- Home
- Entertainment
- ఏజెంట్ ఫ్లాప్ పై స్పందించిన నాగ చైతన్య.. కస్టడీతో బౌన్స్ బ్యాక్ పక్కా, ఎవరికైనా అది తప్పదు
ఏజెంట్ ఫ్లాప్ పై స్పందించిన నాగ చైతన్య.. కస్టడీతో బౌన్స్ బ్యాక్ పక్కా, ఎవరికైనా అది తప్పదు
నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ కస్టడీ. తమిళ ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 12న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి మరోసారి జతకట్టింది.

నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ కస్టడీ. తమిళ ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 12న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి మరోసారి జతకట్టింది. బంగార్రాజు చిత్రంలో వీరిద్దరూ జంటగా నటించిన సంగతి తెలిసిందే.
దీనితో ఇప్పుడు అక్కినేని అభిమానుల ఆశలన్నీ కస్టడీపైనే ఉన్నాయి. కొంతకాలంగా అక్కినేని ఫ్యామిలీకి అంతగా కలసి రావడం లేదు. నాగార్జున చివరగా నటించిన ఘోస్ట్.. నాగ చైతన్య లాస్ట్ మూవీ థాంక్యూ.. ఇక అఖిల్ రీసెంట్ మూవీ ఏజెంట్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి.
దీనితో కస్టడీ అయినా మంచి హిట్ కొట్టాలని చైతు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కస్టడీ ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య, కృతి శెట్టి, దర్శకుడు వెంకట్ ప్రభు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో నాగ చైతన్యకి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.
అక్కినేని ఫ్యామిలీకి గత కొంతకాలంగా కలసి రావడం లేదు.. రీసెంట్ గా విడుదలైన ఏజెంట్ కూడా నిరాశపరిచింది అని మీడియా ప్రతినిధి పరోక్షంగా ప్రశ్నించారు. దీనికి నాగ చైతన్య స్పందిస్తూ.. కొంతకాలంగా మా ఫ్యామిలీ నుంచి వస్తున్న చిత్రాలు వర్కౌట్ కావడం లేదు. ఈ పరిస్థితి ఏ నటుడికైనా సహజమే. కెరీర్ లో ఏదో ఒక సందర్భంలో ఎత్తుపల్లాలు చూడాల్సిందే. దానిని యాక్సప్ట్ చేయాలి అని నాగ చైతన్య అన్నారు.
మాపై ప్రేమ చూపించే అభిమానులకు మేము తిరిగి ఇచ్చేది మంచి సినిమా మాత్రమే. ప్రతిసారి ఫ్యాన్స్ కి ఒక మంచి సినిమా ఇవ్వాలనే అనుకుంటాం. కానీ కొన్నిసార్లు వర్కౌట్ కాదు. తప్పకుండా కస్టడీతో బౌన్స్ బ్యాక్ అవుతాం అని నాగ చైతన్య ఫ్యాన్స్ కి భరోసా ఇచ్చారు.
Naga Chaitanya
కస్టడీ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఇక అఖిల్ ఏజెంట్ చిత్రం ఫ్యాన్స్ ని ఏ స్థాయిలో నిరాశ పరిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా దెబ్బ కొట్టింది.