చైతూ, శోభిత తొలి సంక్రాంతి ఎక్కడ జరుపుకున్నారో తెలుసా..? స్పెషల్ ఏంటంటే..?
టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్ళి తరువాత వచ్చిన మొదటి పండగ కావడంతో.. తొలి సంక్రాంతి వేడుకలను వారు చాలా ఘనంగా జరుపుకున్నారు. శోభిత ఈ వేడుకలకు సబంధించిన ఫోటోస్ ను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్ తో పంచుకున్నారు.
2024 డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు టాలీవుడ్ కపుల్ శోభిత ధూళిపాళ్ల, నాగ చైతన్య. పెళ్లి తరువాత కొత్త దంపతుల తొలి మకర సంక్రాంతి, పొంగల్ వేడుకలను వారు చాలా ఘనంగా జరుపుకున్నారు. తమ వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా ఉంచుకుంటారు వీరు. కాని ఈసారి మాత్రం పొంగల్ వేడుకలకు సబంధించిన ఫోటోస్ ను శోభిత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా పంచుకున్నారు.
జనవరి 14న, శోభిత ఈ పండగకు సబంధించిన ప్రత్యేకత తెలిసేలా ఫోటోలను పోస్ట్ చేశారు. "భోగి, పునరుద్ధరణ, పరివర్తన" అనే కాప్షన్ తో ఒక సాంప్రదాయ పండగ చిత్రంతో మేడ్ ఇన్ హెవెన్ ను నటి ప్రారంభించారు. అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ అందంగా అలంకరించిన రంగోలిని కూడా ఆమె పోస్ట్ చేాశారు.
ఒక ఫోటోలో, శోభిత ఎర్రటి చీరలో, జుట్టును చక్కగా జడ వేసుకుని పండుగ వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. మరో ఫోటోలో ఆమె, నాగ చైతన్య పాదాలను హార్ట్ ఎమోజితో అలంకరించారు. చివరి స్లైడ్‌లో ప్రసాదం ఉంది. ఇలా వారిద్దరు తమ మొదటి పండుగను అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నారు.
శోభిత, నాగ చైతన్య మొదటిగా తమ ఇంట్లో కలుసుకున్నారు, చైతన్య తండ్రి నాగార్జున 2018 తెలుగు సినిమా గూఢచారిలో ఆమె నటన నచ్చడంతో ఇంటికి ఆహ్వానించారట. అయితే, వారి మొదటి నిజమైన కనెక్షన్ 2022 ఏప్రిల్ వరకు జరగలేదు. సమంతతో విడాకులు తరువాత వీరి బంధం బలపడుతూ వచ్చింది.
తమ ప్రేమాయణం.. బిగినిండ్ డేస్ ను గుర్తుచేసుకుంటూ, శోభిత ది న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడారు. నాగ చైతన్య తాము కలుసుకున్న రెండు వారాల తర్వాత తనతో డిన్నర్ డేటింగ్ కోసం ముంబై వచ్చాడని చెప్పారు. "అది ఎన్నటికి మర్చిపోలేను అన్నారు.
వీరి కలయిక సహజంగానే జరిగింది. ఏదో ప్లాన్ చేసుకుని ఎప్పుడు చెయలేదట.ఇక రెండో సారి మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఈవెంట్‌లో వీరు కలుసుకున్నారు. శోభిత ఇలా గుర్తుచేసుకుంది, "నేను ఎర్రటి దుస్తుల్లో ఉన్నాను, అతను నీలిరంగు సూట్‌లో ఉన్నాడు. ఇక తరువాత కథ మీరే ఊహించుకోండి అని అన్నారామె.
ఇది నాగ చైతన్య రెండో వివాహం. అతను గతంలో నటి సమంత రూత్ ప్రభును వివాహం చేసుకున్నాడు. ఈ జంట 2021 అక్టోబర్‌లో విడిపోతున్నట్లు ప్రకటించింది. 2022లో వారికి విడాకులు మంజూరు చేసింది కోర్డ్.