- Home
- Entertainment
- నాగ చైతన్య 'కస్టడీ' ఫస్ట్ డే కలెక్షన్స్, ఊహించని షాక్.. కొన్ని ఏరియాల్లో 'శాకుంతలం' కంటే ఘోరంగా..
నాగ చైతన్య 'కస్టడీ' ఫస్ట్ డే కలెక్షన్స్, ఊహించని షాక్.. కొన్ని ఏరియాల్లో 'శాకుంతలం' కంటే ఘోరంగా..
శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కస్టడీ చిత్రం తొలి షో నుంచి మిక్స్డ్ టాక్ మూటగట్టుకుంది. ఏదో చేస్తాడనుకున్న డైరెక్టర్ వెంకట్ ప్రభు నీరుగార్చారు.

Custody Movie Review
చూస్తుంటే అక్కినేని హీరోల పరిస్థితి ఏమాత్రం మారలేదు అనిపిస్తోంది. ఆ మధ్యన విడుదలైన అఖిల్ ఏజెంట్ చిత్రం దారుణంగా నిరాశపరిచింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కుప్పకూలింది. కారణాలు ఏవైనా అక్కినేని ఫ్యామిలీ ఖాతాలో పరాజయం పడింది.
నాగ చైతన్య అయినా పరిస్థితి మారుస్తాడు.. కస్టడీ చిత్రంతో థ్రిల్లర్ హిట్ అందుకుంటాడు అని అంతా భావించారు. కస్టడీ ఆమేరకు ఆశలు కూడా రేపింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కస్టడీ చిత్రం తొలి షో నుంచి మిక్స్డ్ టాక్ మూటగట్టుకుంది. ఏదో చేస్తాడనుకున్న డైరెక్టర్ వెంకట్ ప్రభు నీరుగార్చారు. వరుస ఛేజింగ్ సన్నివేశాలతో బోర్ కొట్టించారు.
ఫలితంగా తొలిరోజు కస్టడీ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద దారుణమైన నంబర్స్ నమోదయ్యాయి. నెగిటివ్ టాక్ ఉన్నప్పటికీ కనీసం తొలిరోజు వరల్డ్ వైడ్ గా 3 కోట్ల షేర్ అయినా వస్తుంది అని అనుకున్నారు. అది జరగలేదు. నిర్మాతలకి ఇది ఊహించని షాక్ అనే చెప్పాలి. కొన్ని ఏరియాల్లో కస్టడీ చిత్రం సమంత శాకుంతలం కంటే తక్కువ షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది.
కస్టడీ చిత్రం తొలిరోజు వరల్డ్ వైడ్ గా 2.62 కోట్ల షేర్ వసూలు చేసింది. నైజాం లో 76 లక్షలు, సీడెడ్ లో 23 లక్షలు, ఉత్తరాంధ్రలో 22 లక్షలు నమోదయ్యాయి. ఈస్ట్ వెస్ట్ లో కలిపి 19 లక్షలు రాబట్టింది. గుంటూరులో 20, కృష్ణలో 12, నెల్లూరులో 10 లక్షలు రాబట్టింది.
వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 25 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పుడు టాక్, తొలిరోజు కలెక్షన్స్ ట్రెండ్ బట్టి కస్టడీ చిత్రం నష్టాలు ఎంత భారీగా ఉంటాయో ఊహించలేని పరిస్థితి. మొత్తంగా అక్కినేని ఫ్యామిలీకి బ్యాడ్ ఫేజ్ కొనసాగుతోంది అని నెటిజన్లు అంటున్నారు.
సమంత శాకుంతలం తొలిరోజు వసూళ్లు కస్టడీ తరహాలోనే నమోదయ్యాయి. కాకపోతే కస్టడీ కంటే కాస్త తక్కువే. కానీ కొన్ని ఏరియాల్లో కస్టడీ చిత్రం శాకుంతలం కంటే తక్కువ నంబర్స్ నమోదు చేసింది.