- Home
- Entertainment
- ఈ ఫొటోలో ఉన్న చిన్నారి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్, ఎవరో తెలుసా..ఆంధ్ర నుంచి ముంబైకి, చివరికి షార్జాలో సెటిల్
ఈ ఫొటోలో ఉన్న చిన్నారి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్, ఎవరో తెలుసా..ఆంధ్ర నుంచి ముంబైకి, చివరికి షార్జాలో సెటిల్
ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తు పట్టగలరా ? ఆమె టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్. కుటుంబ కథా చిత్రాలకు ఆమె కేరాఫ్ అడ్రస్. ఆ హీరోయిన్ ఎవరో తెలియాలంటే ఈ కథనం చూడండి.

ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా ?
టాలీవుడ్ లో ఇప్పటి వరకు చాలా మంది హీరోయిన్లు వచ్చారు. ఇంకా వస్తుంటారు. కొందరు యువతలో మంచి గుర్తింపు తెచ్చుకుంటే మరికొందరు హీరోయిన్లు ఫ్యామిలీ ఆడియన్స్ లో చెరగని ముద్ర వేశారు. అలనాటి హీరోయిన్లలో ఆమని, సౌందర్య లాంటి వారు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. వారి తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ని అంతలా మెప్పించిన హీరోయిన్ స్నేహ. ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి స్నేహానే.
స్నేహ కుటుంబ నేపథ్యం
స్నేహ అసలు పేరు 'సుహాసిని రాజారామ్ నాయుడు'. సినిమాల్లోకి వచ్చాక తన స్క్రీన్ నేమ్ స్నేహగా మార్చుకున్నారు. స్నేహ జీవితం, సినీ కెరీర్ చాలా డ్రమాటిక్ గా సాగింది. ఆమె కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ కి చెందినవారే. అయితే వ్యాపార రీత్యా ముంబైలో సెటిల్ అయ్యారు. తన వ్యాపారం పెద్దది కావడంతో స్నేహ తండ్రి యూఏఈ లోని షార్జాకి వెళ్లారు. ఫ్యామిలీ కూడా అక్కడే సెటిల్ అయింది.
క్రికెట్ స్టేడియంలో స్నేహని చూసిన నిర్మాత
స్నేహ జాతకం మారింది షార్జాలోనే. అక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా ఓ మలయాళీ ప్రొడ్యూసర్ స్నేహని స్టేడియంలో చూశారు. ఆమె లుక్స్ కి ఆయన ఇంప్రెస్ అయ్యారు. ఆ విధంగా స్నేహ 2000 సంవత్సరంలో మలయాళీ చిత్రం ద్వారా నటిగా పరిచయం అయింది. షార్జాలో బిజినెస్ లో నష్టాలు రావడంతో స్నేహ ఫ్యామిలీ ఆ తర్వాత తిరిగి ముంబై వచ్చేశారు. ఇంతలో స్నేహకి సినిమాల్లో ఆఫర్స్ మొదలయ్యాయి.
టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు
స్నేహ మొదట నటించిన మలయాళీ ఇండస్ట్రీ లో కంటే ఆమెకి తమిళ, తెలుగు భాషల్లో ఎక్కువగా ఆఫర్స్ వచ్చాయి. 2001లో స్నేహ తరుణ్ కి జంటగా ప్రియమైన నీకు చిత్రంలో నటించింది. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో స్నేహ కెరీర్ జోరందుకుంది. హనుమాన్ జంక్షన్, వెంకీ, శ్రీరామదాసు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు స్నేహ ఖాతాలో పడ్డాయి. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు టాలీవుడ్ లో స్నేహ హవా కొనసాగింది.
చివరగా వినయ విధేయ రామ మూవీలో..
స్నేహ తన కెరీర్ లో ఎప్పుడూ హద్దులు దాటి గ్లామర్ ప్రదర్శించలేదు. 2012లో స్నేహ నటుడు ప్రసన్నని ప్రేమ వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం. ప్రస్తుతం స్నేహ సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. ఆమె తెలుగు సినిమాలో కనిపించి ఆరేళ్ళు అవుతోంది. వినయ విధేయ రామ మూవీ తర్వాత తెలుగులో ఆమె మళ్ళీ నటించలేదు.