- Home
- Entertainment
- రామ్‌చరణ్ వదిలేసిన స్క్రిప్ట్ తో ఫ్లాప్ అందుకున్న నాగచైతన్య.. పాపం నాగ్ జడ్జ్ మెంట్ తేడా కొట్టిందే?
రామ్‌చరణ్ వదిలేసిన స్క్రిప్ట్ తో ఫ్లాప్ అందుకున్న నాగచైతన్య.. పాపం నాగ్ జడ్జ్ మెంట్ తేడా కొట్టిందే?
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ కెరీర్‌లో హిట్లు పరాజయాలున్నాయి. కానీ ఓ డిజాస్టర్ ని ఆయన తెలివిగా వదిలేశాడు. దీంతో నాగచైతన్య బలయ్యాడు. ఫస్ట్ లోనే దెబ్బేసింది.

అక్కినేని ఫ్యామిలీ నుంచి ఏఎన్నార్, నాగార్జునల తర్వాత మూడో తరం నట వారసుడిగా నాగచైతన్య టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆయన `జోష్` సినిమాతో హీరోగా ఎంటర్ అయ్యాడు. కాస్త లవ్, ఇంకాస్త మాస్ యాక్షన్ మేళవింపుగా ఈ మూవీ రూపొందింది. ఇందులో సీనియర్ నటి రాధిక కూతురు కార్తిక హీరోయిన్‌గా నటించింది. ఇందులో అటు నాగచైతన్య, ఇటు కార్తిక వెండితెరకి పరిచయం అయ్యారు. కానీ ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.
వాసు వర్మ రూపొందించన ఈ మూవీ కాలేజ్ గొడవల నేపథ్యంలో సాగుతుంది. కాలేజ్ గొడవలకు, రాజకీయ గొడవలకు ముడిపెడుతూ రూపొందించారు. రాజకీయ నాయకులు స్టూడెంట్స్ ని తమ అవసరాలకు ఎలా వాడుకుంటున్నారనేది చూపించారు. ఈ గొడవల్లో ఇరుక్కున్న నాగచైతన్య.. దాని వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, దాన్నుంచి ఎలా బయటపడ్డాడు అనేది కథ. కథ పరంగా బాగానే ఉంది. కానీ నాగచైతన్యకి సెట్ కాలేదు. ఎగ్జిక్యూషన్‌లో మిస్ ఫైర్ అయ్యింది. దీంతో సినిమా ఫ్లాప్ అయ్యింది.
అయితే ఈ మూవీని మొదట చేయాల్సింది రామ్‌చరణ్. వాసు వర్మ ఈ కథతో రామ్ చరణ్ వద్దకు వెళ్లాడట. ఆయనకు, చిరంజీవికి కథని నెరేట్ చేశాడట. కొన్నాళ్లపాటు దీనిపై చర్చలు జరిగాయి. కానీ చివరికి పక్కన పెట్టారు. చిరంజీవినే ఈ మూవీని రిజెక్ట్ చేసినట్టు సమాచారం. దీంతో ఆ తర్వాత నాగచైతన్యకి వెళ్లగా, ఆయన ఓకే చేశాడు.
నాగార్జున నటించిన `శివ` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. నాగ్ కెరీర్‌కి పెద్ద బ్రేక్ ఇచ్చింది. ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అది కూడా కాలేజ్ గొడవల నేపథ్యంలోనే సాగుతుంది. దానికి రాజకీయాలను ముడిపెడుతూ వర్మ రూపొందించారు. ఆ సినిమా సంచలనం సృష్టించింది. దీంతో `జోష్`లో కూడా అలాంటి కంటెంటే ఉండటంతో నాగార్జున ఓకే చేశాడు. తనకు `శివ` లాంటి చిత్రం చైతూకి అవుతుందని భావించారు. కానీ బాక్సాఫీసు వద్ద బెడిసి కొట్టింది.
అక్కినేన నట వారసుడు కావడం, చైతూ తొలి మూవీ కావడంతో భారీ బడ్జెట్‌తో నిర్మించారు. బడ్జెట్ పరంగా రాజీపడలేదు. గ్రాండ్ లాంఛింగ్ ప్లాన్ చేశారు. ఈ మూవీకి చైతూకి ఏకంగా 4కోట్ల పారితోషికం ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. భారీగానే ప్లాన్ చేశారు, కానీ సినిమా బాక్సాఫీసు వద్ద సత్తా చాటలేకపోయింది. నిరాశ పరిచింది. ఇలా తెలివిగా రామ్‌చరణ్ ఈ మూవీని వదులుకోగా, చైతూ మాత్రం పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ మూవీ 19.5కోట్ల బిజినెస్ అయితే, 17కోట్ల కలెక్షన్లు వచ్చాయట.
ఇక నాగచైతన్య `ఏం మాయ చేసావె` చిత్రంతో తొలి బ్రేక్ అందుకున్నారు. `100% లవ్`, `మనం`, `ప్రేమమ్`, `మజిలి`, `లవ్ స్టోరీ` చిత్రాలతో విజయాలను అందుకున్నారు. చివరగా ఆయన `కస్టడీ`తో డిజాస్టర్ అయ్యింది.ఇప్పుడు `తండేల్` మూవీ చేస్తున్నాడు. చందూ మొండేటి దర్శకుడు. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. దసరాకి ఈ మూవీ రాబోతుంది.