48 రోజుల పాటు ఆగకుండా పీరియడ్స్ : అదా శర్మ కు అరుదైన ఆరోగ్య సమస్య
2023లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘ది కేరళ స్టోరితో’ అదా శర్మ ఒక్కసారిగా సెన్సెషన్ అయ్యింది.

సినిమాల్లో నటించేటప్పుడు పేరు, డబ్బు ఈ రెండు వస్తాయి. సక్సెస్ ఆనందాన్ని ఇస్తుంది. కానీ అదే సమయంలో అందుకోసం పడే కష్టం కొన్ని సార్లు అనారోగ్యాలను తెచ్చిపెడుతుది. అలాంటి ఓ అరుదైన సమస్యతో ఇబ్బందిపడుతున్నాను అంటోంది అదాశర్మ. తన హెల్త్ ఇష్యూలకు కారణం తను సినిమాల కోసం చేసిన డైటింగ్ లు అంటోంది. వివరాల్లోకి వెళ్తే...
ఇటీవల కేరళ స్టోరీ, బస్తర్.. సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన అదా శర్మ(Adah Sharma) ప్రస్తుతం అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగులో ఇప్పుడు అదా శర్మ ‘C.D(క్రిమినల్ ఆర్ డెవిల్)’ అనే సినిమాతో రాబోతుంది. SSCM ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కృష్ణ అన్నం దర్శకత్వంలో అదా శర్మ మెయిన్ లీడ్ లో విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, మహేష్ విట్టా.. పలువురు ముఖ్య పాత్రలతో ఈ ‘C.D(క్రిమినల్ ఆర్ డెవిల్)’ సినిమా తెరకెక్కింది. అయితే తనకు ఆనందం ఉండటం లేదంటోంది అదా శర్మ.
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘హార్ట్ ఎటాక్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక మొదటి సినిమాతోనే కుర్రాళ్ల గుండెలను దొచేసిన ఈ బ్యూటీకి తెలుగులో వరుస అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ,ఆశించిన స్థాయిలో అదాకు అవకాశాలు మాత్రం దక్కలేదు. దీంతో పలు చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. అయితే ఈ క్రమంలోనే 2023లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘ది కేరళ స్టోరితో’ అదా శర్మ ఒక్కసారిగా సెన్సెషన్ అయ్యింది.
అప్పటిదాకా ఆమెను పెద్దగా పట్టించుకోని వారు సైతం ది కేరళ స్టోరి మూవీ తర్వాత పిలిచి ఆఫర్స్ ఇస్తున్నారు. ఆ స్దాయిలో కేరళ స్టోరీ అదాకు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టిందనే చెప్పవచ్చు. ఇక ఆ సినిమా తర్వాత అదా బస్తర్ ‘ది నక్సల్ స్టోరీ’ మూవీలో నటించింది. ఇక ఈ మూవీ కూడా మంచి విజయం సాధించడంతో ఇండస్ట్రీలో ఈ అమ్మాడు ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అదే సమయంలో ఈ బ్యూటీ తనకు ఓ అరుదైన వ్యాధి వచ్చిందని షాకింగ్ విషయాలను బయట పెట్టింది. పైగా అది కూడా సినిమాల వల్లనే అని పేర్కొంది.
అదా శర్మ మాట్లాడుతూ.. నేను ది కేరళ స్టోరి మూవీలో నటించనప్పుడు కాలేజీ అమ్మాయిలా కనిపించడానికి బరువు తగ్గాల్సి వచ్చింది. ఆ తర్వాత బస్తర్ ది నక్సల్ మూవీలో నటించినప్పుడు బరువు పెరిగాను. ఎందుకంటే.. ఆ సినిమాలో బరువైన గన్‌లను మోయాలి కాబట్టి లావుగా కనిపించడంతో పాటుగా కాస్త బలంగా ఉండడానికి 10 నుంచి 12 వరకు అరటి పండ్లు తిన్నాను. అలాగే గింజలు, డ్రై ఫ్రూట్స్ ఫ్లాక్ సీడ్స్ ఉన్న లడ్డూలను నాతో పాటు షూటింగ్ కు తీసుకెళ్లాను.
ఈ క్రమంలోనే.. నిద్రపోయే అరగంట ముందు రెండు లడ్డులు తినేదాన్ని. కానీ ఇప్పుడు మరో సినిమా కోసం నేను బరువు తగ్గాల్సి వచ్చింది. ఇలా నెలల వ్యవధిలోనే బరువు తగ్గడం, మళ్లీ పెరగడం, ఆ తర్వాత తగ్గడం వలన నా శరీరంలో రకరకాల మార్పులు చోటు చేసుకోవడంతో పాటు నేను ఒత్తిడికి గురయ్యాను. దీని వల్ల అనారోగ్యంకు గురయ్యాను. కాగా, నాకు ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ వ్యాధి వచ్చింది.
ఎండోమెట్రియోసిస్ అంటే పీరియడ్స్ నాన్‌స్టాప్‌గా కొనసాగుతూ ఉంటుంది. ఈ జబ్బు కారణంగా నేను దాదాపు 48 రోజుల పాటు ఆగకుండా వచ్చే పీరియడ్స్‌తో చాలా ఇబ్బంది పడ్డాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అదా శర్మ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక విషయం తెలిసిన అభిమానులు త్వరగా కోలుకోమని, నిర్లక్ష్యం చేయద్దని మంచి ట్రీట్మెంట్ తీసుకుని రెస్ట్ తీసుకోమని చెప్తున్నారు.
అదా శర్మ 2008లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ‘1920’ అనే సినిమా ద్వారా పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. పునీత్ రాజ్‌కుమార్‌తో ‘రణ విక్రమ’ చిత్రంలో నటించింది. తెలుగు, తమిళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదా శర్మ నటనను కొనసాగించడానికి చదువును పక్కన పెట్టేసింది. ముందుగా ఆమె జిమ్నాస్టిక్స్ నేర్చుకోవాలని అనుకుంది. ఆ తర్వాత నటనపై ఆసక్తి పెరిగింది. సెకండరీ పీయూసీ పూర్తి చేసి ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చింది. అదా శర్మ శిక్షణ తీసుకున్న డాన్సర్. మూడేళ్ల వయసులోనే నాట్యం నేర్చుకుంది. తర్వాత గోపీకృష్ణ డాన్స్ అకాడమీలో చేరింది. అమెరికాలో శిక్షణ పొందింది. ఆమె జిమ్నాస్టిక్స్‌లో కూడా శిక్షణ పొందింది.
అదా శర్మకు జంతువులంటే చాలా ఇష్టం. వీధికుక్కలను దత్తత తీసుకోవాలని తన అభిమానులను కోరుతుంది. ఖరీదైన జంతువులను కొనుగోలు చేయకుండా వీధికుక్కలను పెంచాలని కోరుతుంది ఈ చిన్నది. అదా శర్మ లుక్స్ పై గతంలో చాలా విమర్శలు ఎదురుకొంది. ఆ తర్వాత అందరూ ఆమె నటనను మెచ్చి అవకాశాలు ఇవ్వడం ప్రారంభించారు. అదా శర్మ తన నటనతో పాటు గ్లామర్ పాత్రలు కూడా చేస్తూ మెప్పిస్తుంది.
‘ది కేరళ స్టోరి’ సినిమాతో అదా శర్మ చాలా పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రజలు తనను అదా అని గుర్తించినప్పటికీ అది తన అసలు పేరు కాదని రీసెంట్‌గా అదా శర్మ వెల్లడించారు. ఒక యూట్యూబర్‌తో జరిగిన ఇంటరాక్షన్‌లో తన అసలు పేరు చాలా పొడవుగా ఉంటుందని చెప్పారు. అదా శర్మ అసలు పేరు ‘చాముండేశ్వరి నరసింహన్ సుందరేశన్ అయ్యర్’ అట. తన పేరు మార్చుకోవడానికి కారణం ఏంటంటే? అంత పొడవైన పేరు అందరికీ చెప్పడం కష్టంగా ఉండటంతో అదాగా మార్చుకున్నారట.
అదా శర్మ 2008 లో ‘1920’ అనే బాలీవుడ్ హారర్ మూవీతో ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో హార్ట్ అటాక్, సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గరం, క్షణం వంటి సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. కమాండో వెబ్ సిరీస్‌లో బావనా రెడ్డి పాత్రలో అలరించారు.
వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ'కి ప్రారంభంలో ఎలాంటి ప్రచారం దక్కిందో 'బస్తర్' కి కూడా అలాంటి ప్రచారం దక్కింది. కానీ టికెట్ విండో వద్ద తేలిగ్గా చతికిలబడింది. ఇటీవలి ఇంటర్వ్యూలో అదా తన సినిమా ఫెయిల్యూర్ గురించి అసహనం వ్యక్తం చేసింది. ఒకసారి ప్రజలు సినిమా చూస్తే, దాని గురించి వారు అర్థం చేసుకుంటారు. కానీ నేను కేరళ స్టోరీ సమయంలో చెప్పినట్లు.. ఇది ప్రజాస్వామ్యం.. ప్రజలు సినిమాను చూడాలా వద్దా అనేది వారే వ్యాఖ్యానిస్తారు. సినిమా చూసిన తర్వాత కామెంట్ చేయాలి... అలాగే సినిమా చూడకుండా కామెంట్లు చేసే వారిని కూడా మనం గౌరవించాలి.. ఎందుకంటే అది వారి ఇష్టం.. అంటూ పరిణతితో వ్యాఖ్యానించింది.