MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాగ చైతన్య-శోభితా పెళ్లి డేట్ వచ్చేసింది, వివాహ వేడుకలు ఎప్పుడు..? ఎక్కడ..?

నాగ చైతన్య-శోభితా పెళ్లి డేట్ వచ్చేసింది, వివాహ వేడుకలు ఎప్పుడు..? ఎక్కడ..?

నాగ చైతన్య, శోభితా దులిపాల పెళ్లి వేడుక అతికొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్యనే జరగనుంది. మరి ఈ పెళ్లి ఎక్కడ జరగబోతోంది. ఎప్పుడు జరగబోతోందంటే..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 30 2024, 06:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నాగ చైతన్య, శోభితా  ధుళిపాళ చాలా కాలంగా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. కొన్ని నెలల క్రితం ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నప్పటి నుంచి, వారి పెళ్లి గురించి అభిమానులు ఎదురు చూస్తున్నారు. పెళ్ళి ఎప్పుడు చేయబోతున్నారు.. ఎక్కడ చేయబోతున్నారు అనేవివరాలకోసం వెయిట్ చేస్తున్నారు. 

Also Read: సీనియర్ ఎన్టీఆర్ ఒంటిపై ఉండే ఏకైక పచ్చబొట్టు రహస్యం

26
చైతూ-శోభితా పెళ్లి

చైతూ-శోభితా పెళ్లి

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ జంట ఈ ఏడాది చివర్లో పెళ్ళి చేసుకోబోతున్నారు. అది కూడా పెద్దగా హంగు ఆర్బాటాలు లేకుండా.. చాలా దగ్గర సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే  శోభిత మెడలో తాళి కట్టబోతున్నాడు నాగచైతన్య.  తమ జీవితంలోని కొత్త అధ్యాయం గురించి ఈ జంట ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

Also Read:  300 కోట్ల రెమ్యునరేషన్ తో దళపతి విజయ్‌ను అధిగమించిన తెలుగు స్టార్ హీరో

36

ఈ ఏడాది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వైరల్ అయ్యి.. వార్తల్లో నిలిచిన  పెళ్లిళ్లలో  వీరి పెళ్ళి కూడా ఒకటి కాబోతోంది. ఇక నాగచైతన్య , శోభితల పెల్లి  డిసెంబర్ 4న  జరగనుందని డెక్కన్ క్రానికల్ ఒక కథనాన్ని ప్రచురించింది. అక్కినేని నాగేశ్వరరావు (ANR) జాతీయ అవార్డు ప్రదానోత్సవంలో నాగ చైతన్య, శోభితా జంటగా తొలిసారి కనిపించారు. కెమెరాలకు పోజులిస్తూ, చిరునవ్వులు చిందిస్తూ ఈ జంట వేడుకల్లో ప్రత్యేకంగా కనిపించారు. 

46

అవార్డు ప్రధానోత్సవంలో  అక్కినేని కుటుంబానికి కాబోయే కోడలు అందరితో కలిసి  ఫోటోలకు పోజులిచ్చింది. చిరంజీవి, అమితాబ్ బచ్చన్ అక్కినేని వారితో కలిసి ఫోటోలుదిగారు. “ANR జాతీయ అవార్డు 2024 వేడుకలో అక్కినేని కుటుంబం లెజెండ్స్ అమితాబ్ బచ్చన్ జి & చిరంజీవి కొణిదెల గారుతో” అనే క్యాప్షన్‌తో అన్నపూర్ణ స్టూడియోస్ ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసింది.

56
నాగ చైతన్య-శోభితా

నాగ చైతన్య-శోభితా

ఇక అప్పుడే పెళ్ళి కూతురు శోభిత ఇంట సందడి స్టార్ట్ అయ్యింది.  విశాఖపట్నంలో తన పెళ్లి వేడుకలను శోభిత  ప్రారంభించింది,  పసుపు దంచటం వేడుకకు సంబంధించిన ఫోటోలను  కూడా విడుదల చేసింది. ఈ పవిత్ర సందర్భంగా నటి సాంప్రదాయ పట్టు చీర, బంగారు నగలు, తక్కువ మేకప్‌తో కనిపించింది. ఈ వేడుకకు సబంధించిన ఫోటోలు సోసల్ మీడియాలో పంచుకుంది శోభిత. 

66

ఈ ఏడాది ఆగస్టు 8న నాగ చైతన్య, శోభితా దులిపాల నిశ్చితార్థం వేడుక జరిగింది.  తన కుమారుడు, కాబోయే వధువుతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను Xలో పోస్ట్ చేస్తూ నాగార్జున ఈ శుభవార్తను ప్రకటించారు.  “మా కుమారుడు నాగ చైతన్య, శోభితా దులిపాలల నిశ్చితార్థం ఈ ఉదయం 9:42 గంటలకు జరిగింది అని చెప్పడానికి సంతోషిస్తున్నాము అని వారు ప్రకటించారు. 

ఆమెను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. నూతన జంటకు అభినందనలు! వారికి జీవితాంతం ప్రేమ, ఆనందం కలగాలని కోరుకుంటున్నాము. దేవుడు దీవించుగాక! 8.8.8. అనంతమైన ప్రేమ ప్రారంభం.” అనే అందమైన సందేశం ట్విట్టర్ లో పెట్టారు నాగార్జున. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Folk Song: పెళ్లి ఏదైనా ఈ పాట ఉండాల్సిందే.. నెల రోజుల్లో 3 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్‌
Recommended image2
55 ఏళ్ల వయసులో ఒంటరి జీవితం, 12 మందితో ఎఫైర్ రూమర్స్, క్యాన్సర్ జయించిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image3
RB Choudary: దళపతి విజయ్‌ తో భారీ ప్లాన్, కోరిక తీరకుండానే ఆర్.బి.చౌదరి కన్నుమూత..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved