- Home
- Entertainment
- శ్రీదేవికి మెంటల్ గా పరిపక్వత లేదు, రాత్రంతా చెరువులో జనాలు వెతికితే.. తీవ్ర విషాదంపై మురళి మోహన్
శ్రీదేవికి మెంటల్ గా పరిపక్వత లేదు, రాత్రంతా చెరువులో జనాలు వెతికితే.. తీవ్ర విషాదంపై మురళి మోహన్
శ్రీదేవికి మెంటల్ గా అంత పరిపక్వత లేదు. చిన్న పిల్లలాగే బిహేవ్ చేసేది. ఎప్పుడూ చిన్న పిల్లల్ని వెంట వేసుకుని తిరిగేది. షూటింగ్ లో కూడా అంతే. ఒక రోజు చైల్డ్ ఆర్టిస్ట్ లతో షూటింగ్ ఉంది.
- FB
- TW
- Linkdin
Follow Us

టాలీవుడ్ సీనియర్ నటుడు మురళి మోహన్ కి చిత్ర పరిశ్రమలో అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. వివాద రహితుడిగా మురళి మోహన్ గుర్తింపు సొంతం చేసుకున్నారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, మా ప్రెసిడెంట్ గా సైతం మురళి మోహన్ రాణించారు.
అయితే మురళి మోహన్ సినిమాలు చేస్తూనే వ్యాపారాల్లో కూడా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ లో దూసుకుపోతున్నారు. ఈ విషయాన్ని మురళి మోహన్ పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. మురళి మోహన్ అయిష్టంగా సినిమాల్లోకి వచ్చారట. ఓ ఇంటర్వ్యూలో మురళి మోహన్ మాట్లాడుతూ.. అంతకు ముందు సరదా కోసం నాటకాలు వేసేవాడిని.
శోభన్ బాబు ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చా. కొన్ని చిత్రాల్లో నటించిన తర్వాత 'మా బంగారక్క' అనే చిత్రంలో దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో నటించా. ఈ చిత్రంతోనే శ్రీదేవి హీరోయిన్ గా పరిచయం అయింది. అంతకు ముందు ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలు చేసింది.
ఈ చిత్రంలో నటించే సమయానికి శ్రీదేవికి మెంటల్ గా అంత పరిపక్వత లేదు. చిన్న పిల్లలాగే బిహేవ్ చేసేది. ఎప్పుడూ చిన్న పిల్లల్ని వెంట వేసుకుని తిరిగేది. షూటింగ్ లో కూడా అంతే. ఒక రోజు చైల్డ్ ఆర్టిస్ట్ లతో షూటింగ్ ఉంది. అవుట్ డోర్ లో ఆ షూటింగ్ చేయాలి. ప్రొడక్షన్ వాళ్ళు కొంత మంది పిల్లలని తీసుకువచ్చారు. చైల్డ్ ఆర్టిస్ట్ లలో ఒక అమ్మాయి చెల్లి కూడా వచ్చింది.
ఆ పాప చైల్డ్ ఆర్టిస్ట్ లిస్ట్ లో లేదు. కానీ షూటింగ్ చూడాలి అంటే తీసుకువచ్చారట. దీనితో శ్రీదేవి ఆ పిల్లలతో ఆడుకుంటూ ఉంది. ప్రొడక్షన్ వాళ్ళు తాము తీసుకువచ్చిన పిల్లల్ని కౌంట్ చేసుకుని గమనిస్తున్నారు. ఈ పిల్ల ఏమో లిస్ట్ లో లేదు. సాయంత్రం షూటింగ్ ముగిసే సమయానికి ఆ పాప తల్లిదండ్రులు వచ్చారు. మా అమ్మాయి ఏది అని అడిగారు. మీ అమ్మాయి మా సినిమాలో లేదు కదా అని చెప్పాం.
లేదండీ.. ఇంకొక పాప ఉంది.. ఆపాపతో స్నేహంగా షూటింగ్ చూడాలని వచ్చింది అని చెప్పారు. చెరువులో షూటింగ్ జరిగిన తర్వాత కనిపించడం లేదు అని అన్నారు. దీనితో షూటింగ్ లో ఉన్న వాళ్ళు.. ఊరి జనం అంతా చెరువులో వెతకడం ప్రారంభించారు. అప్పటికే చీకటి పడింది. తెల్లవారు జాము అయ్యేసరికి చెరువులో బురదలో కూరుకుపోయి కనిపించింది. దాసరి నారాయణరావు, నేను అందరం తీవ్రంగా విషాదానికి గురైనట్లు మురళి మోహన్ తెలిపారు.