మరో వివాదంలో మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా
తనను దౌర్జన్యంగా స్టూడియో ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని, స్టూడియోలో ఉన్న వస్తువులన్నింటినీ కూడా ధ్వంసం చేసి, బలవంతంగా వెళ్లగొట్టేందుకు ఎల్వీ ప్రసాద్ మనవుడు సాయి ప్రసాద్ ప్రయత్నం చేస్తున్నారని ఇళయరాజా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా గత 40 సంవత్సరాలుగా చెన్నైలోని ఎల్వీ ప్రసాద్ స్టూడియోలో తనకు కేటాయించిన స్టూడియో నుంచే మ్యూజిక్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ స్టూడియో విషయంలో వివాదం నెలకొంది. అసలు వివాదంలోకి వెలితే. 40 ఏళ్ల క్రితం ఎల్వీ ప్రసాద్ స్టూడియో నిర్మిస్తున్న సమయంలో ఇళయారాజా మీద ప్రేమతో కొంత స్థలాన్ని ఓ గదిని మ్యూజిక్ స్టూడియో కోసం ఇచ్చారు.
అప్పటి నుంచి రాజా ఆ గది నుంచే తన సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఇళయరాజాను అక్కడి నుంచి ఖాళీ చేయించాలని ఎల్వీ ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్ ప్రయత్నిస్తున్నారు. వెంటనే ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని సాయి ప్రసాద్, ఇళయరాజకు కూడా చెప్పారు. అయితే ఇళయరాజా మాత్రం ఈ స్థలాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారని చెప్పారు. ఈ మేరకు కోర్టులో కూడా పిటిషన్ వేశారు ఇళయరాజా.
కానీ సాయి ప్రసాద్ మాత్రం ఇళయరాజా వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ విషయం కొన్ని సంవత్సరాలుగా కోర్టులో నలుగుతోంది. అయితే ఇటీవల ఆయన్ను దౌర్జన్యంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని, స్టూడియోలో ఉన్న వస్తువులన్నింటినీ కూడా ధ్వంసం చేసి, బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఇళయరాజా చెబుతున్నారు.
అయితే సాయి ప్రసాద్ వాదన మరోలా ఉంది. ఇళయరాజాకు ఈ స్థలాన్ని కొతంకాలం స్టూడియో నడుపుకునేందుకు మాత్రమే ఇచ్చారని, పూర్తిగా తనకే రాసివ్వలేదని ఆయన చెబుతున్నారు. ఇన్నేళ్లు ఈ స్థలాన్ని వాడుకుంది చాలు. ఇక ఖాళీ చేయాలని సాయి ప్రసాద్ వాదిస్తున్నారు. చాలా కాలంగా ఈ వివాదం జరుగుతున్నా తాజా ఇళయరాజ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ వివాదం తెర మీదకు వచ్చింది.
ఇటీవల ఇళయరాజ తరువాత వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. తన పాటలను తన అనుమతి లేకుండా స్టేజ్ మీద పాడ వద్దంటూ ఏకంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు నోటీసులు ఇవ్వటం ఇటీవల చర్చనీయాంశం అయ్యింది. సంగీత దర్శకులకు రాయల్టీ విషయంలో ఇళయరాజ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.