- Home
- Entertainment
- సొంత తల్లితో నాగచైతన్య రేర్ మూమెంట్.. అక్కినేని హీరో ఒరిజినల్ మదర్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
సొంత తల్లితో నాగచైతన్య రేర్ మూమెంట్.. అక్కినేని హీరో ఒరిజినల్ మదర్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
అక్కినేని నాగచైతన్య మదర్స్ డే సందర్భంగా తన అమ్మ లక్ష్మి దగ్గుబాటికి విషెస్ తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన పంచుకున్న ఫోటో వైరల్‌గా మారింది.

నాగచైతన్య ప్రస్తుతం నాన్న నాగార్జునతోనే ఉంటున్న విషయం తెలిసిందే. నాగచైతన్య, నాగచైతన్య అమ్మ విడాకులు తీసుకున్నాక నాన్న వద్దే ఉండిపోయాడు చైతూ. దీంతో అమ్మ లక్ష్మి వేరే వివాహం చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యింది. అక్కడే ఉంటున్నారు. ఏదైనా అకేషనల్‌గానే వీరు కలుస్తుంటారు. అది కూడా చాలా తక్కువగా. ఈ క్రమంలో చైతూ కూడా అలాంటి సందర్భాల్లో అమ్మని కలుస్తుంటాడు.
నాగచైతన్య తన అమ్మతో దిగిన ఫోటోలు పంచుకోవడం చాలా అరుదు. అమ్మతో ఫోటోలు చాలా అరుదుగానే ఉన్నాయి. మ్యారేజ్ సమయంలో ఒకసారి, అంతకు ముందు రెండు మూడు సందర్భాల్లో మాత్రమే వీరిద్దరు కలిసి దిగినట్టు ఇంటర్నెట్‌లో పిక్స్ కనిపిస్తున్నాయి. అయితే చాలా రోజుల తర్వాత తన సొంత తల్లి లక్ష్మి దగ్గుబాటిని కలుసుకున్నాడు నాగచైతన్య.
నేడు మదర్స్ డే అనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అమ్మని కలిశాడు నాగచైతన్య. సొంత అమ్మ లక్ష్మితో దిగిన పిక్‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఏదో హోటల్‌లో డిన్నర్ సమయంలో దిగిన పిక్‌ని అభిమానులతో షేర్ చేశారు నాగచైతన్య. ఎలాంటి క్యాప్షన్ లేకుండా జస్ట్ ఫోటో పెట్టి వదిలేశాడు. లవ్ సింబల్ మాత్రమే ఉంది. అమ్మ ప్రేమ కిది నిదర్శనంగా నిలుస్తుంది.
నాగచైతన్య ఇలా అమ్మ ఫోటోని పంచుకోవడమనేది చాలా అరుదు. ఇప్పుడు షేర్ చేయడంతో అది అభిమానులను ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. అమ్మపై ఉన్న ప్రేమని తెలియజేస్తుంది. ఇన్ని రోజులు ఎంత మిస్ అయ్యాడనే విషయాన్ని తెలియజేస్తుంది. అభిమానులను ఆకట్టుకోవడంతోపాటు వైరల్ అవుతుంది. దీనిపై ఫ్యాన్స్ స్పందిస్తూ, అభినందనలు తెలియజేస్తున్నారు. దేనితోనూ కొలవలేని ఫోటో అని, అమ్మతో అరుదైన ఫోటో అద్భుతంగా ఉందని అంటున్నారు.
ఇక నిర్మాత రామానాయుడు కూతురు, వెంకటేష్ సోదరి లక్ష్మి దగ్గుబాటి మొదట నాగార్జునతో వివాహం జరిగింది. 1984లో వీరి వివాహం జరిగింది. ఆమె డాక్టర్ వృత్తి, నాగ్ సినిమా రంగంలో ఉన్నారు. ఇద్దరికి సెట్ కాలేదు. ఆరేళ్లకి విడిపోయారు. అప్పటికే వీరికి కుమారుడు నాగచైతన్య జన్మించారు. చైతూ పుట్టిన నాలుగేళ్లకి ఇద్దరు విడాకులు తీసుకున్నారు. కానీ చైతూ మాత్రం తండ్రి నాగార్జున వద్దే ఉండిపోయాడు.
లక్ష్మి మాత్రం వేరే పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యింది. ఆమె సుందరం మోటార్స్ లో ఎగ్జిక్యూటీవ్‌గా పనిచేసే శరత్ విజయరాఘవన్‌ని పెళ్లి చేసుకుంది. కేవలం ఫంక్షన్లు, ఏదైనా అకేషనల్‌గా మాత్రమే వీరు కలుసుకుంటారు. అది కూడా దగ్గుబాటి రిలేటెడ్ ఫంక్షన్లలో మాత్రం. అయితే నాగచైతన్య, సమంతల పెళ్లి సమయంలోనూ లక్ష్మి వచ్చింది. దగ్గరుండి పెళ్లిచేసింది.
Thandel
ప్రస్తుతం నాగచైతన్య.. `తండేల్` చిత్రంలో నటిస్తున్నారు. చందుమొండేటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. గీతా ఆర్ట్స్ లో తెరకెక్కుతున్న చిత్రమిది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్కేల్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇది దసరాకి విడుదల కాబోతుంది.