MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గాడ్ ఫాదర్ పై నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఇద్దరి మధ్య పోటీ, నేను హ్యాపీ అంటున్న కింగ్

గాడ్ ఫాదర్ పై నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఇద్దరి మధ్య పోటీ, నేను హ్యాపీ అంటున్న కింగ్

కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం ఘోస్ట్. విజయదశమి కానుకగా నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రతిభగల ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 05 2022, 09:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం ఘోస్ట్. విజయదశమి కానుకగా నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రతిభగల ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్, నాగార్జున ఘోస్ట్ చిత్రాలు ఒకే రోజు విడుదలవుతుండడం ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది. 

 

26

నాగార్జున చాలా రోజుల తర్వాత యాక్షన్ మూవీ చేస్తుండడంతో ఆసక్తిగా మారింది. అక్కినేని ఫ్యాన్స్ లో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఫెస్టివల్ సీజన్ లో ఎన్ని చిత్రాలు విడుదలైనా కంటెంట్ బావుంటే కలెక్షన్స్ వచ్చేస్తాయి అనే కాన్ఫిడెన్స్ తో నాగార్జున గాడ్ ఫాదర్ కి పోటీ గా బరిలో దిగుతున్నారు. 

 

36

గాడ్ ఫాదర్ తో పోటీపై నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పండగ టైంలో రెండు పెద్ద చిత్రాలు విడుదలైనా ప్రేక్షకులు చూస్తారు. చిరంజీవి గారి గాడ్ ఫాదర్, నా ఘోస్ట్ చిత్రాలు ఒకేసారి రిలీజ్ కావడం నాకు సంతోషంగా ఉంది. గతంలో ఎప్పుడూ మా ఇద్దరి చిత్రాలు ఒకే రోజు రిలీజ్ కాలేదు. కానీ రెండు మూడు రోజుల వ్యవధిలో కొన్ని చిత్రాలు రిలీజ్ అయ్యాయి. 

 

46

మా మధ్య ఎలాంటి పోటీ లేదు. రెండు చిత్రాలు బాగా ఆడాలి అని నాగార్జున అన్నారు. సినిమా ప్రత్యేక షో చూసిన వారు చాలా బావుందని, సౌండ్ డిజైనింగ్ అద్భుతం అని ప్రశంసించారు. దీనితో ఘోస్ట్ గ్యారెంటీ హిట్ అని భావిస్తున్నట్లు నాగ్ అన్నారు. 

 

56

ఈ చిత్రంలో సోనాల్ చౌహన్, నాగార్జున ఇంటర్ పోల్ ఏజెంట్స్ గా నటించారు. నాగార్జున చాలా రోజుల తర్వాత భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉన్న సినిమా చేశారు. ఇక సినిమాలో గ్రాఫిక్స్ ఒక భాగం అని అన్నారు. గ్రాఫిక్స్ ఉండాలి కానీ సహజంగా ఉండాలి. ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర, కార్తికేయ చిత్రాల్లో గ్రాఫిక్స్ వర్క్ అద్భుతంగా ఉంది. అందుకే ఆ చిత్రాలు విజయం సాధించినట్లు నాగార్జున పేర్కొన్నారు. 

 

66

ఈ చిత్రంలో నాగ్, సోనాల్ చౌహన్ మధ్య రొమాన్స్ కూడా ఘాటుగానే ఉంది. సోనాల్ చౌహాన్ బికినిలో గ్లామర్ మెరుపులు మెరిపించింది. మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Ustaad bhagat Singh Glimpse: గబ్బర్‌ సింగ్‌ రోజులు గుర్తు చేసిన పవన్‌.. ఊపేస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ట్రైలర్‌ టీజ్‌
Recommended image2
Vijay Sangeetha Case: ఇంట్లోకి రానివ్వట్లేదు, ఆస్తిలో సగం నాదే.. భర్త విజయ్‌పై సంగీత కొత్త పిటిషన్!
Recommended image3
Mad for Each Other: బిగ్‌ బాస్‌ ని దెబ్బకొట్టే రియాలిటీ షో వస్తోంది.. మొత్తం మసాలా.. లవర్స్ కి మాత్రం పండగే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved