'గేమ్ ఛేంజర్' రిలీజ్ డేట్ పై హింట్ ఇచ్చేసిన తమన్
పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఇది రానుంది. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది.
game changer
రామ్ చరణ్ (Ram Charan) నటిస్తోన్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) అప్ డేట్స్ గురించి అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ అప్‌డేట్ కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రం రిలీజ్ డేట్ గురించి ఓ అప్‌డేట్‌ను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. దీంతో ‘గేమ్ ఛేంజర్’ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా కావడంతో బడ్జెట్ విషయంలో ఆయన ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారట. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఇది రానుంది. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ సరసన కియారా అడ్వాణీ నటిస్తోన్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నారు. శ్రీకాంత్, అంజలి, ఎస్.జే.సూర్య, సునీల్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాని క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్టు నిర్మాత దిల్ రాజు ఇటీవల వెల్లడించారు. కానీ, తేదీని ప్రకటించలేదు. సంగీత దర్శకుడు తమన్ (thaman) తాజా పోస్ట్ ఆ లోటు తో దాన్ని కన్ఫర్మ్ చేసారు ‘‘వచ్చే వారం నుంచి డిసెంబరు 20 వరకూ ఈవెంట్స్, ప్రమోషన్స్ ఉంటాయి. రెడీగా ఉండండి’’ అని అప్‌డేట్ ఇచ్చారు.
దీంతో, రామ్ చరణ్ అభిమానులు, సినీ లవర్స్ ఆ సినిమా డిసెంబరు 20న విడుదల కానుందంటూ కామెంట్స్ రూపంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ తమన్ పోస్ట్‌ను రీ పోస్ట్ చేయడం చెప్పుకోదగ్గ విషయం.
ఈ సినిమా గురించి శంకర్ మాట్లాడుతూ.. ‘‘నేను తెరకెక్కించిన తమిళ చిత్రాలకు తెలుగులోనూ మంచి ఆదరణ దక్కింది. అందుకే నేరుగా తెలుగులోనే ఓ సినిమా తీయాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాణ్ని. ఆ మేరకు చేసిన కొన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ఎట్టకేలకు ‘గేమ్ ఛేంజర్’తో నా కల నెరవేరుతోంది. కార్తీక్ సుబ్బరాజు కథతో దీన్ని రూపొందిస్తున్నా. ఇది పూర్తిస్థాయి యాక్షన్ చిత్రం. నా నుంచి ఇలాంటి మాస్ సినిమా వచ్చి చాలా కాలమైంది’’ అంటూ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించారు.
శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ‘గేమ్ ఛేంజర్’. చరణ్ ద్విపాత్రాభినయం చేసినట్టు సమాచారం. కియారా అడ్వాణీ హీరోయిన్. శ్రీకాంత్, ఎస్.జె. సూర్య, అంజలి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ‘ గేమ్ ఛేంజర్ ‘ లో తనదైన స్టైల్ లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే లక్ష్యంతో దూసుకుపోతున్నాడు చెర్రీ.
ఇక ఈ సినిమాతో ఇలాగూన బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని మరో సారి తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ కోసమే మేకర్స్ ఏకంగా మూడు కోట్ల వరకు ఖర్చు చేసినట్లు వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
Game Changer Movie
'ఆర్ఆర్ఆర్'తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్.. దీని తర్వాత చేస్తున్న మూవీ 'గేమ్ ఛేంజర్' కావటంతో అంచనాలు బాగా ఉన్నాయి. దాదాపు మూడేళ్ల నుంచి సెట్స్‌పైనే ఉంది. డిసెంబర్ 20 న రిలీజ్ ఉండే అవకాసం ఉంది. అలాగే శంకర్ రూపొందించిన భారతీయుడు-2 ఇటీవల విడుదలైంది. ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది.
అందరీకీ నష్టాలు మిగిల్చింది. శంకర్ ఏంటి ఇంత పేలవమైన కథ,కథనంతో వచ్చారు. బోర్ గా ఉంది అనే కామెంట్స్ వినిపించాయి. కమల్ హాసన్ కెరీర్ లో ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అని తేల్చారు. ఇప్పుడు ఓటిటి రిలీజ్ లోనూ నెగిటివ్ ట్రెండ్ నడుస్తోంది.. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఇంపాక్ట్ ఖచ్చింగా రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ పై ఉంటుందంటోంది ట్రేడ్. దాంతో బిజినెస్ పరంగానూ దిల్ రాజుకు ఇది పెద్ద ఛాలెంజే.
Game Changer
కానీ భారతీయుడు 2 చిత్రం డిజాస్టర్ కావటంతో లెక్కలు మారిపోయాయి. శంకర్ డైరక్టర్ కావటంతో ఈ సినిమాపై ఇంపాక్ట్ పడతుంది. భారతీయుడు -2 డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు మెగా అభిమానులందరికి ఒకింత ఆందోళన మొదలైంది. భారతీయుడు -2 ప్రభావం గేమ్ ఛేంజర్ పై ఎంతవరకు ఉంటుందో అని నిర్మాత దిల్ రాజు కు కూడా చిన్నపాటి ఉత్కంఠగా ఉన్నారని సమాచారం. రెండు చిత్రాలకు ఒకేసారి సమాంతరంగా పనిచేయడం వల్ల సినిమా క్వాలిటీ అంతగా బాగా రాదనే ప్రచారం జరుగుతోంది.
game changer movie
ఈ నేపధ్యంలో దిల్ రాజు ...ఈ ప్రాజెక్టుని ఇప్పుడు తన చేతుల్లోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఇండియన్ 2 రిలీజ్ తర్వాత ఇమ్మీడియట్ గా గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసారు. క్రిస్మస్ రిలీజ్ గా చెప్పుకొచ్చారు.అలాగే మరో ప్రక్క గేమ్ ఛేంజర్ డబ్బింగ్ పనులు మొదలెట్టారు. అన్నీ తనే పర్యవేక్షిస్తున్నారు. క్రిస్మస్ సీజన్ కు ఎట్టి పరిస్దితుల్లోనూ రావాల్సిందే అని ఆయన పనులు పరుగెట్టిస్తున్నారు. అలాగే బడ్జెట్ ఇంక పెరగకుండా,షూటింగ్ ఫోస్ట్ ఫోన్ అవ్వకుండా జాగ్రక్తలు పడుతున్నారు. దిల్ రాజు సీన్ లోకి రావటంతో డిస్టిబ్యూటర్స్ లో పూర్తి నమ్మకం వస్తోంది. ఎందుకంటే సినిమాకు ప్రాణం పెట్టే నిర్మాత దిల్ రాజు కాబట్టి,