‌లో వేసే టాస్క్ లో తనూజ.. డీమాన్‌ని నెట్టేసింది. దీన్ని నిలదీస్తూ, ఇందులో నువ్వు ఎలాగైతే టచ్ చేశావో, పవన్ కూడా కమాండ్ టైమ్‌లో అలానే టచ్ చేశాడని నాగార్జున తెలిపారు. దీంతో తనూజ మొహం తెల్లబోయింది. ప్రస్తుతం ఈ శనివారం ఎపిసోడ్ ప్రోమో వైరల్‌గా మారింది.