సమంతకు నాగ చైతన్య భార్య శోభిత షాక్, స్టార్ లేడీని వెనక్కి నెట్టిన యంగ్ బ్యూటీ!
జాతీయ స్థాయిలో సమంతను తొక్కేసింది నాగ చైతన్య భార్య శోభిత ధూళిపాళ్ల. టాలీవుడ్ లో పెద్దగా ఫేమ్ లేని శోభిత, స్టార్ లేడీ సమంత మీద పై చేయి సాధించడం అనూహ్య పరిణామం.
నాగ చైతన్య-సమంత విడాకులు తీసుకుని మూడేళ్లు అవుతుంది. వీరి మధ్య మానసిక సంఘర్షణ మాత్రం కొనసాగుతోంది. నాగ చైతన్య సోషల్ మీడియాను పెద్దగా వాడడు. కేవలం తన మూవీస్ ప్రమోషనల్ పోస్ట్స్ పెడుతుంటారు. చాలా అరుదుగా వ్యక్తిగత విషయాలు షేర్ చేస్తారు. కాబట్టి సమంతతో విడాకులు నాగ చైతన్యను మానసికంగా ఎంతటి ప్రభావానికి గురి చేశాయో తెలియదు.
అదే సమయంలో సమంత చాలా ఎక్స్ప్రెసివ్. ఆమె సోషల్ మీడియా ఫ్రీక్. ఇక పరోక్షంగా తన మనో వేదన సమంత వెల్లడించేది. అప్పుడప్పుడు నాగ చైతన్య మీదున్న కోపాన్ని ఇండైరెక్ట్ గా కోట్స్, కామెంట్స్ తో వెళ్లగక్కేది. కొన్ని ఇంటర్వ్యూలలో అయితే నేరుగానే నాగ చైతన్యను సమంత టార్గెట్ చేసింది
కాగా డిసెంబర్ 4న హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను నాగ చైతన్య వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోలో నిరాడంబరంగా జరిగింది. కేవలం 300 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించామని నాగార్జున చెప్పడం విశేషం. ఈ పెళ్ళికి ముందు నాగ చైతన్య ఓ టాక్ షోలో పాల్గొన్నారు. రానా హోస్ట్ గా ఉన్న ఈ షోలో నాగ చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
లైఫ్ ఎలా ఉందని రానా అడగ్గా.. చాలా హ్యాపీగా ఉందని అన్నారు. సమంత దూరమయ్యాక ప్రశాంతంగా ఉన్నాను అన్నట్లు నాగ చైతన్య స్పందన ఉంది. అలాగే ఈ షోలో శోభితతో డేటింగ్ చేస్తున్నప్పటి ప్రైవేట్ ఫోటోలు షేర్ చేశారు. ఈ ఫోటోలను నాగ చైతన్య పెళ్లి ప్రకటన వరకు రహస్యంగా ఉంచారు. కాగా కొన్ని ఫోటోలు మాత్రం నాగ చైతన్య, శోభితల ప్రమేయం లేకుండా బయటకు వచ్చాయి.
కాగా నాగ చైతన్య మాజీ భార్య సమంతను శోభిత డామినేట్ చేయడం ఆసక్తికర పరిణామం. చెప్పాలంటే ఫేమ్, నేమ్ లో శోభిత కంటే సమంత ఎక్కడో ఉంది. సౌత్ టు నార్త్ ఆమెకు పాపులారిటీ ఉంది. అయితే ఇటీవల ప్రముఖ రేటింగ్ సంస్థ.. ఐఎండీబీ 2024కి గాను టాప్-10 మోస్ట్ పాప్యులర్ ఇండియన్ స్టార్స్ జాబితా ప్రకటించింది. ఈ లిస్ట్ లో సమంత కంటే మెరుగైన ర్యాంక్ శోభిత సాధించింది.
శోభిత ఏకంగా టాప్-5లో ఉంది. ఆమెకు ఐదవ ర్యాంక్ దక్కింది. ఇక సమంత 8వ ర్యాంక్ కి పరిమితం అయ్యింది. జాతీయ స్థాయిలో సమంతను శోభిత వెనక్కి నెట్టింది. ఈ లిస్ట్ పరిశీలిస్తే.. ప్రభాస్ కి మాత్రమే హీరోల్లో టాలీవుడ్ నుండి చోటు దక్కింది. ఆయన 10వ ర్యాంక్ పొందారు. ఇక ర్యాంక్ 1 యానిమల్ ఫేమ్ త్రిప్తి దిమ్రి కి దక్కడం కొసమెరుపు. దీపిక పదుకొనె, షారుఖ్ ఖాన్, ఇషాన్ కట్టర్, శార్వరి, ఐశ్వర్య రాయ్, అలియా భట్ టాప్ టెన్ లో ఉన్నారు.