మీ హార్ట్ బీట్ పెంచే 3 సస్పెన్స్ థ్రిల్లర్స్, ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకండి
సస్పెన్స్, హారర్ సినిమాలకు స్పెషల్ గా ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి అభిమానుల కోసం ఓటీటీలో తప్పక చూడాల్సిన టాప్ 3 సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఏంటో తెలుసా?

హార్ట్ బీట్ పెంచే 3 సస్పెన్స్ థ్రిల్లర్స్
కొందరికి ఎంత భయమున్నా, సస్పెన్స్, హారర్ సినిమాలు చూడటం మాత్రం అస్సలు మానేయ్యారు. భయం వేస్తున్నా… అలాంటి సినిమాలపై ఆసక్తి ఉంటుంది. కానీ ఏ సినిమా చూడాలో తెలియక కన్ఫ్యూజన్ లో ఉండేవారు కూడా కొందరు ఉన్నారు. అందుకే అలాంటి వారికోసం మూడు హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు, వాటి వివరాలు.
Girl In the Basement
నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసిన సినిమా ఇది. 2021లో విడుదలైన ఈమూవీ ఎంతో ఉత్కంఠతో కొనసాగుతుంది. ఒక తండ్రి తన కూతురిని 24 ఏళ్లుగా బేస్‌మెంట్‌లో బంధించి హింసిస్తాడు. ఆమె ఎలా తప్పించుకుందో ఈ సినిమాలో చూడొచ్చు. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో అందుబాటులో ఉంది.
The Skin I Live in
కూతురిపై అత్యాచారం చేసిన యువకుడిపై ప్రతీకారం తీర్చుకునే వైద్యుడి కథ ఇది. ఆ యువకుడిపై శాస్త్రీయ ప్రయోగాలు చేసి అమ్మాయిగా మారుస్తాడు ఆతండ్రి. తర్వాత ఏం జరిగిందో సినిమాలో చూడండి. ఈసినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
Fall Guy
ఇది సినిమా షూటింగ్ చుట్టూ తిరిగే కథ. ఇందులో హీరో కిడ్నాప్ అవుతాడు. హీరోను కనుగొనే బాధ్యత ఒక స్టంట్ ఆర్టిస్ట్‌పై పడుతుంది. అతను హీరోను ఎలా కనుగొంటాడో సినిమాలో చూడండి. ఈసినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓటీటీలో అందుబాటులో ఉంది.