- Home
- Entertainment
- Thank You Review: 'థాంక్యూ' మూవీ ప్రీమియర్ షో టాక్.. నాగ చైతన్య బాగా ట్రై చేశాడు, కానీ
Thank You Review: 'థాంక్యూ' మూవీ ప్రీమియర్ షో టాక్.. నాగ చైతన్య బాగా ట్రై చేశాడు, కానీ
అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం 'థాంక్యూ'. 'మనం' ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి బివిఎస్ రవి కథ అందించారు.

అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం 'థాంక్యూ'. 'మనం' ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి బివిఎస్ రవి కథ అందించారు. దర్శకుడు విక్రమ్ కుమార్ ట్రీట్మెంట్ విభిన్నంగా, ఆకట్టుకునే విధంగా ఉంటుంది. మనం రూపంలో ఆల్రెడీ నాగ చైతన్య, నాగార్జునకి విక్రమ్ కుమార్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. దీనితో థాంక్యూ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేడు శుక్రవారం ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది, సినిమాలో హైలైట్స్ ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అభిరామ్ పాత్రలో నాగ చైతన్య, ప్రియా పాత్రలో రాశి ఖన్నా బ్యూటిఫుల్ ఎంట్రీ ఇవ్వడంతో కథ మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ ని అందమైన ఎమోషన్స్, రొమాంటిక్ సీన్స్ తో నడిపించే ప్రయత్నం చేశారు. అక్కడక్కడా చిన్న ట్విస్ట్ ల రూపంలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు వస్తాయి. పీసీ శ్రీరామ్ కెమెరా వర్క్, తమన్ బిజియం ఎంతో అద్భుతంగా ఉన్నాయి.
ఫస్ట్ హాఫ్ లో మాళవిక నైర్ తో వచ్చే సన్నివేశాలు కట్టుకుంటాయి. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ లో కథ అంతగా ఏమీ ఉండదు కానీ.. మంచి ఎమోషన్స్, లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీతో నడిపించారు. ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించే విధంగా సాగుతుంది.
ఇంటర్వెల్ సన్నివేశం కూడా సింపుల్ గా అనిపిస్తుంది. అభి తన జర్నీకి సహకరించిన వారికీ థాంక్యూ చెప్పాలని ఎలా రియలైజ్ అయ్యాడు.. వారికీ థాంక్యూ ఎలా చెప్పాడు అనే అంశం చుట్టూనే కథ ఉంటుంది.
ఇక సెకండ్ హాఫ్ కూడా అంత కథ ఆశించిన స్థాయిలో పుంజుకోలేదు. అభి కాలేజ్ సన్నివేశాలు, హాకీ ఆడడం లాంటి సన్నివేశాలతో నడిపించారు. అవికా గోర్ సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇస్తుంది. అవికా, చైతు మధ్య వచ్చే సీన్స్ సెకండ్ హాఫ్ లో కాస్త రిఫ్రెషింగ్ గా అనిపిస్తాయి. అంతకి మించి సెకండ్ హాఫ్ లో కూడా బలమైన కథ అంటూ కనిపించదు. సినిమాలో మహేష్ బాబు రిఫరెన్స్ ఎక్కువగానే ఉంది.
దర్శకుడు విక్రమ్ కుమార్ ఉన్న కథ మేరకు సింపుల్ ఎమోషన్స్ తో చిత్రాన్ని నడిపించారు. నాగ చైతన్య వివిధ షేడ్స్ లో నటించడం బావుంటుంది. కానీ నాగ చైతన్య ఫ్యాన్స్ ఆశించే అంశాలు ఈ చిత్రం చాలా తక్కువ అనే చెప్పాలి. తన లైఫ్ జర్నీలో ఎదుగుదలకి సహకరించిన వారికి ఎమోషనల్ గా హీరో ఎలా థ్యాంక్యూ చెప్పాడు అనేదే సినిమా మొత్తం ఉండడంతో ప్రేక్షకులు కాస్త బోర్ ఫీల్ అయ్యారు. ఓవరాల్ గా 'థాంక్యూ' మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ చిత్రంగా నిలిచే అవకాశాలే ఎక్కువున్నాయి.